రవి ప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించండి - ఎంపీ విజయసాయి రెడ్డి

By Newsmeter.Network  Published on  7 Oct 2019 4:59 PM GMT
రవి ప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించండి - ఎంపీ విజయసాయి రెడ్డి

అమరావతి: Tv9 బహిష్కృత సీఈవో రవి ప్రకాష్ ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌ కు లేఖ రాశారు. ఫెమా, ఆర్‌బీఐ నిబంధనలు ,మనీ లాండరింగ్ లతో పాటు ఇన్‌కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా డబ్బులు కూడా పెట్టుకున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకుల ను మోసం చేసిన ఖురేషి , CBI కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ తో కలసి‌ చాలా మందిని‌ రవి ప్రకాష్ మోసం చేసారని లేఖలో‌ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

సతీష్ సానా, మొయిన్‌ ఖురేషి,రవిప్రకాష్ ముగ్గురు కలసి నకిలీ డాక్యుమెంట్ లతో ...నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని లేఖలో విజయసాయి రెడ్డి రాశారు. హవాలా సొమ్మును కెన్యా, ఉగండాలలో సిటి కేబుల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. రవిప్రకాష్ అవినీతి వ్యాపారాల జాబితాను..పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ కు లేఖ లో తెలిపారు ఎంపీ విజయసాయి రెడ్డి.

Next Story