ఫ్యాన్స్ కు ఆర్ఆర్ఆర్ టీమ్ ఇచ్చే న్యూఇయర్ గిఫ్ట్ ఏంటో ?

By రాణి  Published on  31 Dec 2019 1:01 PM GMT
ఫ్యాన్స్ కు ఆర్ఆర్ఆర్ టీమ్ ఇచ్చే న్యూఇయర్ గిఫ్ట్ ఏంటో ?

రాజమౌళి దర్శకత్వంలో రూ.350 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ''ఆర్ఆర్ఆర్ న్యూ ఇయర్ కానుకగా..జనవరి 1, 2020 తేదీన చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఆర్ ఆర్ ఆర్ నుంచి ఫ్యాన్స్ కు న్యూఇయర్ గిఫ్ట్ గా చిత్ర పోస్టర్ రాబోతోంది. సిద్ధంగా ఉండండి'' అంటూ ఒక ఫ్యాన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా 2020లో వచ్చే ఒక్కో పండుగకి చిత్ర యూనిట్ ఒక్కో పోస్టర్ ను విడుదల చేయనుందన్న అర్థం వచ్చేలా అల్లు అర్జున్ గిఫ్ట్ ఫ్యాక్ పట్టుకుని ఉన్న ఒక ఫొటోను షేర్ చేశారు.

ఫ్యాన్ చేసిన ఈ ట్వీట్ పై స్పందించిన చిత్ర బృందం రిప్లై ఇచ్చింది. అవును ..ఆ పనిలోనే ఉన్నామంటూ కోపంతో ఉన్న ఎమోజీని, నవ్వుతున్న ఎమోజీలను పెట్టింది. #YearOfRRR లేదా #HappyRRRYear ట్యాగ్ లను ట్రెండ్ చేసి 2020కి స్వాగతం చెబుదామని ట్వీట్ చేసింది. అంటే ఈ న్యూ ఇయర్ చరణ్, తారక్, రాజమౌళి అభిమానులకు పండుగేనన్నమాట.

Next Story
Share it