వార ఫలములు: నవంబర్‌ 8 నుంచి 14వ తేదీ వరకు

By సుభాష్  Published on  8 Nov 2020 8:52 AM GMT
వార ఫలములు: నవంబర్‌ 8 నుంచి 14వ తేదీ వరకు

తే. 8-11-2020 ది ఆదివారం నుండి తే. 14-11-2020 ది శనివారం వరకు.

ఈ వారం లో వచ్చే విశేష పర్వదినాలు.

11 -11 -2020 బుధవారం ఏకాదశి

13 -11- 2020 శుక్రవారం ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి, నరక చతుర్దశి, మాస శివరాత్రి.

14- 11- 2020 శనివారం దీపావళి అమావాస్య, సాయంత్రం మహాలక్ష్మి పూజ.

15- 11 -2020 ఆదివారం అమావాస్య మరియు కార్తీక ఆకాశ దీపారాధన ప్రారంభం.

రాశి ఫలములు

మేష రాశి :- ఈ రాశి వారికి విశేషధన లాభం కొద్దిపాటి ఆనందము కొంచెం ముందుకు నడిపిస్తాయి. కుజ శుక్ర శని స్థితులు బాగోలేవు కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ఏది చేసినా దానికి సరైన స్పందన లేక కొంత అపకీర్తిని అంటగడతారు తప్ప ఎవరు మీరు ఈ పరిస్థితుల్లో సహాయం చేయడానికి రాలేరు. ముఖ్యంగా బళ్ళు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి కుజ ప్రభావం చేత వాహన ప్రమాదాలు ఇబ్బందులు ఎక్కువగా మీరు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. బలవంతంగా కొన్ని నాయకత్వ లక్షణాలు మీకు ఉన్నాయని చెప్పి ఎవరైనా పిలిచిననా వెళ్లొద్దు. రాజకీయాల్లో అకారణంగా మీరు మాటపడతారు. గొడవలు తెచ్చుకుంటారు. కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఈ వారంలో 33 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది పర్వాలేదు బాగానే ఉంటుంది. భరణి నక్షత్ర జాతకాలకు మిత్ర తార ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. కృత్తిక 1వ పాదం వారికి నైధనతార అయింది కాబట్టి ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది.

పరిహారం :- కుజుడికి ప్రత్యేకమైన పూజలు జరిపించండి. దేవి ఖడ్గమాలా పారాయణ మంచి ఫలితాన్నిస్తుంది.

వృషభ రాశి :- ఈ రాశి వారికి శత్రు నాశనం వల్ల గొప్ప ఆనందం కలుగుతుంది. ధనం తో పాటు బంధు దర్శన లాభం ఉంది. విశేషించి వీరికి అలంకార ప్రాప్తి ఉంది కాబట్టి గొప్ప హాయిగా సంతోషంగా ఉండగలుగుతారు. ఒకవేళ ఎక్కడైనా శత్రు భావాలు కనిపించినా సరే మీ మాటల నైపుణ్యంచేత వాళ్ళని మెల్లగా మీ మార్గంలోకి తీసుకుని తెచ్చుకుంటారు. చంద్రుడు అనుకూలంగా లేకపోవడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. గురుడు మీకు ఈ సమయంలో అనుకూలంగా లేడు కాబట్టి అనవసరంగా ధనము కాలము దుర్వినియోగం అయిపోతాయి. ఖర్చులు అంచనాలకు దొరకవు కాబట్టి అవసరాన్ని బట్టి వస్తువులు కొనుక్కోవడం లేకుండా ఖర్చు అంచనాలు వేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో వయోభారంతో ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారి ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త వహించండి. రాహు కేతువు ల ప్రభావం చేత మీలో అంతర్గతంగా భయము ఏర్పడుతుంది ధైర్యంతో అధిగమించండి. మీకు ఈ వారంలో 50శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేకత ఉంది. రోహిణి నక్షత్ర జాతకులకు అయింది కాబట్టి అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మృగశిర 1 2 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉన్నాయి జాగ్రత్త వహించండి.

పరిహారం :- గురు స్తోత్ర పారాయణ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ మేలు చేకూరుస్తాయి హయగ్రీవ స్తోత్రం ఉపకరిస్తుంది. గురువారం నాడు దక్షిణామూర్తి లేదా శివుని దర్శించండి మేలు జరుగుతుంది.

మిధున రాశి :- ఈ రాశి వారికి సంతృప్తికరమైన ఆహార విహారాలు సంతోషము సౌఖ్యము కుటుంబంతో ముఖ్యంగా స్త్రీలతో విందులు వినోదాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. బుధగ్రహ పరిస్థితి బాగా లేదు కనుక విందులు వినోదాల కోసం కొంత ధనం వ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. కేతు ప్రభావం చేత మీకు దైవ దర్శనము పుణ్య క్షేత్ర సందర్శనం లేదా ఇంట్లో పుణ్య కార్యములు చేయడం లాంటివి అవుతాయి. గురు శుక్ర కుజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల విశేష ఫలితాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు చక్కబడతాయి. గురు ప్రభావం చేత చేపట్టిన కార్యక్రమంలో విజయం సాధిస్తారు. విద్య ఉద్యోగ అవకాశాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇతర వ్యవహారాల్లో జోక్యం కల్పించుకుని అంతవరకు మీరు హాయిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆడవారికి పైచేయిగా మారుతుంది. వారిని ముందు పెట్టుకుని వెళితే ఎటువంటి వారు కూడా అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి. వీరికి ఈ వారంలో 42 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది ఆరుద్ర నక్షత్ర జాతకులకు క్షేమతార కాబట్టి అనుకూలంగా ఉంది. పునర్వసు1 2 3 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి అనుకున్న పనులు వాయిదా పడతాయి.

పరిహారం :- నువ్వులు, నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం మీకు చాలా ఉపయోగిస్తాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు మంచిని చేకురుస్తుంది.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి కుటుంబంతో ఆనందము ధనలాభం విశిష్ట స్థానం కూడా లభిస్తాయి. మంచి కోసం ఎంత వరకు పాటుపడిన కూడా వీరికి మేలు జరుగుతుంది. చెడు ఆలోచన వచ్చిందంటే మాత్రం ఇబ్బందులకు గురి అవుతారు. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు. వారాంతంలో మాత్రమే వీరు మేలు పొందగలుగుతారు. వీరి ఆలోచనలు వేరు వ్యతిరేకంగా ఉన్నంత కాలము ప్రజల దగ్గర మంచిని సాధించలేకపోయారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిరుత్సాహానికి గురి కాకండి. ధైర్యవచనాలు తో ముందుకు వెళ్ళినట్లయితే బావుంటుంది. రవి ప్రభావం చేత ఎప్పుడూ నీకు అగౌరవం ఉంది కాబట్టి తప్పదు. ఏదైనా అవకాశం చాలా మంచిది వచ్చినట్లయితే తొందరగా వినియోగించడం మంచిది వాయిదా వేయవద్దు. కుజ గురు శనులు వాడు స్థానాలు బలం బాగా లేదు కనుక మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి. . ఈవారం మీకు 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి విపత్తార అయింది కాబట్టి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం సంపత్తార అయింది కాబట్టి అనుకున్న పనులు చాలా ఎక్కువ నెరవేరుతాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి కొంచెం ఆలోచించి అడుగు వేయడం మంచిది.

పరిహారం :- ప్రతిరోజు నవగ్రహ దర్శనం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం లేదా శివ స్తోత్రం శివయ్య దర్శనం మంచిది.

సింహ రాశి: ఈ రాశి వారికి సంపదలు, భూషణం కూడా సమకూరుతాయి కాబట్టి మీరు చాలా ఆనందంగా ఉంటారు. కుజ గురులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆచారవ్యవహారాల్లో ని దైవచింతనలో ని జాగ్రత్త వహించండి. వాహనం నడిపే వాళ్లు మరి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. వీరికి గురు ప్రభావం చేత అధిక ధనలాభం, శుక్ర గ్రహ ప్రభావం చేత భూషణ అంబరాలు దక్కే అవకాశం ఉన్నది. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే అటువంటి సత్ఫలితాలను తొందరగా పొందగలుగుతారు ఆనందంగా ఖర్చు పెడతారు. మీకు శత్రువుల పీడ తప్పదు. వ్యవహారాన్ని మీరు ఒక కొలిక్కి తీసుకొచ్చి అందులోంచి బయటపడటమే కాదు విశేష లాభాన్ని కూడా పొందగలుగుతారు. ఈవారం మీకు 50% శుభ ఫలితాలు ఉన్నాయి. మఖా నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది పర్వాలేదు బాగానే ఉంటుంది. పుబ్బ నక్షత్ర జాతకాలకు మిత్ర తార ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తర 1వ పాదం వారికి నైధనతార అయింది కాబట్టి ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది.

పరిహారం :- నాన వేసిన పెసలు, బెల్లం

ప్రతి బుధవారం నాడు దేశి ఆవు కి వినిపించండి. మంగళవారం నాడు అమ్మవారి పూజలు చేయండి. హనుమాన్ చాలీసా పఠనం మంచి ఫలితాన్ని ఇస్తుంది

ఈ రాశి వారికి స్వర్ణ ప్రాప్తి మృష్టాన్న భోజనము శరీర సౌఖ్యము సర్వ సంపదలు చేకూరుతాయి. ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. చిన్నచిన్న కార్య విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా బుధ శుక్ర బలం చేత హాయిగా ఆనందంగా ఈ వారం గడప గలుగుతారు. సంతాన ఆరోగ్యము తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. శత్రువులు అభివృద్ధి జరుగుతోంది కాబట్టి మీలో వున్న శత్రు భావాన్ని ముందు తొలగించండి. తర్వాత బయట ఉన్న శత్రువులను జయించవచ్చు. అలాగే సర్వసంపదలు చేకూరుతాయి కాబట్టి మీరు ఏ పని చేయాలన్నా దైవసంకల్పం పెట్టుకుంటూ గురువుతో సంకల్పించి వ్యాపార వ్యవహారాల్లో విద్య వైద్య ఆరోగ్య విషయాల్లో ఉన్నట్లయితే మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కేతు ప్రభావం చేత మీకు పుణ్యక్షేత్ర సందర్శనం, దూరప్రయాణం సంతృప్తి నిస్తాయి. ఈ వారంలో మీకు 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర 2 3 4 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేకత ఉంది. హస్త నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకున్నవన్నీ నెరవేరుతాయి. చిత్త 1 2 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉన్నాయి జాగ్రత్త వహించండి.

పరిహారం :- గురు స్తోత్ర పఠనం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే మాతాపితరుల గౌరవించండి పెద్దవాళ్ళను గౌరవించడం మీకు చాలా మేలు జరుగుతుంది.

తులారాశి :- ఈ రాశి వారికి మృష్టాన్న భోజనము ధనప్రాప్తి ఉత్సాహ ప్రోత్సాహాలు మంచి మేలుని చేకూరుస్తాయి. స్థానచలనంఉన్నప్పటికీ కూడా ఎక్కువ దూరంగా వేరు వెళ్లకుండా దగ్గర్లోనే ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు నెరవేరుతాయి. శని ప్రభావం చేత ఉదర రోగంతో బాధపడే పరిస్థితి ఉంది. మీరు జాగ్రత్త వహించండి. కొత్త కొత్త వస్తువులు కొనడం దాంట్లో కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే పరీక్ష చేసి తీసుకోవడం చాలా మంచిది. అవసరం ఉన్నా సరే మీకు రాహు ప్రభావం చేత చిక్కులు తప్పవు. అలాగే గురుడు కూడా మీకు అనుకూలంగా లేడు కాబట్టి మీకు సరైన ఆలోచన రాకపోవడం మిమ్మల్ని ఇతరులు వినియోగించుకోవడం జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ వారంలో 42 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్తా 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు క్షేమతార కాబట్టి అనుకూలంగా ఉంది. విశాఖ 1 2 3 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి అనుకున్న పనులు వాయిదా పడతాయి.

పరిహారం :- రవి బుధులకు జపాలు చేయించండి. నల్లని వస్త్రము నల్ల నువ్వులు దానం చేయండి శుక్రవారం నియమాన్ని పాటించండి అమ్మవారి పూజ చేయండి,

వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి సౌఖ్యము లాభం మంచిగా ఈ వారం నడిపిస్తాయి. ధనవ్యయం ఉన్నప్పటికీ కూడా గౌరవ మర్యాదలు అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువు అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. మీకు లోలోపల భయం పెట్టేస్తాయి. మిమ్మల్ని పై అధికారులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ తెలివిగా మీరు బయటికి తేబడతారు. శత్రువులు వంచించే అవకాశాలు కూడా ఉన్నాయి. బుధ గ్రహ స్థితి మీకు అనుకూలంగా లేదు ఆరోగ్యానికి హానికరమై ఉంది. పై అధికారుల చేత మీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీకు కొంత అనుకూలత ఉంటుంది. లాభం అయితే ఉంటుంది కానీ అందులో మిగులు లేని స్థితి. మీ సమయం మీ చేతుల్లో ఉండదు అనవసరంగా కాలయాపన జరుగుతూ ఉంటుంది. మీకు సహకారం చేసినటువంటి వాళ్లు తక్కువ అవుతారు. కానీ మీకు సకాలంలో ధనలాభం ఉంది రుణమాఫీ జరగవచ్చు. ఉత్సాహ ప్రోత్సాహకాలు కొంతమంది మీకు అందజేస్తారు. దానివల్ల మీరు ఆనందాన్ని పొందగలుగుతారు. మీకు ఈ వారంలో 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి విపత్తార అయింది కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం సంపత్తార అయింది కాబట్టి అనుకున్న పనులు చాలా ఎక్కువ నెరవేరుతాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి కొంచెం ఆలోచించి అడుగు వేయడం మంచిది.

పరిహారం :- శివ అభిషేకము శివ స్తోత్ర పారాయణ మంచి ఫలితాలనిస్తాయి. నానబెట్టిన పెసలు బెల్లం వేసి బుధవారంనాడు తినిపించండి మంచి ఫలితం పొందగలుగుతారు.

ధను రాశి :- ఈ రాశి వారికి ఆనందము సత్యము లాభము సంతోషము ఇవన్నీ ఒకదానితో ఒకటిగా వచ్చి గొప్ప సంతోషాన్ని ఇస్తాయి. ధనలాభం ఉండడంతో వీరు మరింత ఆనందాన్ని పొందుతూ ముందుకు సాగిపోతారు. గృహంలో శుభ కార్యక్రమం చేపడతారు. కుజ ప్రభావం చేత శత్రుపీడ ఉన్నప్పటికీ కూడా వీరు వెనుకంజ వేయకుండా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. బుధ శుక్రులు మంచి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. గురుగ్రహ ప్రభావం మాత్రమే మీకు ఒక స్థానంలో నిలవలేకుండా అనేక దగ్గర అనేక కార్యక్రమాలు చేసే శక్తిని ఇస్తూ పలు ప్రాంతాలకు తిప్పుతాడు. శని ప్రభావం చేత మీరు మానసికంగా ఇబ్బంది పొందే అవకాశం ఉంది అయినా రాహు ప్రభావంచే సుఖజీవితం పొందుతారు. వ్యయ ప్రయాసలు తప్పవు. గృహ స్థిరాస్తి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాయి. కావాల్సిన బాకీలు వసూలవుతాయి. కోరుకున్నంత ఆనందాన్ని మీ జీవితంలో మీరు పొందగలుగుతారు. ఈ వారంలో ఈ జాతకులకు 50శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. మూల నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది పర్వాలేదు బాగానే ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకాలకు మిత్ర తార ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి నైధనతార అయింది కాబట్టి ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది.

పరిహారం :- గురు స్తోత్ర పారాయణ చేయండి గురువార నియమాలు పాటించండి. తెల్ల ఆవాలు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. సుందరకాండ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మకర రాశి :- ఈ రాశి వారికి కార్యజయం ధనలాభము ఒకటేమిటి అన్ని రకాల శుభాలను వరుసగా పొంది తమదే పైచేయి అన్నట్టుగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లకు మరీ మంచి అవకాశం వాళ్ళు పొందగలుగుతారు. ఈ వారంలో ఏ పని చేస్తున్న సంతోషం తోనే చేసుకోగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు ఉన్న ధైర్యంతో ఎదుర్కోగలిగే శక్తి మీకు వచ్చేస్తుంది. శని ప్రభావం చేత విపత్తు ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగినా తమ ఆనందాన్ని తాము ఇతరుల ద్వారా నైనా సరే బలవంతంగా అయినాసరే ఖచ్చితంగా పొందగలుగుతారు. వీరి మాటలు తిరుగులేదు. మీకు ఎల్లప్పుడూ ఉండే మానసికాందోళన తప్పదు. కొంచెం అవమానాల పాలు అయినా వాటి గురించి ఆలోచించకండి. మానసిక భీతిఎక్కువగా ఉంటుంది అయినా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. శని ప్రభావం చేత మీకు ఏదైనా ఇబ్బంది కలగవచ్చు కొంచెం ముందుగానే జాగ్రత్త పడితే వాటిని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. గౌరవ మర్యాదలు మీకు విపరీతంగా పెరుగుతాయి. మీ మాటకు విలువ ఎక్కువ వస్తుంది. మీకు ఈ వారంలో 58 శాతం శుభ ఫలితాలు ఇవాళ మీరు పొందనున్నారు. అదే మీకు గొప్ప తార్కాణము. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి నైధన తార అయింది చాలా ప్రతికూలంగా ఉంది. శ్రవణా నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకున్న పనులన్నీ అనుకూల సమయంలో అనుకున్న సమయానికి నెరవేరుతాయి. ధనిష్ఠ 12 పాదాల జాతకులకు ప్రత్యక్ తార అయింది అనుకున్న పనులు వాయిదా పడతాయి లేదా ఆలస్యం అవుతాయి.

పరిహారం :- శని గురు లకు జపం చేయించండి నల్లనువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రములు దానం చేయండి. శనికి తైలాభిషేకం మంచిది. వెంకటేశ్వర స్తోత్ర పారాయణ మంచి కల్పిస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ధన లాభం విశేషంగా సంపదలు కలుగుతాయి కానీ వీరు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి చాలా నిరుత్సాహపడిపోతారు. అందు నుండి బయటకు రావడమే మంచి మార్గము. కొంత ద్రవ్యాన్ని పోగొట్టుకుని మీ లాభాలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. మీకు బంధు వర్గాలు వల్ల ఏ రకమైన లాభం ఉండదు సరికదా నష్టాన్ని చేకూరుస్తుంది. రాహువు నాలుగు ఇంట్లో ఉండి బలం తగ్గడం చేత వారాంతంలో వీరికి కీర్తిప్రతిష్టలు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వీళ్ళు అందరు వినియోగించుకుంటారు గాను వీరికి సమయానికి ఎవరూ కూడా సహకరించే అవకాశాలు వాళ్ళకి కూడా రావు. వీళ్ల వల్ల వాళ్ళకి గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయనే భయం ఎదుటివాడికి కరిగి పోతుంది. కాబట్టి మొదటి నుంచి అలవాటు చేసుకోవడం చాలా అవసరం. స్త్రీల ఆరోగ్యాలు జాగ్రత్తగా చూడండి. ఏ పనిమీద వెళ్ళినా సరే త్వరగా రావాలనే దృఢ సంకల్పం చేసుకోండి. కష్టానికి తగిన ఫలితం మీరు పొందలేక పోవడం కారణం మీకు ఈ వారంలో 34 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. శతభిషం నక్షత్ర జాతకులకు క్షేమతార కాబట్టి అనుకూలంగా ఉంది. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి అనుకున్న పనులు వాయిదా పడతాయి.

పరిహారం :- నవగ్రహ దర్శనం ప్రతిరోజు చేయండి. శివాభిషేకం మంచి ఫలితాన్ని ఇస్తుంది. రోజూ చేస్తే ఇంకా మంచిది. వీలైతే శనికి హోమం చేయించండి.

మీన రాశి :- ఈ రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. విశేష ధన సంపద సమృద్ధిగా లభిస్తుంది. ఎంత పని చేసిన కష్టానికి తగిన ఫలితం మాత్రం దక్కలేదు అని బాధ మిగిలిపోతుంది. ఎల్లప్పుడూ విచార గ్రస్తులై ఉంటారు. దీనికి తోడు శుక్ర ప్రభావం చేత అనారోగ్యం వెంటాడుతూ ఉంటుంది. గురువు మీకు అటువంటి ఆందోళన ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. కేతువు మిమ్మల్ని ఎక్కువగా కనిపెట్టి ఉంటాడు శత్రువులు పెరుగుతూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అవి త్వరగా పడతాయి మీ ధైర్యం ధైర్యం మిమ్మల్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది మీరు ధైర్యంగా ఉన్నట్లయితే మీ పనులు కూడా జరుగుతాయి. లేదంటే వెనకబడి పోతాయి. నీతినియమాలతో ముందుకు వెళ్ళండి మీకు అన్ని సమకూరుతాయి మీ శ్రమ వృధా కాదు. మీకు ఈ వారంలో 42 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి విపత్తార అయింది ఆటంకాలు ఎక్కువవుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి పనులను కూడా చక్కగా నెరవేరుతాయి రేవతి నక్షత్ర జాతకులకు మాత్రమే జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

పరిహారం :- రుద్రాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది అమ్మవారి దుర్గాసప్తశతి పారాయణ మీకు గొప్ప ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తుంది.

Next Story