కడప జిల్లా: రైల్వే కోడూరు సమీపంలోని బాలపల్లి అడవుల్లో ఎర్రచందనం దుంగలను టాస్క్‌ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలపల్లి - దేశెట్టిపల్లి అడవుల్లో 54 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఏడు గురు స్థానిక స్మగ్లర్లను అరెస్టు చేశారు. కుక్కలదొడ్డి నుంచి కూంబింగ్ చేపట్టారు. నెమ్మూరు చెంగయ్య మడుగు వద్ద కాపు కాశారు. ఆదివారం తెల్లవారు జామున ఎనిమిది మంది స్మగ్లర్లు దుంగలను మోసుకుంటూ కనిపించారు. వీరిని చుట్టు ముట్టగా దుంగలు పడేసి పారిపోయారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. అడవిలో మరింతమంది స్మగ్లర్లు ఉన్నారని పట్టుపడ్డవారు విచారణలో చెప్పారు.

పట్టుబడిన వారిలో చిత్తూరు జిల్లా రంగం పేటకు చెందిన గుడిపాటి ప్రభాకర్ (21), శ్రీకాళహస్తి నుంచి చంద్రగిరి శ్రీనివాసులు (36), తిరుపతి గురవయ్య (38), తిరుపతి ఈశ్వరయ్య (25), నరసింగాపురం వ్యక్తి చెంచురామయ్య (39), నెల్లూరు జిల్లా వెంకటగిరి కి చెందిన కార్లగుంట చెంచురామయ్య (26), బోనాల సుధాకర్ (46) గా గుర్తించారు. వీరిపై టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Newsmeter.Network

Next Story