చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ ఆదివారం నుంచి నుంచి కూంబింగ్‌ నిర్వహించింది. అర్ధరాత్రి సమయంలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టబడ్డాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్మగ్లర్ల ముఠా పోలీసులకు ఎదురుపడగా, స్మగ్లర్లు పరారు కాగా, 27 ఎర్రచందనం దుంగలను పోలీసులకు పట్టుకున్నారు.

సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటయ్య ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్రచందనం కోసం స్మగ్లర్లు అడవుల్లోకి వచ్చినట్లు తమకు సమాచారం అందిందని, వారిని పట్టుకునేందుకు కూంబింగ్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగల విలువ రూ. 40 లక్షలకుపైగా ఉంటుందని అన్నారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిస్తున్నారు.

సుభాష్

.

Next Story