'శార్వరి' నామ సంవత్సర రాశి ఫలాలు        

By సుభాష్  Published on  25 March 2020 5:16 AM GMT
శార్వరి నామ సంవత్సర రాశి ఫలాలు        

మేష రాశి :(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)

ఆదాయం: 5, వ్యయం: 5 ; రాజపూజ్యం: 3, అవమానం: 1

శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ విషయాల్లో శుభపరిణామాలు కలగననున్నాయి. న్యాయపోరాటాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. గృహనిర్మాణం యత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. గురువు వక్రగమనంలో ఉండే మే - సెప్టెంబర్‌ మధ్య ఆందోళనలు అధికం. వృత్తిలో ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. శుభప్రదుడైన గురుగ్రహం ఈ ఏడాది 9, 10 స్థానాల్లో సంచరించడం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్‌ రంగాలవారికి ప్రోత్సాహకరం. సంతానప్రాప్తి ఉంది. కళలు, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పునకు అనుకూలం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. ఈ ఏడాది 10వ స్థానంలో శని సంచారం ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పై అధికారుల నుంచి ఒత్తిళ్లు అధికం. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధ్యవర్తిత్వాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. మే 12-సెప్టెంబర్‌ 29 మధ్య శని వక్రించిన కారణంగా వృత్తి, వ్యాపారాల్లో ఓరిమితో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం. అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు. కండరాలు, భుజాల సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఏడాది మొదటి భాగంలో కొంత అసంతృప్తిగావున్నా ద్వితీయార్థంలో పరిస్థితి మెరుగవుతుంది. విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

వృషభం:(కృత్తిక 2,3,4; రోహిణి; మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం: 14, వ్యయం: 11 ; రాజపూజ్యం: 6, అవమానం: 1

వృషభ రాశి వారు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణబాధలు అధికం. మే - సెప్టెంబర్‌ మాసాల మధ్య రాజకీయాలు, కళలు, సినీ, రక్షణ, విద్య, ఐ.టి రంగాల వారికి అనుకూలం. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. ఉన్నత చదువులు, విదేశీ గమనానికి చేసే యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. డిపాజిట్లు, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌, షేర్ల లావాదేవీలతో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. 8, 9 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పు కోసం యత్నిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాగ్దానాలు నిలుపుకోవడం కష్టం. ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ష్యూరిటీలకు దూరంగా ఉండండి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూరప్రయాణాలు తగ్గించాలి. ఆస్తి వ్యవహారాల్లో నిదానం అవసరం. నవంబర్‌ 20 నుంచి 2021 ఏప్రిల్‌ వరకు న్యాయ, వైద్య రంగంలోని వారికి పురోగతి కనిపిస్తుంది. మే 15-సెప్టెంబర్‌ 13 మధ్య విద్యార్థుల చదువులు మందకొడిగా సాగుతాయి. అయితే ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ ఏడాది శని 9వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. న్యాయపోరాటాల్లో విజయం సాధిస్తారు. మే 12 - సెప్టెంబర్‌ 29 మధ్య శని వక్రగమనంలో ఉన్నందున పైఅధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. వృత్తిపరంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల పట్ల శ్రద్ధ చూపాలి. రాహువు కేతు సంచారం ఫలితంగా విలాసాల ఖర్చులు అధికం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. బీమా, గ్రాట్యుటీ, రుణాల విషయాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. మోకాళ్లు, పాదాలకు సంబంధించిన సమస్యలతో పాటు రక్తసంబంధ సమస్యలు బాధిస్తాయి.

మిధున రాశి : (మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం: 2, వ్యయం: 11 ; రాజపూజ్యం: 2, అవమానం: 4

ఈ ఏడాది మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. మే - సెప్టెంబర్‌ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. కంపెనీ వాటాల విలువ పెరుగుతుంది. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో నిదానం పాటించాలి. ఖర్చులు అంచనాలను మించిపోతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ధనుస్సు, మకర రాశుల్లో గురుగ్రహ సంచారం ఫలితంగా వివాహయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. క్రీడల రంగాల్లోని వారు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. వ్యాపారాన్ని విస్తరిస్తారు. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయం, కళలు, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో వున్న మే 15 - సెప్టెంబర్‌ 13 మధ్య వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత చదువుల్లో మొదట ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వ్యాపార విస్తరణకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికం. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ ఏడాది 8 స్థానంలో శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. అపరిష్కృత ఆస్తితగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమోషన్‌ అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. పెన్షన్‌, బీమా, గ్రాట్యుటీ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. మే 12 - సెప్టెంబర్‌ 29 తేదీల మధ్య ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. క్రయవిక్రయాల్లో నిదానం అవసరం. కొత్త వ్యాపారాలకిది సమయం కాదు. పై చదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 4 వరకు రాహువు మిథునంలో ఆపై వృషభ రాశిలో సంచరిస్తాడు. అదే కాలంలో కేతువు ధనుస్సు, వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తాడు. ఫలితంగా దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. . స్నేహానుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓరిమితో వ్యవహరిస్తే విజయం మీ సొంతం అవుతుంది. .

కర్కాటక రాశి: (పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం: 11, వ్యయం: 8 ; రాజపూజ్యం: 5, అవమానం: 4

కర్కాటక రాశి వారు ఈ ఏడాది వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. పెట్టుబడులు లాభిస్తాయి. నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పెద్దలు, ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రేమలు, వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాల ప్రారంభానికి అనుకూలం. విదేశీ గమన యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. మే-సెప్టెంబర్‌ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉన్నత చదువులకై చేసే యత్నాలు ఫలిస్తాయి. ఈ ఏడాది మీ రాశి నుంచి 6, 7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మే 15 - సెప్టెంబర్‌ 13 మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. కొత్త వ్యాపారాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో శని సంచారం ఫలితంగా వివాహ యత్నాలు ఫలిస్తాయి. వేడుకలు, శుభకార్యాలకు అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. మే 12 - సెప్టెంబర్‌ 29 మధ్య గురువు వక్రించిన ఫలితంగా వైవాహిక జీవితంలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. విలాసాలకు ఖర్చులు చేయడం మానాలి. బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి వస్తుంది. ఉదర సంబంధ సమస్యలు బాధిస్తాయి. 12, 11 స్థానాల్లో రాహువు, 6, 5 స్థానాల్లో కేతువుల సంచారం ఫలితంగా ఖర్చులు అంచనాలు మించుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మనసు ఆందోళనగా ఉంటుంది. విలాసాలకు ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉదర సంబంధమైన సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

సింహ రాశి: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)

ఆదాయం: 14, వ్యయం: 2 ; రాజపూజ్యం: 1, అవమానం: 7

శ్రీ శార్వరి నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఈ ఏడాది ప్రేమానుబంధాలు బలపడతాయి. పెద్దల సలహాలతో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత చదువులకై చేసే యత్నాలు ఫలిస్తాయి. పొదుపు పథకాలపై మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణభారం తగ్గుతుంది. సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. మే - సెప్టెంబర్‌ల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. 5, 6 స్థానాల్లో గురువు సంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీలోని సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న మే 15 - సెప్టెంబర్‌ 13 మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు బాధిస్తాయి. శని ఈ సంవత్సరమంతా 6వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. వ్యాపార విస్తరణకు అవకాశం. రుణబాధలు తీరుతాయి. శని వక్రించిన మే 12 - సెప్టెంబర్‌ 29 మధ్య పెట్టుబడుల్లో నష్టం సంభవించే అవకాశం ఉంది. రుణబాధలు అధికమవుతాయి. వ్యాపార రంగంలోని వారికి నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. రాహు, కేతువు సంచారం కారణంగా మనసు చంచలంగా ఉంటుంది. ఫలితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతారు. మీకు మంచి చెప్పే వారిని అపార్థం చేసుకుంటారు. స్నేహానుబంధాల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో, పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు తగదు.

కన్యారాశి: (ఉత్తర 2,3,4; హస్త; చిత్త1,2 పాదాలు)

ఆదాయం: 2, వ్యయం: 11 ; రాజపూజ్యం: 4, అవమానం: 7

కన్యా రాశి వారు ఈ సంవత్సరం ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైన కాలం. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. గృహనిర్మాణ యత్నాల్లో విజయం సాధిస్తారు. గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారు పురోగతి సాధిస్తారు. మే- సెప్టెంబర్‌ మాసాల మధ్య ఖర్చులు అధికం. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులెదురవుతాయి. ఈ ఏడాది 4, 5 స్థానాల్లో బృహస్పతి సంచారం ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరం. విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. పై చదువులకై చేసే యత్నాలు ఫలిస్తాయి. రుణభారాలు తగ్గుతాయి. తల్లిదండ్రుల నుంచి లబ్ధిపొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. గురువు వక్రగమనంలో ఉండే మే 15 - సెప్టెంబర్‌ 13 మధ్య రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది 5వ స్థానంలో శని సంచారం కారణంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కష్టంలో వున్న వారికి సాయం చేస్తారు. భారీ ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరాశకు గురవుతారు. శని వక్రగమనంలో వున్న మే 12-సెప్టెంబర్‌ 29 మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్యం, కేటరింగ్‌, రిటైల్‌, హోటల్‌ రంగాల వారికి శుభప్రదం. ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 4 వరకు రాహువు మిథునంలో ఆపై వృషభ రాశిలో సంచరిస్తాడు. కేతువు ధనుస్సు, వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తాడు. ఫలితంగా వాహనం నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం లేదా ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. స్నేహ, బాంధవ్యాలు పెంపొందుతాయి. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. విలాసాలకు ఖర్చు చేస్తారు.

తుల రాశి:(చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం: 14, వ్యయం: 11 ; రాజపూజ్యం: 7, అవమానం: 7.

తులా రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు ఫలిస్తాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్‌లు అందుకుంటారు. ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్సల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరం. గతంలో చేసిన శ్రమకు ప్రతిఫలం అందుకుంటారు.. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. మే - సెప్టెంబర్‌ల మధ్య విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. గురువు నవంబర్‌ వరకు ధనుస్సులో ఆ తరువాత మకరంలో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సోదరీసోదరులు, బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు అనుకూలం. పరిచయస్తుల నుంచి సహకారం అందుకుంటారు. దూరప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువు వక్రించిన మే 15 - సెప్టెంబర్‌ 13ల మధ్య వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ ఏడాది 4వ స్థానంలో శని గ్రహ సంచారం ఫలితంగా పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వాహనయోగం వుంది. స్నేహానుబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శని వక్రించిన మే 12 - సెప్టెంబర్‌ 29 తేదీల మధ్య ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. 9, 8 స్థానాల్లో రాహువు, 3, 2 స్థానాల్లో కేతు గ్రహాల సంచారం ఫలితంగా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అవసరంలో వున్న వారికి సాయం చేస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలకు అనుకూలం. ఏడాది ప్రారంభంలో కొన్ని చికాకులు, ఆటంకాలు ఎదురైనా ఏడాది ద్వితీయార్థంలో పరిస్థితి మెరుగుపడుతుంది. హృదయ సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం వుంది.

వృశ్చిక రాశి :(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఆదాయం: 5, వ్యయం: 5 ; రాజపూజ్యం: 3, అవమానం: 3

వృశ్చిక రాశి వారికి శ్రీ శార్వరి నామ సంవత్సరంలో వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా చివరకు పట్టుదలతో అభివృద్ధి సాధిస్తారు. సొంత ఇల్లు, లేదా స్థలం సమకూర్చుకుంటారు. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. పై అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మే-సెప్టెంబర్‌ మాసాల మధ్య రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. రెండవ స్థానంలో z, గ్రహ సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిరచరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీ, ఆడిటింగ్‌ రంగాల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. మే 15 - సెప్టెంబర్‌ 13 తేదీల మధ్య గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. 3వ స్థానంలో శని సంచారం ఫలితంగా బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. శని వక్ర గమనంలో ఉన్న మే 12-సెప్టెంబర్‌ 29 తేదీల మధ్య కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం. కండరాల సమస్యలు బాధిస్తాయి. 8, 7 స్థానాల్లో రాహువు, 2, 1 స్థానాల్లో కేతువుల సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు తగిన సమయం కాదు. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. గృహ నిర్మాణ వ్యవహారాలకు ఆటంకాలు ఎదురవుతాయి.

ధనూరాశి: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

ఆదాయం: 8, వ్యయం: 11 ; రాజపూజ్యం: 6, అవమానం: 3

ధనుస్సు రాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత చదువులు, విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత అశాంతికి లోనవుతారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి.బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆడిటింగ్‌, వైద్యం, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మే - సెప్టెంబర్‌ మాసాల మధ్య ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో, నవంబర్‌ నుంచి సంవత్సరాంతం వరకు 2వ స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. బదిలీలు జరగవచ్చు. బాంధవ్యాలు బలపడతాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. గురువు వక్రించిన మే 12 - సెప్టెంబర్‌ 13 తేదీల మధ్య ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 2వ స్థానంలో శని సంచారం ఫలితంగా వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు అధికం. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం కారణంగా మాటపడాల్సి వస్తుంది. డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బందిపడతారు. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉన్న మే 12 - సెప్టెంబర్‌ 29 వరకు ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో నెమ్మది పాటించాలి. ఆర్థిక విషయాల్లో, ఇతరులకు సాయం చేసే విషయంలో ఒకటి రెండుసార్లు ఆలోచించాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మనసు చికాకుగా ఉంటుంది. రాహు, కేతు గ్రహాల సంచారం కారణంగా ఆరోగ్యం,వివాహ యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది..

మకర రాశి:(ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు)

ఆదాయం: 11, వ్యయం: 5 ; రాజపూజ్యం: 2, అవమానం: 6

మకర రాశి వారు ఈ ఏడాది ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. ప్రమోషన్‌లు, కోరుకున్న చోటకు బదిలీలు సంభవం. గృహనిర్మాణం, స్థలసేకరణ చేస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. క్రీడలు, పరిశోధన, విద్యా రంగాల వారికి విజయం. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌ రంగాలవారికి శుభప్రదం. మే-సెప్టెంబర్‌ మాసాల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. గురువు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్న ఫలితంగా విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలకు అనుకూలమైన కాలం. సినీరంగాలకు చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. టెక్స్‌టైల్స్‌, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్య ఆడిటింగ్‌ రంగాల వారికి అనుకూలం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. మే 12 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతి పనికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఓరిమితో వ్యవహరిస్తే లక్ష్యాలు సాధించగలుగుతారు. 1వ స్థానంలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పెరుగుతుంది. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. మే 12 నుంచి సెప్టెంబర్‌ 29 వరకు ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా యత్నాలు కొనసాగించి లక్ష్యాలను సాధిస్తారు. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు శుభప్రదం. ఈ ఏడాది సెప్టెంబర్‌ 4 వరకు రాహువు మిథునంలో, ఆపై వృషభ రాశిలో సంచరిస్తాడు. కేతువు ధనుస్సు - వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తాడు. ఫలితంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉదర సంబంధం లేదా నరాలకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. పై అధికారుల నుంచి ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మనసంతా చికాకుగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. ఉన్నత చదువుల కోసం చేసే యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి.

కుంభ రాశి: (ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఆదాయం: 11, వ్యయం: 5 ; రాజపూజ్యం: 5, అవమానం: 6

కుంభ రాశి వారు ఈ ఏడాది కొత్త వ్యాపారాలు ప్రారంభించి, విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి.శుభకార్యాలు జరుగుతాయి. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. మే - సెప్టెంబర్‌ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సంతానం విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలవారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్నేహానుబంధాలు పెంపొందుతాయి. విద్యార్థులకు శుభప్రదం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. నవంబర్‌ నుంచి టెక్స్‌టైల్స్‌, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్‌, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. విదేశీ గమనానికి, విదేశాలలో చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మే 15 - సెప్టెంబర్‌ 13 తేదీల మధ్య పెద్దల ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. 12వ స్థానంలో శని సంచారం ఫలితంగా బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. రుణబాధలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు, బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. తీర్థయాత్రలు, దానధర్మాలు, విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. పెద్దల సలహాలతో ముందడుగు వేయాలి. మే 12-సెప్టెంబర్‌ 29 మధ్య శని వక్రించిన ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. ఎముకలు, కండరాలు, ఉదర సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. 5, 4 స్థానాల్లో రాహువు, 11, 10 స్థానాల్లో కేతువు సంచారం వల్ల రుణ బాధలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం అధికంగా శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో ఒత్తిళ్ల కారణంగా రాజీనామా దాకా వెళతారు. ఓరిమితో వ్యవహరించాలి. ప్రేమికుల మధ్య అపోహలు నెలకొంటాయి.

మీనరాశి:(పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం: 8, వ్యయం: 11 ; రాజపూజ్యం: 1, అవమానం: 2

మీన రాశి వారు ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాల వారికి ప్రోత్సాహకరం. శుభకార్యాలు జరుగుతాయి. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశముంది. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. మే - సెప్టెంబర్‌ మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. గురువు ఈ ఏడాది 10, 11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి అధిక లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. మే 15 - ఆగస్టు 13 మధ్య బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఎవరికైనా డబ్బు ఇస్తే సకాలంలో తిరిగి రాకపోవచ్చు. 11వ స్థానంలో శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విందులు, విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. బంధుమిత్రుల కారణంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. మే 12 - సెప్టెంబర్‌ 29 మధ్య ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. 4, 3 స్థానాల్లో రాహువు, 10, 9 స్థానాల్లో కేతు గ్రహ సంచారం కారణంగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదుర్కొంటారు.అపోహలు, అపార్థాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. అశ్రద్ధ వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశముంది.

బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల కారణంగా చికాకులు అధికమవుతాయి.

Next Story