హైదరాబాద్‌: అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఆర్టీసీ జేఏసీ భేటీ అయింది. రేపు ఇందిరా పార్క్‌ దగ్గర జరిగే ఆర్టీసీ జేఏసీ దీక్షకు కాంగ్రెస్‌ మద్దతు కోరారు. ఆర్టీసీ జేఏసీ దీక్షకు భట్టి విక్రమార్క మద్దతు ఇచ్చారు.

ఇక.. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై సమావేశం జరగనుంది. ఆరేళ్లలో ఆర్టీసీ ఆదాయం, ఖర్చులు, ప్రభుత్వ బకాయిలు, ప్రభుత్వం అందించిన సాయం వివరాలతో రావాలని సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.నేటికి రెండు రోజులుగా  ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వాహనాలు అందినకాడికి అందినంత అంటూ ప్రయాణికుల దగ్గర దోచుకుంటున్నాయి.

ప్రభుత్వం, ఉద్యోగులు ఇంకా చర్చలు కూడా స్టార్ట్ చేయకపోవడంపై ప్రయాణికులు  ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు  చెబుతున్నప్పటికీ..వారు కూడా దోచుకుంటున్నారనే  ఆరోపణలు వస్తున్నాయి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.