రాశి ఫలాలు: 24 ఆదివారం నుండి 30 శనివారం వరకు

By సుభాష్  Published on  25 May 2020 12:48 PM GMT
రాశి ఫలాలు: 24 ఆదివారం నుండి 30 శనివారం వరకు

మేషరాశి : ఈ రాశి వారు ఈ వారంలో శుభప్రదమైన ఫలితాన్ని పొందుతున్నారు. సంతోషం ఆనందాన్ని కూడా పొందబోతున్నారు. కొన్ని సమయాల్లో కార్యహాని జరుగుతుంది అయినా మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. భయం మీకు కొత్తగా ఏర్పడుతుంది దీనికి కారణం ద్వితీయ మందుండే రవి బుధులు. తృతీయ మందుండే రాహువు సర్వసంపదలు నివ్వబోతున్నాడు. ఎందుకైనా మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీకంటే పెద్ద వారు తల్లిదండ్రులు మీ బంధు వర్గాలు అత్తమామలు వారెవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని వెంటనే పరామర్శ చేసి వారి ఆరోగ్య విషయాలు కనుక్కన్నట్లైతే అవి మీకు శుభాన్ని కలిగిస్తాయి. దైవపూజ కంటే బంధు పరామర్శ వల్ల మీకు శుభాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది ఫలితాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు సాధన తార అయ్యింది ఫలితాలు చాలా బాగుంటాయి. కృత్తిక ఒకటవ పాదం వారికి విపత్తార ఐంది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి.

పరిహారం :- రవి సూర్య నమస్కారాలు, బుధునకు జపం చేసినా మంచి ఫలితాలని పొందగలుగుతారు. ప్రతిరోజూ సాయంత్రం చంద్రదర్శనం చేయండి చాలా మంచి ఫలితం లభిస్తుంది.

వృషభరాశి :- ఈరాశి వారికి కించిత్ కుటుంబ సంతోషము ధనలాభము ఉన్నప్పటికీ వారికి స్థానచలనం కనిపిస్తోంది. ధనవ్యయం పెరుగుతోంది ఎంత ఆదాయం వచ్చినా అది అనారోగ్య రూపంలో లేదా ఇతరులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి ధనవ్యయము అయిపోతుంది. అకారణంగా మీరు కలహాలను పెంచుకుంటారు నిందలు కూడా పడేఅవకాశం ఉంది. కొద్దిపాటి శరీర సౌఖ్యము వుంది కనుక అప్పుడప్పుడు మీరు ఆనందాన్ని వారం మధ్యలో పొందే అవకాశం కనిపిస్తోంది. బుధుని ప్రభావం చేత స్వర్ణాభరణాలను పొందగలుగుతారు. రవి ప్రభావము మీకు శరీరంలో వేడి కలిగిస్తుంది. శుక్రుడు మీకు మంచి మేలు చేయనున్నాడు కానీ అష్టమంలో ఉన్న కేతువు ద్వితీయ మందున్న రాహువు మీకు ప్రతికూలంగా పనిచేస్తున్నారు మొత్తంమీద ఈ వారం మీకు శుభాశుభ మిశ్రమంగా పనిచేస్తుంది. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తార అయింది వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. రోహిణీ నక్షత్ర జాతకులకు మాత్రం సంపత్తారైంది శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి మాత్రము జన్మతార అయింది కాబట్టి వీళ్లు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం.

పరిహారం :- రాహు కేతువులు పూజ చేయించండి లేదా ఉడికించిన ఉలవలు ఉప్పు వేసి బయట రహదారిలో విడిచిపెట్టండి.

మిథున రాశి :- ఈ రాశివారికి ఫలితాలన్నీ చాలా వ్యతిరిక్తంగా మారిపోయాయి. చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యము సాహసము ఉంటే వీళ్లు వాటి నుంచి బయటికి రాగలుగుతారు. అనేక రకాల అనేక కోణాల్లో ధనవ్యయము ద్రవ్య హాని శత్రు వృద్ధి అన్ని ఒకేసారి మిమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయి. ఏ పని చేద్దామన్న వ్యతిరేకి ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వ్యవహరించడం మంచిది. ధైర్యం వహించండి. కొత్త పనులేవీ ప్రారంభించకండి కొత్త ఆలోచనలపై వెళ్లకండి కొత్త ఉద్యోగాల వైపు వెళ్ళకండి పాత ఉద్యోగంలోనే జాగ్రత్తగా మెలగడానికి ప్రయత్నం చేయండి వ్యాపారమైతే మాత్రం కొత్తవారి ఎవరినీ చేర్చుకోకండి. కొత్తవారిని ఎవరినీ నమ్మకండి.మీ ఆత్మావలోకన మిమ్మల్ని రక్షించ గలుగుతుంది. దగ్గర బంధువులు వయస్సు మళ్లిన వాళ్ళపై దృష్టి పెట్టి వాళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షించండి మృగశిర మూడు నాలుగు పాదాల వారికి అనారోగ్య సూచన. ఆర్దృా నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది మధ్యమ ఫలితాలు పొందుతారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి మిత్ర తారైంది చాలా బావుంది.

పరిహారం :- గోధుమలు దానం చేయించండి రాహు కేతువులకు పూజలు జరిపించండి .

కర్కాటక రాశి : ఈ రాశివారికి ఎన్నడూ లేనంత ఆదాయాలు గౌరవము మర్యాద సంప్రదాయం విద్య విజ్ఞానం ఒకటేమిటి అన్నీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా పొందే అవకాశం ఈ వారంలో ఉంది. ఎంత అవకాశం ఉంటే అంత పరిచయాలు పెంచుకుని శక్తి సామర్థ్యాలకి తక్కువ లేకుండా మీరు ముందుకు దూసుకు వెళ్లినట్లయితే ప్రతి పని మిమ్మల్ని విజయం వైపు లాగుతుంది. ఒక్క కుజుడు తాలూకా స్థితి బావులేదు కనుకచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే మీకు మానసికంగా చిన్న దుర్భలత్వం ఉంది. దాన్ని విడిచిపెట్టండి శని ప్రభావం మిది కొద్దిగా పనిచేస్తున్నది కాబట్టి జాగ్రత్త వహించండి పునర్వసు నాలుగో పాదం వారికి మిత్ర సారైంది. చాలా బావుంది. పుష్యమి వారికి నైధన తార అయింది. వ్యతి రిక్త ఫలితాలున్నాయి ఆశ్రేష నక్షత్ర జాతకులకు సాధన తారైంది చాలా మంచి మంచి ఫలితాలు పొందబోతున్నారు.

పరిహారం :- మంగళవారంనాడు ఆంజనే నేయ స్వామి పూజ చేయండి. చంద్రుడ్ని ప్రతిరోజూ దర్శించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

సింహ రాశి:ఈ రాశివారికి అభివృద్ధి ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. విశేష ధన లాభాలు పొందిన ఉన్నారు. ఐతే మీ ఆలోచనలు స్థిరంగా ఉంటే గొప్ప ఫలితాన్ని సంతోషాన్ని ధనాన్ని విశేష ధనాన్ని ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్లు కూడా మీకు మేలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగోన్నతులు ఉన్నాయి వ్యాపారస్తులైతే ఇంకొక వ్యాపారాన్ని కూడా చేసే అవకాశం ఉంది. కుజుని స్థితి బావుంది కనుక చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడొచ్చు. రవి పరిస్థితి బాగాలేదు కనుక చిన్న భయం కూడా మీ కుంటుంది. ఈ రెండింటి మీరు దాటి నట్లయితే మీ స్థితి వేరొకలా ఉంటుంది . మఖ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది చెడు ఫలితాలు కొద్దిగా ఉన్నాయి. వతపుబ్బ నక్షత్ర జాతకులకు మాత్రము క్షేమ తార అయ్యింది కాబట్టి ఫలితాలు చాలా బాగున్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి విపత్తు తారైంది కాబట్టి ఫలితాలు కొంచెం ఆటంకాలు కలిగిస్తున్నయి.

పరిహారం :- రవికి జపం చేయించండి ఆదిత్య హృదయం పఠించండి. మంగళవారంనాడు హనుమద్ దర్శనం సుబ్రహ్మణ్య దర్శనం చేయండి.

కన్యా రాశి :- ఈ రాశివారికి ఇతః పూర్వం మీదట మంచి ఫలితాలు కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి. వీళ్లు ఎక్కడున్నా ఏదో ఒక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు మీకు మంచిని చేకూరుస్తాయి హాయిగా సుఖంగా సంతోషంగా వుండే అవకాశాలున్నాయి. అయితే అంతకు తగిన ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. మానసికంగా మీరు ఎక్కువ ఆనందాన్ని పొందాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నము మిమ్మల్ని మరికొంచెం ముందుకు నడిపిస్తున్నది. గురుని స్థితి బాగుంది కాబట్టి మీకు పెద్దల ద్వారా సంపద లాభం ఉంది అలాగే కోర్టు వ్యవహారాలు ఏవన్నా ఉన్నట్లయితే అవి కూడా నెరవేరుతాయి . భూసంబంధ పరిష్కారాలు కూడా లభిస్తాయి. కుటుంబం కోసం మీకు ఖర్చులు పెరుగుతాయి. అదాయ స్థితి బాగాలేదు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తు తారైంది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. హస్త వారికి సంపత్తార అయింది కుటుంబ ధన సంపద కూడా కలుగుతుంది. చిత్త వారికి జన్మ తారైంది కాబట్టి ఆరోగ్య విషయం జాగ్రత్త వహించండి.

పరిహారం :- నానవేసిన పెసలు బుధవారం నాడు ఆవుకి తినిపించండి మంచి ఫలితాలు వస్తాయి. ఆదివారాలు ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు చేయండి శనికి నువ్వులు దానం చేసిన మంచిది.

తులా రాశి :- ఈరాశి వారికి శుభ ఫలితాలు మాధ్యమంగా ఉన్నాయి. అయినా ఫర్వాలేదు. శత్రువులదే పైచేయి ఉందిగానీ మీరనుకున్న ఆ పనులను నెరవేర్చుకుంటారు. భూ సంబంధ వ్యవహారాలు కొంచం కొంచెంగా పరిష్కారంలో కొస్తాయి. దానివల్ల మీకు రావల్సినటువంటి ధనం కూడా చేరుకుంటుంది. రవి స్థితి బాగాలేదు కనుక కుటుంబంలో పెద్దల ఆరోగ్యమూ మీ ఆరోగ్యమూ మీ శ్రీమతి ఆరోగ్యము వాటిపైన దృష్టి పెట్టండి. మీకిప్పుడు ఉన్నదే శత్రువుల భయము. ఆ భయం ఇప్పుడు మరికొంచెం పెరుగు తుంది. ఏది ఏమైనా మీకు ఈ వారంలో సంపదలు సమకూరి పోతాయి గనుక ఇవన్నీ మీకు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప ఏది ఇబ్బంది అనిపించదు .మధ్యే మార్గంగా ఉంటారు. ఈ వారం అంతా కూడా నడిచిపోతుంది. చిన్న అవమానాలకు అవకాశం వుంది గనక జాగ్రత్త వహించండి. చిత్ర మూడు నాలుగు పాదాల వారికి జన్మతార ఐంది కాబట్టి ఆరోగ్య విషయం చూసుకోండి. స్వాతి నక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయింది బావుంది. విశాఖ ఒకట్రెండు మూడు పాదాల వారికి మిత్రతార యింది చాలా మంచి ఫలితాల్ని మీరు పొందబోతు.

పరిహారం :- అర్ధాష్టమ శని ప్రభావము కాబట్టి నల్ల నువ్వులు నల్ల వస్త్రము దానం చేయండి .శనివారం నాడు నువ్వుల నూనె దీపం పెట్టించండి చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు

వృశ్చిక రాశి :- ఈ రాశివారికి ఈ వారం కొంచెం సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ధనలాభం అయితే ఉంది కానీ మీకు క్షణక్షణమూ విచారము అనారోగ్య భయమూ ధైర్యం తక్కువవడం చీటికి మాటికి తగువులు ఇవి తప్పవు అనిపిస్తుంది. మీకు బుధుడు అనుకూలంగా ఉండటం అలాగే శని అనుకూలంగా ఉండడం మీరు మంచి ఫలితాలను చవిచూస్తారు. ఏదైనా మాట్లాడ్డం తగ్గించండి మీకు ఆవేశం ఎక్కువగా అయితే ఆలోచన ఎక్కువవుతుంది. గురుడు కూడా ప్రతికూలించే స్థితి ఉంది కాబట్టి దానికి తగినట్టుగా మీరు వ్యవహరించండి. శుక్రుడు స్థానము సప్తమ అయినప్పటికీ కూడా అనారోగ్య స్థానంలో పడ్డాడు ఇక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా చాలా అవసరం అనిపిస్తుంది. ముఖ్యంగా సప్తమంలో రవి కారణంగా మీకు కంటికి సంబంధించిన ఇబ్బంది ఉంది .విశాఖ నాలుగో పాదం వారికి మిత్రతార అయింది మంచి ఫలితాలున్నాయి. అనూరాధ వారికి మాత్రమే నైధన తారైంది కాబట్టి ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. జ్యేష్ఠ వారికి సాధన తారైంది కాబట్టి మీరు అనుకున్న పని నన్ను కూడా సాధించుకో గలుగుతారు.

పరిహారం :- దక్షిణామూర్తి స్తోత్రం మంచి ఫలితాన్నిస్తుంది. అలాగే శుక్రవారం అమ్మవారి పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ధనూ రాశి :- ఈ రాశివారికి కొద్దిపాటి శుభ ఫలితాలు పెరిగాయి. శత్రునాశనం జరిగి విశేష ధనాన్ని మాత్రం పొందగలుగుతారు. ఒక ప్రక్క అనారోగ్య స్థితి మాత్రం మీకు ఉంటుంది. ఈవారంలో అలంకార ప్రాప్తి ధనలాభాన్ని విశేషంగా పొందగలుగుతారు. మీకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు అపకీర్తి తెచ్చి పెట్టేవాళ్ళు మిమ్ములను అంటిపెట్టుకునే ఉన్నారు. వారిని గుర్తించినట్లయితే మీరు చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. క్షణక్షణం మీ భయం మిమ్మల్ని వెన్నంటు తూనే ఉంటుంది. ఉద్యోగస్థులైతే పైఅధికారుల ఒత్తిడి ఉంది. వ్యాపారస్తులైతే తత్సంబంధమైన దాడులకు మీరు గురికావాల్సివస్తోంది. దాని ద్వారా కొంత గౌరవ మర్యాదలకు భంగం కూడా ఉంటుంది. ఈ స్థితిని మీరు ఈ వారంలో చవిచూడక తప్పదు. మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు మాత్రమే క్షేమ తార అయింది మంచి ఫలితాన్ని చవి చూడబోతున్నారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి విపత్తారయింది ప్రతికూలతలు ఎక్కువగానే ఉన్నాయి.

పరిహారం :- శుక్రునకు జపం చేయించండి లేదా బబ్బర్లు దానం చేయండి వీలైతే వజ్రం ధరించి ఉన్నట్లయితే ఒకసారి అభిషేకంలోనో, మీ నిత్యపూజలోనో పెట్టి మళ్లీ ధరించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు.

మకర రాశి :- ఈ రాశివారికి ఫలితాలు మధ్యమంగా ఉన్నాయి. ఇంటా బయట కూడా వ్యతి రిక్త ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నడూ లేనంత ఒత్తిడి ఇబ్బంది శారీరకంగా మానసికంగా కూడా పొందగలుగుతారు. ఇంటా బయటా కూడా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే బంధుమిత్రులు మీకు కొద్దిగా సహకరిస్తారు. రావలసిన ధన మైతే విశేషంగా వచ్చేస్తుంది కానీ అంత వేగంగా ఆ ఖర్చులు గాని అనుకోని వ్యయాలు గానీ మీకున్నాయి. ఈ వారం ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ పాపభీతి భయము ఈ రెండింటి మధ్యలో మీరు నలిగిపోతారు. అలాంటి పరిస్థితిని అధిగమించే ప్రయత్నం మీరు చేయాలి. మీకొక అలంకార ప్రాప్తి ఉంది . ఒక గౌరవాన్ని మంచి వ్యక్తి ద్వారా పొందగలుగుతారు. మిమ్మల్ని కష్ట సమయంలో ఆదుకోవడానికి కూడా భగవంతుడు మీకు ఒక మిత్రులు బంధువును పంపిస్తాడు అందువల్ల మీరా విపత్తు ల్లోంచి బయటపడతారు. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తారైంది ప్రతికూల ఫలితాల ఎక్కువగా ఉన్నాయి. శ్రవణానక్షత్ర జాతకులకు సంపత్ తారైంది చాల బావుంది అలంకార ప్రాప్తి ఉంది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి జన్మతారైంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం.

పరిహారం :- విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. గురు స్తోత్రం చేసినట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది.

కుంభ రాశి :- ఈ రాశివారి కూడా ఇంట్లో మాత్రమే కాస్త గౌరవ మర్యాదలు దక్కుతాయి. బయటికి వెళుతున్నారు అంటే మీకు అనారోగ్య సూచనలతోపాటు అవమానాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో చేయిపెట్టిన మీకు కార్యహాని కనిపిస్తుంది. చివరిలో మాత్రం ధనలాభం కనిపిస్తుంది. విచారం ఒకటి ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. శత్రువులు మీది మీ జయము మిమ్మల్ని మరింత ఉత్సాహ పూర్తి చేసి ముందుకు నడిపిస్తుంది నష్టం వచ్చినా మీరు దాన్ని ముందే సిద్ధపడి ఉన్నారు గనుక మీకొచ్చినటువంటి ఆర్థిక స్వావలంబనతో ఆ స్థితిని దాటేసి మిమ్మల్ని మీరు నిలదొక్కుకుంటూ ముందుకు వెళ్లడం చాలా అవసరం. పైనుండి మీకు సహకారాలు ఎక్కువ లభిస్తాయని చెప్పడానికి మాత్రం లేదు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి జన్మతార అయింది ఆరోగ్యం సరిచూసుకోండి. శతభిష నక్షత్రం జాతకులకు మాత్రం పరమ మిత్ర తారైంది ఫలితాలు చాలా బాగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి మిత్ర తారైంది విశేష ఫలితాలు పొందబోతున్నారు.

పరిహారం :- ప్రతిరోజూ ఏదో ఒక దైవ దర్శన మాత్రం తప్పకుండా చేయండి అది మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువగా హనుమన్నామ స్మరణ చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మీన రాశి :- ఈ ఈ రాశివారికి సంపదలు ధన లాభము శత్రు జయము మిమ్మల్ని మంచి ఉత్సాహ పూర్తి చేసి ముందుకు నడిపిస్తాయి. అయితే అందుకు తగిన ఇబ్బందులు కూడా లేకపోలేదు. ఒక సమయంలో ఎంత ధనం వస్తుందో అంత ధనము మీ చేతిలో దక్కకుండా పోతుంది. ఇతరులకి చూస్తూ ఉండగానే ఇవ్వక తప్పనిసరి వరిస్తుంది. అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది గాని ప్రస్తుతానికి మాత్రం ధనం మీ దగ్గర నిలబడదు. కష్టాలు ఇబ్బందవుతుంది. మీకున్నటువంటి గౌరవ మర్యాదలు దృష్ట్యా పదిమంది మీ చుట్టూ చేరతారు. మీకు ఆ రకమైన గౌరవం మర్యాదలన్నీ దక్కుతాయి గానీ ధనం మాత్రం నిలుస్తుందని చెప్పలేకపోతున్నాం. శత్రువు పీడ తగ్గి మీకు వాళ్ల నుంచి మంచి అవార్డ్స్ రివార్డ్స్ కూడా లభిస్తాయి. కార్యహాని ముందే తెలుసుకుని జాగ్రత్త పడతారు కాబట్టి మీ పని శులభతరం అవుతుంది. మీరెంత కష్టపడితే అంత ఫలితాన్ని అరవై డబ్బై శాతాన్ని పొందగలుగుతారు. ఇది సత్యం. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి మిత్ర తారైంది చాలా మంచి ఫలితాలున్నాయి. ఉత్తరాభాద్ర వారికి నైధన తార అయ్యింది కాబట్టి పూర్తి వ్యతిరేక ఫలితాలు. రేవతి నక్షత్ర జాతకులకు సాధనం కార్యసాధన అయింది కాబట్టి పనులన్ని కూడా చక్కగా నెరవేరి పోతాయి.

పరిహారం :- చంద్రుడు స్థితి బాగాలేదు ప్రతిరోజూ చంద్రదర్శనం సాయంత్రం వేళ చేయాలి అని నిర్ణయం పెట్టుకోండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. రాహు కేతువులకు పూజ చేయించండి అది మంచి ఫలితాన్ని అందిస్తుంది.

Next Story