రాశిఫలాలు జనవరి 5 నుంచి 11 వరకు

By Newsmeter.Network  Published on  5 Jan 2020 9:13 AM GMT
రాశిఫలాలు జనవరి 5 నుంచి 11 వరకు

మేష రాశి :

ఈ రాశివారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎక్కువగా కలగనున్నాయి. తన ఇంట్లో ఉన్న చంద్రుని ద్వారా కుజుడు మంచిపనిని చేయిస్తాడు. 9 వ కోణంలో ఉన్న ఐదు గ్రహాలు మేలునే చేకూర్చనున్నాయి. అందులో కోణ స్థానాధిపత్యం వచ్చిన గురుడు శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వబోతున్నాడు. పంచమ స్థాన ఆధిపత్యం ఉన్న రవి కూడా మీకు మేలు చేయనున్నాడు. మీ ఆరోగ్యమూ తలిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే వివాహమునకు శుభ ప్రయత్నాలు సాగుతాయి. ఈ వారం మీకు మంచి ఫలితాలతో ప్రారంభమే కాదు ముగియడం కూడా మంచిగానే ముగుస్తుంది. శుక్రుడు అనగా మీ ఇంటి ఇల్లాలు మీకు తాత్కాలికంగా వ్యతిరేకించినా సమయం వచ్చినపుడు మాత్రం అనుకూలిస్తుంది. అశ్వని వారికి శుభ ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. భరణి వారికి మధ్యమ ఫలితాలు ఉండగా కృత్తిక ఒకటో పాదం వారికి మాత్రమే శుభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ధనుర్మాసం గాన విష్ణు ప్రాంతాలను ఎక్కువగా దర్శనం చేయండి ఆరో తేది సోమవారం ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఉండటం విష్ణుమూర్తిని దర్శించడం శుభప్రదం అవుతుంది .

వృషభ రాశి :

ఈ రాశివారికి లగ్నాధిపతి శుక్రుడు యోగించనున్నారు. శని బుధులు కూడా సహకరిస్తారు. తాత్కాలికంగా ద్వితీయ మందున్న రాహు చెడు ఫలితాల్ని చేయాలనుకున్న శుక్ర యోగ కారకత్వం చేత అశుభ ఫలితాలు తక్కువ. కానీ జ్ఞాపకశక్తి తగ్గడమే కాదు అంతలోనే ఎదుటి వాళ్ల మాటలు వినిపించుకోకపోవడం ఇవి మీకు ఆటంకాలుగా పరిణమించనున్నాయి. ఇంకా చెప్పాలంటే మీ మాట వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య విషయం జాగ్రత్త వహించండి. శని ప్రభావం కూడా మీకు ఎక్కువగా ఉంది అష్టమశని గనుక మీ పనులను ఆటంకపరిచే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా మీకు ఇబ్బందులున్నాయి. అవి క్రమంగా పరిష్కరింపబడతాయి తప్ప ఈ సమయంలో అవకాశం తక్కువ. కృత్తిక వారికి శుభ ఫలితాలు. రోహిణి వారికి నైధన తారతో వారం ప్రారంభం గనుక ప్రతి కూలతలు ఎక్కువ.మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి కార్యసాధన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. సోమవారం నాడు అన్నదానాదులు చేయండి. శుభ ఫలితాలను పొందుతారు. పౌర్ణమి 1౦ వతేదీ అమ్మవారి అర్చన శుభప్రదం.

మిధున రాశి :

ఈరాశివారికి చంద్రుడు ప్రతికూలంగా దుర్బలత్వాన్ని కలిగిస్తాడు. దాన్ని అధిగమించడాని ఏకాగ్రత అవసరం . రాశి సప్తమంలో ఐదు గ్రహాలు కలయిక కొంచెం ఇబ్బందిని కలగజేస్తుంది. ఇవన్నీ మారక స్థానాలుగా మారాయి .ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా చిన్నచిన్న ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. లగ్న చతుర్ధ ఆధిపత్యం వచ్చిన బుధుడు మీకు యోగం చేయాలనే ప్రయత్నంలో ఉంటాడు. శుక్రుడు కూడా మీకు యోగ కారకుడు గాన మీలో సంకల్ప బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ వారంలో లాభం లేకపోవడమే కాదు నష్టాన్ని కూడా చవి చూడవలసి వస్తుంది. ముందు జాగ్రత్త మాట శుభగత్వం శుచిత్వం ఉండాలి. నేను నిక్కచ్చి మనిషిని అడిగి తేల్చేస్తాను అనే భావం వీడండి. కొద్దిపాటి మౌనం మీ మాట బలాన్ని పెంచుతుంది. మృగశిర రెండు మూడు పాదాలు వారికి శుభ ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి.ఆరుద్ర నక్షత్రం వారికి ప్రత్యక్తార కావున వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. పునర్వసు ఒకటి రెండు మూడు వారికి క్షేమ తార కావున సానుకూలంగా ఉంటుంది.

పరిహారం : ధనుర్మాసం శ్రీ మహా విష్ణువుకు ప్రీతి అందునా ఆరో తేది ముక్కోటి ఏకాదశి ఉపవాసం వహించండి. ద్వాదశి నాడు శాక దానాదులు చేయండి.

కర్కాటక రాశి:

ఈ రాశివారికి చంద్ర కుజ రవి గురులు వల్ల కొద్దిపాటి కార్యానుకూలత ఉంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ప్రతికూలించి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమంలో ఉన్న శుక్రుని దృష్టి బుధుని దృష్టి కూడా వీరికి వ్యతిరేక ఫలితాల్ని తెలియజేస్తూ ఉన్నాయి. కొద్దిపాటి అనుకూలతని చేజిక్కించుకోవడం చాలా అవసరం . అవకాశాన్ని జార విడువ కండి .సాధ్యమైనంత వరకు ఎదుటివారి లోపాల్ని కాకుండా ఔన్నత్యాన్ని గ్రహించి మెలగండి . మీ వ్యక్తిత్వం ద్వారా వారిని జయించగలుగుతారు . మీకు గురుని అనుకూలత ఎక్కువగా ఉంది. దాన్ని మీరిప్పుడు వినియోగించుకోవడం చాలా అవసరం. ఒక సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. మీ దృష్టిని ఎవరూ దాటిపోలేరు . పునర్వసు వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పుష్యమి వారికి విపత్తార గావున వ్యతిరేక ఫలితాలు ఉండగా ఆశ్రేష వారికి సంపత్తార గావున శుభప్రదమైన యున్నది.

పరిహారం : ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని మించిన దైవం లేదు అందుకే ముక్కోటి ఏకాదశిని వినియోగించుకోండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి లేదా కేశవ నామాలు జపించినా శుభ ఫలితాన్ని పొందుతారు. శ్రీ మహావిష్ణువుకు తులసి మాల సమర్పణ చేయండి.

సింహరాశి :

మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లు మీకు మేలు చేయగలిగిన గ్రహాలు మంచి స్థానంలో ఉన్నాయి. కాబట్టి మీకు శుభ ఫలితాలు ఈ వారంలో కనిపిస్తాయి. అధికార ఒత్తిడి, పని ఒత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారం కూడా మిమ్మల్ని కొంచె ఇబ్బంది పెడుతుంది . పిల్లలు భార్య బంధువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పరిచే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి అవ్వడం వల్ల కొంతవరకు కొట్టుకుపోతుంది . మీకు ఇంట్లోనే ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయి. బయటకు వస్తే మీ గౌరవం పెరిగే అవకాశం ఈ వారంలో చాలా ఎక్కువగా ఉంది. గురుబలం వల్ల చాలా సమస్యల్ని మీరు పరిష్కారం చేయగలరు . మఖా నక్షత్రం వారికి జన్మతార గావును శరీరంలో వేడి ఆలోచన భారం ఉంటాయి. పుబ్బా నక్షత్రం వారికి పరమమిత్రతార కావున శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి అనుకూలతలు చాలా ఎక్కువ .

పరిహారం : మీరు ఆదినారాయణుడే శ్రీ మహావిష్ణువు గనుక సూర్యనమస్కారాలు చేయించండి. సోమవారం నాడు శ్రీ మహావిష్ణువు అర్చన చేయండి రెండింటికీ ఒకే ఫలితాన్ని మీరు తొందరగా పొందగలుగుతారు.

కన్యా రాశి :

ఈ రాశివారికి శుభ ఫలితాలు కొద్దికొద్దిగా ప్రారంభం కానున్నాయి. మీలో ఉన్న కళలకు కొత్తదనం ప్రోత్సాహం లభించనుంది. బుద్ధి కుశలత ద్వారా చాలా పనులు జరుగుతాయి. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది. కానీ అర్ధాష్టమ శని ప్రభావం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది . ఎముకలకు సంబంధించి ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి . ఒక్కసారిగా మీ ఆలోచనలు వేడెక్కి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవ కాశం ఉంది. ఎదుటి వారి మాటలు మిమ్మల్ని బాధ పెట్టడమే కాదు మీకు తొందరపాటు నిర్ణయానికి దోహద పరుస్తాయి .అవి ప్రత్యక్షంగా కాదు గాని పరోక్షంగా బాధించే అవకాశం ఉంది . ఉత్తర వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. హస్తా నక్షత్రం వారికి నైధనతార కావున చెడు ఫలితాలు ఎక్కువ . చిత్త ఒకట్రెండు పాదాల వారికి కార్య సాధన జరిగే అవకాశం ఉంది .

పరిహారం : కన్యారాశి చంచల స్వభావం కాబట్టి శ్రీ మహావిష్ణువుని తులసి మాలలతో అర్చించండి అదే విధంగా సూర్య నమస్కారాలు చేయండి .

తులా రాశి :

ఈ రాశివారికి శని బుధ శుక్రులు యోగ కారకులై ఉన్నారు శుక్రుని స్థానం శని స్థానం కూడా బాగుంది కాబట్టి మంచి ఫలితాలు పొందనున్నారు. అయితే ఆరోగ్య విషయంలో కించిత్ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇతరుల వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. సాధ్యమైతే మానేయండి . అత్యవసర ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకోవడం మంచిదిగా తెలుస్తోంది. ఈ వారం మీకు మీరుగా తీసుకున్న నిర్ణయంలో ఏ లోపం జరిగినా ఇబ్బంది ఉండకపోవచ్చు. మీ రాశ్యాధిపతి అష్టమాధిపతి కూడా అయ్యాడు గనుక మీ కళల్లో చిన్న అశక్తత దుర్జనత్వం తలెత్తనున్నాయి. నైపుణ్యం కొద్దిగా తగ్గుతున్నది . పూర్వపు వైభవాన్ని పొందాలంటే ఏకాగ్రత భంగం లేకుండా చూసుకోండి. స్త్రీలతో వ్యవహారం మీకు సత్ఫలితాలనివ్వదు . అధికారులతో కూడా ఆచి తూచి మాట్లాడటం మంచిది. చిత్త ఒకటి రెండు పాదాల వారికి కార్యసాధన జరుగుతుంది. స్వాతి వారికి ప్రత్యక్ తార గావున ప్రతి కూలతలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి కార్యసాధన జరిగే అవకాశాలు ఉన్నాయి.

పరిహారం : పదవ తేదీ శుక్రవారం పౌర్ణమి పడింది. ఆరోజు అమ్మవారి పూజ చేయండి విష్ణు సహస్ర నామమే మీ పన లను సానుకూల పరుస్తుంది .

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి స్వక్షేత్రంలో కుజుడు మేలునే చేయబోతున్నాడు.బ ద్వితీయ మందున్న ఐదు గ్రహాల్లో గురుడు రవి యోగం చేయనున్నారు. శుక్ర శనులు పాపులు అయి ఉన్నారు. అంతేకాదు ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పట్టినా చివరిలో అపకారము ఉపకారం రెండూ జరగనున్నాయి. కీర్తి ప్రతిష్టలకు తావు వుంది భంగము ఉంది.ఒక దగ్గర లాభము ఇంకో దగ్గర నష్టం అన్నట్లుగా పెరిగి వారం సాగిపోతుంది. వీరిలో ఎక్కువ మంది ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్య అనుకూలత తక్కువగా ఉంటుందిమ బిడ్డల అనుకూలత కూడా అంతే. బుద్ధి మాంద్యం కూడా ఉంది .కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది . అష్టమ రాహు ప్రతి కూలతని ఇవ్వనున్నాడు. విశాఖ నాల్గవ పాదం వారికి సానుకూలంగా ఉంది. అనురాధ వారికి ప్రతికూలత లెక్కువ. జ్యేష్థ వారికి

సంపదలు సమకూరే అవకాశం ఎక్కువగా ఉంది.

పరిహారం : విష్ణు ప్రీతికరంగా విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి. ఏకాదశి మహాపర్వదినం ఉపవాసం ఉండండి. లక్ష్మీ స్తోత్రాలు మీకు ఎక్కువ సుఖ శుభ ఫలితాన్ని ఇస్తాయి .

ధను రాశి :

ఈ రాశివారికి ఒక విధంగా శుభ ఫలితాలు ఎక్కువనే చెప్పాలి . అయినా పరస్పర వీక్షణ క్షేత్ర ఆధిపత్యం వల్ల ఏడు గ్రహాల ప్రభావం వీరిపై పడనున్నది. గురుబలం దైవ బలం ఉన్నంతవరకు వారి దృష్టి వీరిపై ఉన్నంత వరకు వీరు చాలా లాభాన్ని పొందగలుగుతారు . అంచేత మీరు ఎక్కువగా దైవాన్ని గురువుని విశ్వసించవలసిన అవసరం ఉంది . కుజుడు యోగ కారకుడైన అప్పటికి వ్యయ మందు ఉండటం వల్ల ఏదో ఒక హానిని చేకూర్చే అవకాశం ఉంది . తనుస్థానంపై శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందుకే మీరు బాధ్యతాయుతమైన పనులలో ఉన్నప్పుడు జాగ్రత్త వహించండి. ఏ పనీ లేనివారు ఎవరిని ఆశ్రయించినా వారు మాత్రం చాలా ఇబ్బందులు ఈ వారంలో ఎదుర్కొంటారు . ఆలోచనలు ఎక్కువ ఆచరణను తక్కువ అయితే మాత్రం మీకు కష్టకాలం అన్నట్టే చెప్పొచ్చు. మూల వారికి జన్మతార కావున జాగ్రత్త వహించండి. పూర్వాషాఢ వారికి పరమ మిత్ర తార గాన బావుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మిత్ర తారతో వారం ప్రారంభం గనుక ఎక్కువ సానుకూలత ఉంది.

పరిహారం : గురుడికి దైవానికి భేదం లేదు కాబట్టి మహావిష్ణువునే పూజించండి. ఉపవాసం ఉండండి పౌర్ణమి శుక్రవారం అమ్మవారిని స్తోత్రాలతో పూజించండి శుభ ఫలితాల్ని పొందుతారు.

మకర రాశి:

ఈ రాశివారికి కొంచెం ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. పన్నెండు ఇంట్లోనూ అరవై ఇంట్లోనూ ఉన్న గ్రహాలు ప్రతికూలంగా పనిచేసి ప్రతి పనిని వెనక్కి లాగుతాయి. వ్యవహారాలు ముందుకు నడవకపోవచ్చు.మీ కర్తృత్వ భోక్తృత్వాలకు మీరే కర్తలు. ఎవరినీ నిందించి ఏమీ ప్రయోజనం లేదు. మీరు మాట అన్నా పనిచేసినా అది వ్యతిరేకంగా పరిణమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యయస్థానం మందున్న శని ఆధిపత్య శుభుడు అయినా ఖర్చు లెక్కువ పెట్టిస్తాడు. లగ్నంలో ఉన్న గురుడు మీకు మంచిని కలిగిస్తాడు . మీరు చేయాల్సిందల్లా మంచి ఆలోచన . మంచి పనికి శ్రీకారం చుట్టండి అవి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీ మనస్సు స్థిరంగా ఉండదు . ఆరోగ్యం కూడా స్థిరంగా ఉండదు . చట్ట సంబంధమైన న్యాయం కూడా మీరు ఈ సమయంలో పొందలేరు . మంచి రోజుల కోసం ఎదురు చూడడమే మంచిది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు వారికి చాలా అనుకూలంగా ఉంది . శ్రవణం వారికి నైధనతార గావున సామాన్యంగా ఫలితాలుంటాయి. ధనిష్ఠ ఒకట్రెండు పాదాల వారికి కార్య సాధన చక్కగా జరిగే అవకాశం ఉంది.

పరిహారం: పదవ తేదీ పౌర్ణమి నాడు అమ్మవారి అర్చన జరిపించండి . ముక్కోటి ఏకాదశినాడు ఎక్కడున్నా సరే శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని రాముడిగా కృష్ణుడిగా ఎవరినైనా సందర్శించి నమస్కరించండి మంచి ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి :

ఈ రాశివారికి శుభ ఫలితాలు ఎక్కువగానే ఉన్నాయి మీరు మంచికి మంచి చెడుకి చెడు రెండింటినీ

శుక్రుడు సామాన్యుడు అవ్వడం వల్ల శని సమస్తాన్ని పొందడం వల్ల మీకు సామాన్య ఫలితాలే ఈ వారంలో ఉన్నాయి. గురుకృప తగ్గిన ఎంతో కొంత పూర్వ పుణ్య ఫలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యమూ భోగము భాగ్యం ఈ మూడు కూడా ఇంతకు ముందు ఉన్నంత అనుకూలంగా మాత్రము లేవు. మీ రాశికి మేలు చేయాల్సిన వారు వ్యయ మందుండడం కళలలో నైపుణ్యం తగ్గుతుంది. బుద్ధికుశలత నశిస్తుంది. మీరు చెప్పిన మాట ఎవరు వినరు. మీ ఇంట్లో మీరే కొత్త వాళ్లలాగా వ్యవహరించాల్సిన పరిస్థితి. మీకు మీరే నచ్చక పోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది గానం. సుభ ఫలితాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంది. శతభిషం వారికి ప్రత్యక్ తార గావున శుభఫలితాలు తక్కువ పూర్వాభాద్ర 1,2,3 పాదాల వారికి క్షేమ తార కావున శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి .

మీన రాశి :

ఈ రాశివారికి అనుకోని సంఘటనలతో జీవితం మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది ఆధిపత్య శుభులు చాలా మేలు చేస్తారు. శని దోష ప్రదుడే ఐనప్పటికీ గురు సంయోగం చేత మంచి ఫలితాల్ని ఇస్తాడు. శుక్రుడు దోష ప్రదుడే అయినా పది పదకొండు పన్నెండు అనగా రాజ్య లాభ స్థానాల్లో ఉన్న ఏడు గ్రహాలు వీరికి మంచి చేయనున్నాయి. అలాగే చంద్రుడు రాహు కూడా తాత్కాలిక మిత్రులు అవుతున్నారు. ఈ విధంగా వీరికి గ్రహాల అనుకూలత చాలా ఎక్కువ గా ఉంది. మంచి ఫలితాలని మేలును ఎక్కువ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాశులన్నిట్లోని కూడా మీనరాశి ఫలితాలు మార్పు చెందుతున్న ఈ రోజు నుంచి శుభ ఫలితాలు వీరికి ఎక్కువనే చెప్పొచ్చు .తొమ్మిది పది పదకొండు తేదీల్లో వీళ్లు చాలా మంచి శుభ ఫలితాల్ని చూసే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి క్షేమ తారగానే సంహితలు ఎక్కువగానే ఉన్నాయి ఉత్తరాభాద్ర వారికి ప్రతికూలతలు ఎక్కువ . రేవతి వారికి సంపత్తార గావున లాభాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది .

పరిహారం : పౌర్ణమి పూజ ఎక్కువ సత్ఫలితాలను ఇస్తుంది.ఆరో తేదీ సోమవారం ముక్కోటి ఏకాదశి పూజలు చేయండి సత్ఫలితాలాను పొందుతారు.

విశేషాంశాలు

12-01-2020 ఆదివారమ్

పుష్య మాసం, ఆదివారం ,పుష్యమీ నక్షత్రం పుష్యార్క యోగం అంటారు.చాలా మంచిది బంగారం కొనడానికి ఆభరణాలు ధరించడానికి ఏదైనా మంచి కార్యాన్ని తలపెట్టడానికి రాయడానికి కూడా చాలా మంచిది . బదనికలు సేకరణ కు మంచి రోజు. సాధనకు మంచిరోజు.

14-01-2020 మంగళ వారమ్

భౌమ చతుర్థీ, సంకష్టహర చతుర్థీ, భోగీ పండగ, గోదా దేవీ కల్యాణమ్.

15-01-2020 బుధ వారమ్

మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలమ్,

పెద్దల(స్వర్గస్థులైన వారి) పండగ.

16-01-2020 గురు వారమ్

కనుమ, పసుపు కుంకుమల పండగ. పశువుల పండగ.

17-01-2020 శుక్రవారమ్

ముక్కనుమ, బొమ్మల నోముల పండగ.

Next Story