కుదేలైన చైనా - పెరుగుతున్న కరోనా

By రాణి  Published on  31 Jan 2020 7:02 AM GMT
కుదేలైన చైనా - పెరుగుతున్న కరోనా

ముఖ్యాంశాలు

  • రోజు గడిచిన కొద్దీ పెరుగుతున్న కరోనా కేసులు
  • కరోనా దెబ్బకు గడగడా వణికిపోతున్న చైనా
  • 170కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య
  • చైనా సరిహద్దును మూసేసిన రష్యా
  • బీజింగ్ - మాస్కో రైలు తప్ప మిగతా రైళ్లన్నీ రద్దు
  • కొనసాగుతున్న విమానాల రాకపోకలు, త్వరలోనే బంద్
  • లూనార్ న్యూఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని అనుమతి
  • చైనాకు వెళ్లే విమాన సర్వీసుల్ని నిలిపేసిన పలు ఎయిర్ లైన్లు

కరోనా వైరస్ ని కెలుక్కుని చాలా పెద్ద తప్పుచేశామన్న బాధ ఇప్పుడు చైనాను వేధిస్తోంది. ఎవరినో బాధ పెట్టాలన్న ఆలోచన ఎదురు తిరిగి ఇప్పుడు చైనానే అతలాకుతలం చేసేస్తోంది. రోజు గడిచినకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. నిన్నటికి ఆరు వేల పైచిలుకు ఉన్న కోరనా కేసులు ఇరవై నాలుగు గంటలు గడిచేసరికల్లా ఏడువేలను దాటి ఎనిమిదివేలకు చాలా దగ్గరగా వెళ్లిపోయింది. మృతుల సంఖ్య 170కి చేరుకుంది. కరోనా బాధితులతో వూహాన్ లో ఐసోలేషన్ వార్డులు పూర్తిగా నిండిపోతున్నాయ్. రష్యా చైనా దేశానికి అనుసంధానమై ఉన్న 2.600 మైళ్ల సరిహద్దును మూసేస్తున్నట్టుగా ప్రకటించింది. అలా చెయ్యని పక్షంలో కరోనా హద్దులు దాటి తమ దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ఆ దేశం భయపడుతోంది. మంగోలియా, నార్త్ కొరియాలమీదుగా సాగే ఈ బోర్డర్ నుంచి చాలా తేలిగ్గా కరోనా అవతలివైపుకు పాకే ప్రమాదం ఎంతైనా ఉందన్న విషయాన్ని రష్యా గుర్తించింది.

చైనా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసాల మంజూరీ నిలిపేసిన రష్యా

వాస్తవానికి ముందే ఈ బోర్డర్ ని క్లోజ్ చేయాలని నిర్ణయించారు. కానీ లూనార్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాకపోకలకు మే ఒకటో తేదీవరకూ అవకాశం కల్పించాలని నిర్ణయించిన తర్వాత అప్పటివరకూ పొడిగించారు. బీజింగ్ ని, మాస్కోని కలిపే ఒకే ఒక్క ట్రైయిన్ తప్పితే మిగతా రైళ్లన్నంటినీ నిలిపివేశారు. కానీ విమానయానం మాత్రం యధాతథంగానే ఉంది. చైనీయులకు మాత్రం ఎలక్ట్రానిక్ వీసాల మంజూరీని రష్యా ప్రభుత్వం నిలిపివేసింది. చైనీయుల్ని దేశంలోకి అనుమతించడంలేదు. రష్యాలో ఇప్పటివరకూ కరోనా వైరస్ కేసులేం కనిపించలేదు. కానీ దక్షిణకొరియాలో మాత్రం ఓ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. వ్యక్తినుంచి వ్యక్తికి సోకే మరో రకమైన ప్రమాదకరమైన వైరస్ జర్మనీలో బయట పడినట్టుగా సమాచారం. జపాన్, కెనడా, వియన్నా దేశాలు అత్యంత శ్రద్ధతో అన్ని విధాలుగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య ఆత్యయిక స్థితిని విధించడం అవసరమని కోరుతోంది.

210 మంది ప్యాసింజర్లతో జపాన్ రెండో ఫ్లైట్ టోక్యోలో ల్యాండయ్యింది. ప్రయాణికుల్లో తొమ్మిది మందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయని సిబ్బంది చెబుతున్నారు. చైనాలో చిక్కుకుపోయిన 350మంది యూరోపియన్లను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా ఇప్పటికే 195మంది అమెరికన్ పౌరుల్ని చైనా నుంచి వెనక్కి తీసుకురాగలిగింది. మిగిలిన వాళ్లను తీసుకొచ్చేందుకు మొదటి వారంలో ప్రత్యేకంగా మరికొన్ని ఫ్లైట్లను ఆర్గనైజ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. కాలిఫోర్నియా మిలటరీ బేస్ లో చైనానుంచి తిరిగొచ్చిన అమెరికా పౌరులకు వైద్య పరీక్షలు జరిపారు. సౌత్ కొరియా, బ్రిటన్, న్యూజీల్యాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి ఇతర దేశాలుకూడా చైనాలో ఉన్న తమ పౌరుల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాయి. ఇజ్హాయెల్ కి చెందిన అల్ ఎల్, స్పెయిన్ లెబ్రియా, స్కాండేవియెన్ ఎయిర్ లైన్స్, ఈజిప్ట్ ఎయిర్, కొరియెన్ ఎయిర్ పూర్తిగా చైనాకు ఫ్లైట్లని సస్పెండ్ చేశాయి.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం రిటైల్ ఔట్ లెట్లలో ఆహారం దొరకడంకూడా కష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆహారాన్ని, మందులనూ అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో చౌకగా విక్రయించాలని చైనా రాజు లీ వ్యాపారులందరికీ విజ్ఞప్తి చేశారు. కష్ట సమయంలో దేశ పౌరులకు అండగా నిలవడం అందరి బాధ్యత అని ఆయన చైనా పౌరులకు పిలుపునిచ్చారు. వీలైనంతగా ఎవరికివాళ్లు రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు.

Next Story