ప్రయాణీకులతో సహా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు..
By Newsmeter.Network Published on 18 Feb 2020 6:54 AM GMTఓ గుర్తు తెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లడం కొత్తేమీ కాదుగానీ.. అందులో ప్రయాణీకులు కూడా ఉన్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రయాణీకులతో సహా ఆర్టీసీ బస్సు చోరీ అవ్వటం స్థానికంగా కలకలం సృష్టించింది. బస్సును ర్యాష్‌గా నడుపుతుండటంతో.. ఈ డ్రైవింగ్ ఏంటని ప్రయాణికులు నిలదీయడంతో.. వికారాబాద్ శివార్లలో బస్సును రోడ్డు మీదే ఆపేసి పరారయ్యాడు. దీంత బస్సులో ఉన్నవారంతా అవాక్కయ్యారు.
తాండూరు డిపోకు చెందిన బస్సును బస్టాండ్‌లో ఆపిన డ్రైవర్, కండక్టర్ భోజనానికి వెళ్లారు. బస్సులో ప్రయాణీకులు కిక్కిరిసిపోయారు. అంతలో ఓ వ్యక్తి తానే డ్రైవర్ ని..కండక్టర్ అని చెప్పి బస్సును తీశాడు. అనంతరం ఇష్టానురీతిగా డ్రైవ్ చేస్తుండటంతో.. అతను మద్యం సేవించాడనే అనుమానం రావడంతో ప్రయాణీకులు ఆ దుండగుడిని నిలదీశారు. దీంతో సదరు దుండగుడు బస్సును అక్కడే వదిలేసి పారిపోయాడు. వెంటనే ప్రయాణీకులు డిపో మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే డ్రైవర్‌ను, కండక్టర్‌ను పంపించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు డిపో మేనేజర్.