ప్చ్.. బాలయ్య స్టార్ డమ్ కే అవమానం !

By రాణి  Published on  23 Dec 2019 1:31 PM GMT
ప్చ్.. బాలయ్య స్టార్ డమ్ కే అవమానం !

క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ 'సాయి ధరమ్ తేజ్'తో పోటీ పడిన 'బాలయ్య' బాక్సాఫీస్ వద్ద తన ఉనికిని ఎంతవరకూ నిలబెట్టుకోగలిగారో తేల్చి చెప్పే కలెక్షన్స్ వచ్చేసాయి. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటసింహ హీరోగా వచ్చిన 'రూలర్' బాక్సాఫీస్ వద్ద డల్ ఓపెనింగ్స్ తో మొదలై.. సినిమా పెద్ద అపజయం వైపు పయనిస్తోంది. బాలయ్య స్టార్ డమ్ తో పాటు టీడీపీ సానుభూతిపరులు కూడా 'రూలర్'ను కాపాడలేకపోయారు. బాలయ్య సినిమాకి కనీస కలెక్షన్స్ కూడా లేవంటే నమ్మలేం. చిన్న హీరో సినిమాకి వచ్చే కలెక్షన్స్ కూడా బాలయ్య సినిమాకి రాకపోవటం బాలయ్యతో పాటు ఆయన అభిమానుల మనసును కూడా కలిచివేసే విషయమే. మొదటి మూడు రోజులకి గానూ 'రూలర్' ప్రపంచవ్యాప్తంగా రూ .6.62 కోట్ల థియేట్రికల్ షేర్ ను మాత్రమే వసూలు చేసింది.

రూలర్ మొదటి మూడు రోజుల కలక్షన్ల షేర్ వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

నైజాంరూ.1.22 కోట్లు
గుంటూరురూ.1.32 కోట్లు
నెల్లూరురూ.0.31 కోట్లు
ఈస్ట్రూ.0.36 కోట్లు
వెస్ట్రూ.0.37 కోట్లు
సీడెడ్రూ. 1.60 కోట్లు
ఉత్తరాంధ్రరూ. 0.45 కోట్లు
కృష్ణరూ.0.31 కోట్లు

ఏపి & తెలంగాణలో ఫస్ట్ త్రీ డేస్ కలెక్షన్స్ మొత్తం : రూ. 5.94 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 0.50కోట్లు

ఓవర్సీస్ - రూ. 0.16 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 'రూలర్'కు దక్కిన కలెక్షన్స్ మొత్తం రూ. 6.59 కోట్లు. ఈ కలెక్షన్స్ చూసి బాలయ్య స్టార్ డమ్ కే అవమానం అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story
Share it