దేవి కసితో.. మహేష్ సినిమాకి ఫన్నీ సౌండింగ్ !

By Newsmeter.Network  Published on  28 Dec 2019 11:38 AM GMT
దేవి కసితో..   మహేష్ సినిమాకి  ఫన్నీ సౌండింగ్ !

తెలుగు సినిమా ఇప్పుడు ఎక్కువుగా కామెడీ మీద నడుస్తోంది. గట్టిగా నాలుగు సార్లు నవ్విస్తే.. ఆ సినిమాని జనం ఇరగబడి చూస్తున్నారు. అందుకే స్టార్లు సైతం కామెడీకే జే కొడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మొదటిసారి కామెడీ జానర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చేస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే రిలీజైన ఈ చిత్రం టీజర్ అనుకున్న స్థాయిలో ట్రెండ్ అవ్వలేదు. పైగా దేవికి మ్యూజిక్ పరంగా పెద్దగా నేమ్ కూడా రాలేదు. గతంలో మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను' సినిమాలకు బ్రహ్మాండమైన మ్యూజిక్ ను అందించిన దేవి శ్రీప్రసాద్ 'సరిలేరు నీకెవ్వరు'కు మాత్రం ఆ రేంజ్ లో ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నాడు.

ఇప్పటికే సోషల్ మీడియాలో దేవి పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఒక పక్క తమన్ నుండి క్రేజీ మ్యూజిక్ వస్తోంటే.. దేవి నుండి మాత్రం సాధారణ మ్యూజిక్ కూడా రావట్లేదని నెటిజన్లు పోస్ట్ ల రూపంలో పెదవి విరుస్తున్నారు. ఈ పోస్ట్ లు దేవి దృష్టికి వెళ్లాయట. ఆ పోస్ట్ లకు 'దేవి శ్రీ'లో కసి పెరిగిందని.. తన నేపథ్య సంగీతంతో సినిమాని మరో స్థాయిలో నిలబెట్టేలా పనిచేస్తున్నాడని.. ముఖ్యంగా కామెడీ డైలాగ్స్ హైలైట్ అయ్యేలా డిఫరెంట్ అండ్ ఫన్నీ సౌండింగ్ ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఏమైనా దేవి శ్రీప్రసాద్ కసితో పనిచేస్తున్నాడు అన్నమాట, మరి ఈ సారి నేపథ్య సంగీతంతో అదరగొట్టేశాడేమో చూడాలి.

కాగా మహేష్ బాబు అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. జనవరి 11న రిలీజ్ కానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it