రవిప్రకాష్ @ ఖైదీ నెంబర్ 4412
By Newsmeter.NetworkPublished on : 6 Oct 2019 11:51 AM IST

చంచల్‌గుడా : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను బంజారహిల్స్ పోలీసులు చంచల్‌గుడా జైలుకు తరలించారు. నిన్న రాత్రి రవి ప్రకాష్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీతాఫల్ మండిలోని జడ్జి నివాసం నుంచి నేరుగా రవి ప్రకాష్‌ను రాత్రి 10 గంటలకు చంచల్‌గుడా జైలుకు తరలించారు. రవిప్రకాష్ కు అండర్ ట్రైల్ ఖైదీ నెంబర్ 4412ను జైలు అధికారులు కేటాయించారు. అతనిని కృష్ణా బ్యారక్ లో ఉంచారు. రాత్రి మొత్తం సరిగా నిద్రపోని రవిప్రకాష్.. ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. ఉదయం ఆరుగంటలకు బ్రష్ చేసిన రవిప్రకాష్.. జైల్ సిబ్బంది ఇచ్చిన అల్పాహారం కిచిడీని పూర్తిగా తినకుండానే వదిలేశాడు. ఎలాంటి వాకింగ్, జిమ్ లాంటివి చేయలేదు. సింగిల్ బ్యారక్ లో సాధారణ ఖైదీగానే రవి ప్రకాష్ ఉన్నాడు.
Next Story