మహేష్‌, రావు రమేష్ ఫ్యామిలీ మధ్య హిలేరియ‌స్ సీన్ !

By రాణి  Published on  24 Jan 2020 12:41 PM GMT
మహేష్‌, రావు రమేష్ ఫ్యామిలీ మధ్య హిలేరియ‌స్ సీన్ !

సంక్రాంతికి విడుదలైన మా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తూ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిపిన ప్రేక్షకులకు, సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులకు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని చూసి అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇంకా ఎక్కువ చేయాలని సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, రావురమేష్ ఫ్యామిలి మెంబ‌ర్స్‌ మధ్య వచ్చే ఒక మంచి హిలేరియ‌స్ సన్నివేశాన్ని జనవరి 25(శనివారం) మార్నింగ్ షో నుండి అన్నిసెంటర్స్‌లలో యాడ్ చేస్తున్నాం అని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నామని యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెలిపారు.

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌అండ్‌టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ భారతీగా లేడీ అమితాబ్‌ విజయశాంతి పవర్‌ఫుల్‌ పాత్రలో నటించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ త‌దిత‌రులు నటించిన‌ ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, అజ‌య్ సుంక‌ర‌, త‌మ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్ టి. ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Next Story
Share it