రష్మి అంటే ఇష్టం..! ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చిన సుధీర్

By రాణి  Published on  13 Dec 2019 5:47 AM GMT
రష్మి అంటే ఇష్టం..! ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చిన సుధీర్

సుధీర్, రష్మీ బుల్లితెర పై చేసే హ‌డావిడి అంతా ఇంతా కాదు. ప్రేక్షకుల్ని బాగా ఎంట‌ర్ టైన్ చేస్తారు. అందుకే అన‌తి కాలంలోనే వీళ్లిద్ద‌రూ బాగా పాపుల‌ర్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే.. సుధీర్ అనగానే ర‌ష్మి‌, ర‌ష్మి అనగానే సుధీర్ గుర్తుకు వ‌స్తారు. వీరిద్దరి జంట అంత ఫేమస్ అయ్యింది. బుల్లితెర పై వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ చూసిన వాళ్లెవరికైనా స‌రే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నిపిస్తుంది. అదేనండి.. వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ ఉంద‌నుకుంటారు. యూట్యూబ్ లో అయితే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు చాలానే వచ్చాయి. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా..

అయితే ఇలా వస్తున్న పుకార్లన్నింటిపై సుధీర్ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవ‌ల సుధీర్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ర‌ష్మితో త‌న‌కు ఎఫైర్ ఉంద‌ని బ‌య‌ట జ‌నాలు అనుకుంటారు కానీ..మా మ‌ధ్య అలాంటిదేమీ లేదన్నాడు. అంతే కాకుండా రీసెంట్ గా ర‌ష్మి గురించి సుధీర్ కి కొన్ని నిజాలు తెలియ‌శాయ‌ట. త‌ను ఎంత క‌ష్ట‌ప‌డి ఇక్క‌డ‌కు వ‌చ్చిందో? వ‌చ్చిన త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొందో? తెలుసుకున్నాడ‌ట సుధీర్. అవి తెలిసిన తర్వాత ర‌ష్మి పై అప్పటి వరకు ఉన్న గౌరవం మరింత పెరిగిందని... ఈ విష‌యం త‌న‌కు కూడా చెప్పాన‌ని సుధీర్ చెప్పాడు. ర‌ష్మి అంటే ఇష్టం..గౌర‌వం..అది ఎప్ప‌టికీ ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు లేదు కానీ..మా మ‌ధ్య అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగా ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చాడు సుధీర్.

Next Story
Share it