'#ఆర్‌ఆర్‌ఆర్'లో ఇంగ్లిష్ యాక్టర్స్ వీరే...!
By Newsmeter.Network
రాజ్ మౌళి సినిమా అంటేనే మొదటి నుంచి చర్చ ఉంటుంది. కథ దగ్గర నుంచి యాక్టర్స్ సెలక్షన్ వరకు చర్చ నడుస్తుంటుంది. ఈ చిత్రంలో ఇంగ్లిష్ నటీనటులు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో తారక్ పక్కన జోడీ ఎవరో తేలిపోయింది. ముఖ్యమైన ప్రతినాయకుల ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. చిత్రబృందం ప్రతి నాయకుల ఫొటోలను ట్విటర్ వేదికగా రిలీజ్ చేసింది.
'వెల్ కం ఒలీలియో మోరిస్'. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో కథానాయిక జెన్నీఫర్ పాత్రలో నటిస్తునందుకు సంతోషంగా ఉంది. మీతో పని చేయడానికి ఎదురుచూస్తున్నామంటూ చిత్రబృందం ట్విట్ చేసింది.
ఆర్‌ఆర్‌ఆర్‌లో హాలీవుడ్ నటుడు రే స్టీవ్ సన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిత్ర బృందం ఈ మేరకు ట్విట్ చేసింది. మెయిన్ విలన్ స్కాట్ పాత్రలో స్టీవ్ సన్ కనిపిస్తారు.
హాలీవుడ్ నటి ఎలిసన్ డూడీ ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. లేడీ స్కాట్ పాత్రలో ఈమె తెరపై మెరవనున్నారు. ఎలీసన్ ఫొటోను కూడా చిత్రం బృందం ట్విటర్‌లో షేర్ చేసింది. లేడీ స్కాట్ పాత్రలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర బృందం ట్విట్ చేసింది.
ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని వైఫల్యం ఎరుగని దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకు ఎక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా మొదట ఎడ్గారీ జోన్స్‌ను అనుకున్నప్పటీకి ..ఆమె తప్పుకున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఎవరుఅనే సందిగ్ధత నెలకొంది. ఈ రోజు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం ట్విట్‌తో దీనికి జూనియర్ ఎన్టీఆర్ జోడీకి తెరపడింది.
కొమురం భీం, అల్లూరి సీతారామరాజు ఇద్దరూ స్వేచ్ఛ కోసం పోరాడిన వారే. ఒకరు బ్రిటీష్ వారి మీద పోరాడితే..మరొకరు నిజాం నవాబ్ మీద కత్తి దూశారు. ఇద్దరికి పోరాటంలో పోలికలు ఉండటంతో ..ఇద్దరి కథ ఇతివృత్తంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తెర ఎక్కిస్తున్నారు. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు చిన్నతనంలో కలిశారనే టాక్ ఉంది. దీనిని కూడా దర్శకుడు వెండి తెరపై చూపిస్తారని చెబుతున్నారు. ఇద్దరి పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. పోరాటంతోపాటు ఎమోషన్, లవ్ కూడా ఈ సినిమాలో పండనుంది.
స్వేచ్ఛాపోరాటంతోపాటు..ఆదివాసీల కష్టాలు. రాజ్యం ఏవిధంగా ప్రజలను పీడించేది. అప్పటి పోరాట సన్నివేశాలు. అప్పుడు స్వేచ్ఛ కోసం ప్రజలు ఎంత తపించిపోయారు అనేవి సినిమాలో ప్రముఖంగా చూపించే అవకాశముంది. ఆనాడు వాడిన తుపాకులు, కత్తులు పోలినవే తయారు చేయనున్నారు. మొత్తానికి బాహుబలి తరువాత రాజమౌళి మరో ప్రతిష్టాత్మక చిత్రం భుజాల మీద వేసుకున్నారనే చెప్పాలి.
కథపై భారీ ఎత్తున కసరత్తు చేసినట్లు టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఇక స్క్రీన్ ప్లేలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. మ్యూజిక్ దగ్గర నుంచి డైలాగ్‌ల వరకు ప్రత్యేకంగా ఉండనున్నాయి. తెలుగు వాసన పోకుండా..పోరాటాలు రోమాలు నిక్కబొడుచుకునేలా తీయనున్నారని సమాచారం.