రాశిఫలాలు మార్చి 8 నుంచి 14 వ‌ర‌కు

By సుభాష్  Published on  8 March 2020 12:44 PM GMT
రాశిఫలాలు మార్చి 8 నుంచి 14 వ‌ర‌కు

మేష రాశి :- ఈ రాశి వారికి జన్మంలో శుక్రుడు శరీర సౌఖ్యాన్ని కలుగజేస్తున్నాడు. ఆనందంతో పాటు ధన లాభం కూడా ఉంది. అయితే వీరికి రాజకీయ చిక్కులు సంప్రాప్తం కానున్నాయి .పదవ ఇంట్లో శని ఉండడం వల్ల, కుజుడు నవమ స్థానంలో ఉండటం వల్ల కొంత ధననష్టం కూడా పొందే అవకాశం ఉంది. కేతువు తాలుకా ప్రభావం వల్ల వీరికి శత్రు వృద్ధి జరుగుతోంది. రాహు తృతీయ స్థితి వల్ల సంపదలు సంప్రాప్తం అవుతున్నాయి. చంద్రుడు చతుర్ధ స్థానంలో ఉండడం వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వారాంతంలో ధనము సౌఖ్యము పేరు బాగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిపాటి కుటుంబ కలహాలు వల్ల కొంత ధనాన్ని కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. అశ్విని వారికి పరమ మిత్రతార కాబట్టి ఆర్థిక ఇబ్బంది కొద్దిగా ఉంటుంది. భరణి వారికి మాత్రం చాలా సుఖ సంపదలు సమకూరుతాయి. కృత్తిక ఒకటో పాదం వారి నైధన తారైంది కాబట్టి వ్యవహార జ్ఞానంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారం:- హోళీ పూర్ణిమ వస్తుంది అది తొమ్మిదో తేది పడుతోంది ఆ రోజు లలితా సహస్రనామ పారాయణ ఎనిమిదో తేదీ రాత్రి శివునికి అభిషేకం కూడా చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది .

వృషభ రాశి :- ఈ రాశివారికి చంద్రుడు శుక్రుడు మాత్రమే సహకరించి ఆనందాన్ని సంపదల్ని కలగజేస్తున్నారు. గురు కుజులు అష్టమంలో ఉన్నందువల్ల శస్త్ర బాధని చోర బాధ కలుగజేస్తున్నారు. దీనికి తోడు కుటుంబంలో వ్యక్తులకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీకు ఈ వారంలో విశేషంగా చెప్పుకోవాల్సిన శుభములు లేకపోయినా హెచ్చరికలు మాత్రం తప్పవు. అనారోగ్యకర హెచ్చరికలు ఉన్నాయి. ధన నష్ట సూచనలు ఎక్కువగా ఉన్నాయి. గౌరవానికి కూడా చిన్న భంగం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఏదిఏమైనప్పటికీ మీ దృష్టి అంతా కూడా భగవంతునిపైన నిలపండి ఏకాగ్రత గూడా చాలా అవసరం. మీకు ఏ కారణం లేకుండానే కలహాలు ఇంట్లో వారితోగానీ పై వారితో గానీ కలహాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు వారం అత్యంత జాగరూకులు మెలగవలసి ఉంటుంది. కృతిక రెండు మూడునాలుగు పాదాల వారికి నైధనం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రోహిణి వారికి సాధనం కార్య సాధనం అన్నాడు గనుక మీ కార్యాలు నెరవేరేది ఉంది. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి ప్రత్యక్తారైంది కొంచెం ఫలితాలు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి. అయితే జాగ్రత్త వహిస్తే సత్ఫలితాలు పొందగలుగుతారు.

పరిహారం :- ఈ వారంలో మీరు తొమ్మిది పదితేది ల్లో శివునికి అభిషేకం చేసుకోండి సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటే సత్ఫలితాల్ని పొందగలుగుతారు.

మిధున రాశి :- ఈ రాశివారికి ఈ వారంలో కార్య విఘ్నాలు శత్రు వృద్ధి ఎక్కువగా ఉన్నాయి. ఒక్క గురుడు సౌఖ్యాన్ని కలిగిస్తు ఉంటే జన్మ రాహువు భయ కారకుడు అవుతాడు. కాబట్టి వీళ్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శని ఆపదల్ని సూచిస్తున్నాడు. ఇవన్నీ వీరికి ఎక్కువ వ్యతి రిక్త ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో వీళ్లకి ఆరోగ్య విషయంలో లేదా కోర్టు వ్యవహారాలు విషయాల్లోగానీ ధనం వ్యయం ఉంది. ఉద్యోగ రీత్యా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది లేదా ఉద్యోగం కోసం ధనం ఇచ్చి మళ్లీ ధనాన్ని పొందలేక ఇబ్బంది పొందుతారు. ఏకాదశి మందున్న శుక్రుడు ధనలాభాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాడు. అంటే కొంతలో కొంత మీకు సుఖాల్ని కొన్నింటిని కలిగించే విధంగా ఉంది. ఏదేమైనప్పటికి మీరు ఈ వారంలో అతి జాగురూకులై ఉండాలి. ఎవరిని విశ్వసించి ఏరకమైన ఆశలకు పోకుండా ఏ రకమైన నమ్మకాలతో ముందుకు మాత్రం వెళ్లిపోవద్దు. ఇది ముఖ్యమైనటువంటి హెచ్చరిక. మృగశిర మూడునాలుగు పాదాల వారికి ప్రత్యక్ తారైంది. గౌరవ భంగం కనిపిస్తుంది. ఆర్ద్ర సాధన తయారైంది వారు అనుకున్నపనులను ఎలాగైనా నెరవేర్చుకుంటారు. పునర్వసు ఒకట్రెండు మూడు పాదాలు వారికి విపత్తారైంది కాబట్టి రాహు బలం చేత భయం కానవస్తూ ఉంది.

పరిహారం: ఈ వారంలో వీరు ఎక్కువగా రాహుకేతువుల పూజ చేయడం అష్టమ శని ప్రభావం పోవడానికి శనికి అభిషేకం గానీ లేదా నువ్వుల దానం గాని. చేయడం చాలా మంచిది.

కర్కాటక రాశి :- ఈ రాశివారికి గురు కుజ కేతులు షష్టంలో ఉండటం వల్ల గురుడు ఆలోచనా రీతిని మారుస్తున్నాడు. కుజుడు ధన ప్రాప్తిని ఇస్తే కేతువు సుఖ జీవితాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. లగ్న చంద్రుడు మృష్తాన్న భోజనాన్ని సూచిస్తూ ఉంటే అదే సప్తమంలో శని మహా విచారాన్ని కలిగించే బుధ్ది ఇస్తున్నాడు. మొత్తం మీద ఈ రాశివారికి ఈవారంలో శుభాశుభ మిశ్రమ మైంది. వీరికి ఈ వారం గతంలో కంటే చిన్న మెరుగని పిస్తుంది గాని పూర్తి సత్ఫలితాలుంటాయని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. ఏదైనా వ్యవహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న నష్టం సమకూరి అవకాశం ఉంది. మీ ఆలోచనలు తాత్కాలికంగా మీ పనులు వాయిదాలు పడుతాయి. మీకున్నటు వంటి మిత్రులు కూడా మీకు సహకరించే స్థితిలో లేకపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ల దగ్గర మీరు చాలా జాగ్రత్త పడటం అవసరం. పునర్వసు నాలుగో పాదం వారికి విపత్తార యింది కాబట్టి ధనము చేటు కల్పిస్తున్నది. పుష్యమి నాలుగు పాదాల వారికి సంపత్తారైంది. ఆశ్రేష వారికి మాత్రమే జన్మ తారైంది కాబట్టి వారికి ఏదో ఒక లాభంతో కూడిన స్థానచలనం కంపిస్తుంది.

పరిహారం :- వీలైనంతవరకు చంద్రుని తాలూకా జపం చేయండి. పాలతో శివుడికి అభిషేకం చేయించండి సత్ఫలితాన్ని పొందుతారు.

సింహరాశి :- ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి కనిపిస్తోంది. భూ గృహాదులు ఏదైనా కొనే అవకాశం ఉంది. విశేషించి గురుడు సంపదని ఎక్కువగా ఇచ్చే స్థితి ఉంది. దానికి తోడు కేతువు కూడా సుఖజీవనానికి మార్గం సూచిస్తున్నాడు . ఒక్క ఆరోగ్య విషయంగానే ఆలోచించుకోవాలి. రాహువు ధనలాభాన్ని కేతువు ధన సంపాదన జరిగినా స్థిరంగా ఏదైనా కొని ఉంచేయడానికి గాని ప్రయత్నించండి. లేదా ఎవరికైనా ఇచ్చిజాగ్రత్త పడడం చాలా మంచిది. మీ చేతిలో ఉంటే మాత్రం ధనవ్యయం తప్పదు. అరువుతెచ్చుకున్న వస్తువులు మీ దగ్గిర నిలుపుకోండి పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ఎదుటి వారి ప్రభావం మీపైన పూర్తిగా పనిచేస్తుంది. ఆత్మ బుద్ధి మంచిది. ఈ వారంలో శత్రుమూలక భయం అనేది ఉంది .దానివల్ల మిత్రులతో ఎక్కువగా మెలగండి. మఖా నక్షత్రం వారికి అనుజన్మ తారైంది వీరి కొంచెం దేహ తాపం తప్పదు. పుబ్బా నక్షత్రం వారికి మిత్ర తారైంది ధనలాభం కనిపిస్తోంది. ఉత్తర ఒకటో బాదం వారికి మాత్రమే నైధన తార అయింది కాబట్టి జాగ్రత్త పడడం చాలా అవసరం.

పరిహారం:- దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చేస్తే మీకు శుభాలు వర్తిస్తాయి.

కన్యా రాశి:- ఈ రాశివారికి ఈ వారంలో ఫలితాలన్నీ కూడా ఆదాయ వ్యయాలు రాజ పూజ్య అవమానాలు గౌరవ మర్యాదలు గానీ చదువు సంధ్యలు ఇలాంటివి అన్నీ కూడా సమస్థాయిలో ఉన్నాయి. అంటే కష్టపడితేనే ఫలితం. చతుర్థంలో ఉన్న గురు కుజ కేతులు ధననష్టం శత్రుపీడ గౌరవ భంగం సూచిస్తున్నారు. శని సంతానానికి ఇబ్బందులు సూచిస్తున్నాడు. శత్రు వర్గాన్ని రాహువు చూపిస్తుంటే బుధుడు అలంకార ప్రభలు చూపిస్తాడు. ఒకటి సంపాదిస్తే ఇంకోటి పోగొట్టుకోవడం ఉంది. అంచేత వీరు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉన్న గ్రహస్థితిని బట్టి వీరు మంచిగా ఆలోచించుకుంటూ ముందడుగు వేయడమే చాలా మంచిది. మంచి వారి మాట వింటూ విలువైన స్థిరమైన ఆలోచనలు మార్చుకుని ప్రవర్తించండి. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మీరు బాధపడేటటువంటి పరిస్థితి ఉంది. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వారికి నైధన తారైంది కాబట్టి ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. హస్తవారికి మాత్రమే సాధనం కార్యసాధన అన్న రీతిలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. చిత్ర ఒకటి రెండు పాదాలు వారికి ప్రత్యక్తార గాబట్టి వ్యతిరేక ఫలితాలున్నాయి.

పరిహారం :- దేవి ఖడ్గమాల పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య అర్చన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది .

తులా రాశి:- ఈ రాశి వారికి సప్తమంలో శుక్రుడు రోగాన్ని సూచిస్తున్నాడు. పాత రోగాలు తిరగబెడతాయి. కంటికి సంబంధించిన బాధలు, నడుము నొప్పి కడుపు నొప్పి ఉదరసంబంధమైన వ్యధులు తలెత్తుతాయి. తృతీయంలో ఉన్నటువంటి గురుడు కష్టాన్ని కలిగించి పోతున్నాడు. కుజుడు అదే స్థానంలో ఉండి సర్వ భోగాన్ని ఇవ్వబోతున్నాడు. కేతువు భోగాలను పొందే మార్గం సూచిస్తాడు. కాబట్టి వీరు కొంచెం ఆలోచించి అడుగు వేస్తే ధన లాభాన్ని పొందగలుగుతారు. స్నేహితులతో సత్సంబంధాలను పెంచుకునే ప్రయత్నమే చేయండి స్నేహితులు నిరోధించే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. మీ తల్లిదండ్రులు యొక్క బంధువులు యొక్క అనారోగ్యాలు మిమ్మల్ని కలతకు గురిచేస్తే మీ ప్రాణ స్నేహితుల ఆరోగ్యాలు గూడా కొంచెం ఇబ్బందిని కలిగిస్తాయి. పూర్వ మిత్రులను మాత్రం కలుసుకునే అవకాశం ఉంది. పెళ్లికాని వారికి పెళ్లి ప్రయత్నం చేస్తే మాత్రం కలిసొస్తుంది అనిపిస్తుంది. మీ సంపద భాగ్యాన్ని చూసి ఇతరులకు కన్నుకుట్టి వాళ్లు శత్రువులుగా మారే అవకాశం ఉంది. చిత్త మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్తారైంది వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు గురుబలం బాగుంది కొంచెం శుభఫలితాలు కనిపిస్తూన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి విపత్తార అయింది కాబట్టి శుభఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం :- మీరు రుద్రాభిషేకం చేయించినా సరే దక్షిణామూర్తి స్తోత్రం చేసినా సరే శుభ ఫలితాలు సంప్రాప్తమౌతాయి.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి తృతీయ మందున్న గురు కేతులు కొంత ఇబ్బందిని కలిగించిన కుజుడు మాత్రము సకల భోగాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఉదర సంబంధమైన రోగం వస్తుంది. అకారణ కలహం వస్తే సాధ్యమైనంతవరకు దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేనిపోని నిందలు కూడా ఈ వారంలో మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయమా బాగుంది అంతకు మించిన ధనవ్యయం.కనిపిస్తున్నది శని ధనలాభాన్ని సూచిస్తుంది. ఒక్కొక్కసారి మీరు మానసికంగా నిరుత్సాహానికి గురై పోయే స్థితి ఉంది. గురు బలము మీ దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా మీకు ఏదో ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరమైన ఆలోచన లేదా విద్యాపరమైన ఉద్యోగపరమైన ఆలోచనలు కావచ్చు అది నిజానికి అవి పెద్ద సమస్యలైతే కాదు గానీ మీకు అటువంటి భావోద్వేగం కలిగే అవకాశం ఉంది. మీకు మీ జాతకరీత్యా కూడా శత్రువులు ఎక్కువ మీరు అనుకున్న పనులు కొన్నింటిని వాయిదా వేసి అనుకోని పనులకు మీరు హాజరవుతారు. దాని ద్వారా మీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. విశాఖ నాలుగో పాదం వారికి విపత్తారైంది ప్రతికూల ఫలితాలున్నాయి. అనురాధ వారికి సంపత్తారైంది ఫలితాలు బాగున్నాయి. జ్యేష్ట వారికి జన్మ తారైంది ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.

పరిహారం :- సప్తశతి పారాయణ ఖడ్గమాల పారాయణ మీకు శుభ ఫలితాలని ఇస్తాయి.

ధనూ రాశి:- ఈ రాశివారికి లగ్నం లో ఉన్న గురుడు స్థాన చలనాన్ని సూచిస్తున్నాడు. అది శుభ స్థానము కాదు. భయ స్థానమే అవుతుంది. నూతన స్థానానికి వెళ్లిన మీకు ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగరీత్యా వెళితే తప్పదు గానీ కొన్ని విషయాల్లో మీ ప్రయాణాలు వాయిదా వేసుకుని చాలా మంచిది. అక్కడ అవమానాల భాగమే ఎక్కువగా ఉంది. అంచేత మీ గ్రహస్థితిని బట్టి ఈ వారంలో మీరు మౌనాన్ని పాటించడం, దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా అవసరం. మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది. పాత మిత్రులను కలుసుకుంటారు వారితో ఉన్నటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ పునరుద్ధరింపబడుతుంది. సప్తమ రాహు మిమ్మల్ని అన్ని పనుల్లోని వెనకాల పెడతాడు. మనో జవంతు మాండవ్య అన్నట్టుగా మీ మనసు చెప్పినట్టుగా మీరు ప్రవర్తించి అందులోంచి బయటపడడానికి ప్రయత్నించండి. మూల నక్షత్ర జాతకుల కు ప్రత్యక్తార కనుక సామాన్యం. పూర్వాషాడకు మిత్రతార శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి నైధన తార అయింది కాబట్టి ఫలితాల్లో వ్యతి రిక్తతఎక్కువగా ఉంది. పరిహారం: మీరు గురుడికి స్తోత్రం చేసినా గురువారం నియమం పాటించిన షిర్డీ సాయినాథుని చరిత్రను పారాయణ చేసిన మీకు శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి :- ఈరాశి వారికి లగ్నాధిపతి శని విపత్తును ద్వితీయ స్థానానికి అధిపతి అవడం వల్ల భయం కలుగుతుంది. కష్టనష్టాలు అన్ని కూడా మీ దగ్గరలోనే ఉన్నాయి. ఇవన్ని ఒకేసారి వచ్చి ఇబ్బంది కలుగుతుంది. వీరికి రావలసిన బాకీలు వసూలు కావు. పరీక్ష విద్యలో కూడా వ్యతిరేకత ఫలితాలు పొందుతారు. మిమ్మల్ని అంటి పెట్టుకున్న వాళ్లపై కూడా ఈ ప్రభావం పడితుంది. అరుదైన మంచి సహవాసాన్ని సాధిస్తే ఆనందం పొంది తమ ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం వస్తుంది. అలాంటి వారు మీకు తారసపడ్డా చిక్కరు. లగ్నంలో షష్ఠ స్థానంలో ఉన్న రాహువు సుఖ జీవితాన్ని చూపబోతున్నాడు. అది కూడా మీరు అనుకున్నప్పుడు కాకుండా వారం మధ్యలో అలాంటి అవకాశం లభిస్తుంది. చంద్రుడు మాత్రమే స్త్రీ సౌఖ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తారు. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తారైంది కాబట్టే వ్యతిరేక ఫలితాన్ని శ్రవణం వారికి మంచి పనులు జరుగుతాయి. ధనిష్ట ఒకట్రెండు పాదాలు వారికి ప్రత్యక్తారైంది కాబట్టి కొంత దైవ దర్శనాల వల్ల సుఖం.

పరిహారం :-శనివారం నాడు చేనువ్వులు దానం చేసినట్లైతే మంచి పలితాలు పొందగలరు.

కుంభ రాశి :- ఈ రాశివారికి దుఃఖ కాలం ప్రారంభమవుతుంది. ఇప్పటికే చిన్న సమస్యలు ఎదుర్కొని కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వ్యయమందున్న శని కూడా వీరికి ధననష్టం స్థాన చలనాన్ని కలిగిస్తున్నది. ఆందోళన కారణంగా కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. అపకీర్తి కలిగే అవకాశం ఉంది. ఎవరినీ నమ్మలేకుండా అయిపోతారు. మాట పట్టీంపు వల్ల ఉన్న బంధుత్వాన్ని స్నేహితుల్ని కోల్పోతారు. శ్రమకు తగ్గ ఫలితం లభించక సంతోషాన్ని అనుభవించ లేక అనవసరంగా ధన వ్యయాన్ని కూడా చేసుకుంటారు. చెడు కలలు కంటూ చెడు ఆలోచనలు చేసి చెడు సావాసాల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. వారాంతంలో మాత్రం శరీర సౌఖ్యాన్ని కుటుంబ ప్రేమని పూర్తిగా పొందగలుగుతారు. ధనిష్ట మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు సామాన్యంగా వున్నాయి. శతభిషం వారికి మాత్రమే క్షేమ తారైంది కాబట్టి కుటుంబ సౌఖ్యము ఉంది. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి రాహు అధిపతి అని విపత్తార దిగాలుతో ఫలితాల్లో మార్పు కనిపిస్తుంది.

పరిహారం :- శనివారం నాడు శనికి జపం నువ్వులు దానం చేయడం మంచిది.

మీన రాశి :- ఈ రాశి వారికి లగ్నాధిపతి దశమాధిపతి గురుడు దశమంలో ఉండటం వల్ల మిశ్రమ ఫలితం కలుగుతుంది. శ్రమకి తగ్గ ఫలితం లభించడం లేదు. అలాగే కుజుడు ఎంతో శాంతిని సంతోషాన్ని ఇచ్చిన సంతోషకరంగా ధనంతో కొనుక్కున్నట్టు అవుతుంది. ఉన్నదాన్ని ఆ సౌఖ్యం కోసం పోగొట్టుకున్నట్టే అయిపోతుంది. శుక్రుడు శరీర సౌఖ్యాన్ని పోషణ స్థానాన్ని చూస్తున్నాడు. కావున మీరు అవమానాన్ని పొందువలసి ఉంటుంది. వ్యవహారాన్ని ఎంత భరించ గలిగితే అంతవరకు కూడా సత్ఫలితాలను పొందగలుగుతారు. మీలో ఉన్న సుగుణములు వల్ల శ్రమకు గురి కాకుండా ఇతరులకు సహకరించే స్థితికి ఎదుగుతారు. కాబట్టి మీ జీవన విధానంలో గొప్పదైన మార్పొస్తుంది. ఈ మార్పు మంచికే తీసుకుంటుంది. పూర్వాభాద్ర నాలుగు పాదం వారికి విపత్తార అయింది కాబట్టి వారికి చెడు ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఉత్తరాభాద్ర వారికి సంపత్తార కాబట్టి ఫలితాలు సుఖప్రదంగా ఉన్నాయి. రేవతికి జన్మతార సామాన్య ఫలితాన్ని పొందగలుగుతారు.

పరిహారం: గురువార నియమాలను పాటించడం రాహుకేతువులు పూజలు చేయడంవల్ల కొంత సత్ఫలితాలు, సుబ్రమణ్యస్వామి అర్చన సుఖ సౌఖ్యాన్ని ఇస్తుంది.

Next Story