ఆ బిడ్డ‌కు తండ్రిని నేనే.. 10 ఏళ్ల పిల్లాడు

By Newsmeter.Network  Published on  26 Jan 2020 12:31 PM GMT
ఆ బిడ్డ‌కు తండ్రిని నేనే.. 10 ఏళ్ల పిల్లాడు

స్కూల్ కు వెళ్లి చ‌దుకోవాల్పిన వ‌య‌స్సు వారిద్ద‌రిది. ఆట‌పాట‌ల‌తో కాలం గ‌డ‌పాల్సిన ఏజ్ లో ప్రేమ‌లో ప‌డ్డారు. అంతటితో ఆగ‌కుండా శారీర‌క సంబందం పెట్టారు. బాలిక గ‌ర్భం దాల్చింది. ఆ పిల్లాడికి సంతాన సామ‌ర్థ్యం లేద‌ని డాక్ట‌ర్లు చెబుతుంటే.. ఆమె గ‌ర్భానికి తానే కార‌ణం అంటున్నాడు ఆ బాలుడు. ఇంత‌కీ వాళ్ల వ‌య‌సు ఎంతో తెలుసా.. ఆ అబ్బాయికి 10ఏళ్లు.. బాలిక కు13 ఏళ్లు.. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న ర‌ష్యాలో సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఘ‌ట‌న ర‌ష్యాలో వైర‌ల్ గా మారండంతో అస‌లు విష‌యం ఏమిటా అని ఓ మీడియా సంస్థ ఇద్ద‌రిని ఇంట‌ర్వ్యూ చేసింది. వాళ్లు చెప్పిన స‌మాధానం విని అంద‌రూ నోరెళ్ల‌పెట్టారు.

వీరిద్దరూ ఓ ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో ఎద‌రుప‌డ్డార‌ట‌. తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ ప్రేమ‌ను రెండు రోజుల‌కే డేటింగ్ దాకా తీసుకెళ్లి పోయారు. త‌ర్వాత వారిద్ద‌రూ శారీర‌కంగా క‌లిసార‌ట‌. దాంతో ఆ బాలిక గ‌ర్భం దాల్చాన‌ని చెప్ప‌డం విశేషం. కాగా బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. బాలిక మరో వ్యక్తితో తిరిగి తమ కొడుకుపై నిందలు వేస్తోందని ఆరోపిస్తున్నారు.

ఈ సమయంలో ఆ పిల్లాడు అందరికీ షాకిచ్చాడు. అమ్మాయి గ‌ర్భానికి తానే కార‌ణ‌మ‌ని ఆ 10 ఏళ్ల బాలుడు చెప్పాడు. ఆమెతో తాను ఎన్నోసార్లు శారీరకంగా కలిశానని, ఆమెకు మరెవరితోనూ సంబంధం లేదని ఆ అమ్మాయిని వెనుకేసువొచ్చాడు. అయితే ఆ బాలుడిని పరీక్షించిన డాక్టర్లు మాత్రం అతడిని ఇంకా సంతాన సామర్థ్యం రాలేదని తేల్చారు. దీంతో ఆ బాలికను గర్భవతిని చేసింది ఎవరా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన టీవీలో ప్రసారం కావడంతో రష్యాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story