రాశిఫలాలు మార్చి 1 నుంచి 7 వ‌ర‌కు

By Newsmeter.Network  Published on  1 March 2020 5:01 AM GMT
రాశిఫలాలు మార్చి 1 నుంచి 7 వ‌ర‌కు

మేష రాశి :

ఈ రాశివారికి ఈ వారంలో శుభ పరిణామాలు శుభ ఫలితాలు కూడా కొంచెం పొందనున్నారు. స్వ క్షేత్రంలో చంద్రుని సంచారము, తన స్వక్షేత్రం వైపు శుక్రుని యొక్క సంచారము రెండు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వనున్నాయి. అనుకున్న పనులు చాలావరకు నెరవేరుతాయి. వీరికి గురుడు కూడా యోగ కారకుడై యున్నాడు. ఉద్యోగంలో వ్యాపార విషయంలో మంచి మార్పులు జరుగుతాయి . ఇంతవరకు చూడని అభివృద్ధిని కూడా కొంచెం కొంచంగా సాధించే అవకాశం ఉంది. కాలసర్ప యోగ ప్రభావము వీరికి ఉన్నప్పటికీ శుక్ర చంద్రుల యొక్క పరిణతి వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకు సాహసిస్తే పనులన్ని కూడా నెరవేరుతాయి. భరణీ నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు. కృత్తిక ఒకటవ పాదం వారికి పరమమిత్రతార కనుక శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : మీరు ఆంజనేయస్వామిని అర్చన చేస్తే చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. శుక్రుడికి సంబంధించినటువంటి (రాజ మాషం అంటారు) బబ్బుర్లు, తెల్లని వస్త్రాన్ని దానం చేయండి మంచి ఫలితాలొస్తాయి.

వృషభ రాశి :

ఈ రాశివారికి రాశి అధిపతి చంద్రుడు స్వక్షేత్రంలో సుమారు రెండున్నర రోజులు ఉంటున్నాడు కనుక శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్వక్షేత్రం వైపు శుక్రసంచారం ఇది కూడా బావుంది. కానీ కాలసర్పదోష ప్రభావం వీరిపై ఎక్కువగా చూపించనున్నది. వీరికి శుభ పరంపర కొనసాగుతోంది. మాతృ సంబంధ విషయాన్ని చర్చిస్తారు ఆమె ఆరోగ్యాన్ని గూర్చి కొంచెం ఆలోచిస్తారు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అయితే శని ప్రభావం చేతను కొంతవరకు వీరికి కొన్ని ఇబ్బందులు లేకపోలేదు .ప్రతి విషయంలో నిరుత్సాహము నూతన వ్యక్తులతో పరిచయం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి ఒక మంచి మాట వినే అవకాశం కూడా వీరికి లేకపోలేదు. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుభ పరంపర ఉన్నది. రోహిణి నక్షత్ర జాతకులకు నైధన తారయింది కాబట్టి అశుభ ఫలితాలు ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి సాధన తార అయింది చంద్ర అధిపత్యం వల్ల వీరు సుఖ సంతోషాల్ని పొందుతారు.

పరిహారం : చంద్రునికి బియ్యం, తెల్లని వస్త్రం దానం చేయండి .ఏడో తేది శనిత్రయోదశి ఉంది అరోజు నాడు వీరు తైలాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు .

మిథున రాశి :

ఈ రాశివారికి రాశిలో రాహు సంచారం వల్ల ఇబ్బందుల తీవ్రత ఎక్కువగా ఉంది అయినా గురుని దృష్టి వల్ల కొంత బలం చేకూరి వాటిని అధిగమిస్తారు. కుజుని దృష్టి గురుని దృష్టి రెండు భిన్న భిన్నంగా ఉండి కోపం ఎక్కువవుతుంది, చేయు వృత్తి వ్యాపారాల్లో చిన్నచిన్న ఆటంకాలు ఒస్తాయి. శారీరక ఇబ్బంది వచ్చినా గురు ప్రభావం చేత పెద్దవాళ్ల సలహా సంప్రదింపులు చేత వీరు శుభ ఫలితాలను పొందగలుగుతారు. అష్టమ శని ప్రభావం వల్ల కుటుంబ పరమైన పట్టుదలలు పంతాలు మీకు నష్టమేగాని లాభం లేదు. దేనికైనా పెద్దలు , గురువుల ఆశీస్సులు పొందండి. అష్టమ శని వల్ల అకాల భోజనము అనవసర శ్రమ చేసిన పనికి తగిన ఫలితం లేకుండా పోవడం జరుగుతుంది. దైవ చింతన కలిగి ఉంటారు గనుక వేదాంత సంబంధం విషయాన్ని చర్చిస్తారు గనుక పర్వాలేదు. వీరి క్రింది ఉద్యోగులతో లేదా పని వారితోనో వీరికి ఇబ్బందులు విరోధాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే మృగశిర మూడు నాలుగు పాదాల వారికి చంద్ర ఆధిపత్యం వల్ల చాలా బావుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రమే వ్యతిరిక్త ఫలితాలు ఎక్కువగా కనిపిస్తిన్నాయి. పునర్వసు వారికి క్షేమ తారైంది గురుని ఆధిపత్యం వల్ల వీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది.

పరిహారం : శనిత్రయోదశి నాడు కేవలం శనికి తైలాభిషేకం చేయించండి. నువ్వులు దానం చేయండి. నల్లని వస్త్రం దానం చేయండి. శనివారం నాడు నువ్వులు బెల్లము కలిపి ఆవుకు తినిపించండి.

కర్కాటక రాశి :

ఈ రాశివారికి కొద్దిపాటి శుభాశుభ ఫలితాలతో ఈ వారం గడుస్తుంది. వీరికి మంచి మంచి అవకాశాలు వస్తాయి చిన్న అశ్రద్ధ వల్ల చేజారిపోతాయి. వ్యయరాహు ప్రభావము వీరిపై పని చేస్తుంది. మాట పట్టింపులు మనుషుల మీద నమ్మకం లేకపోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వీరికి శుక్ర కుజ గురు కుజులు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల సమయానికి వీరికి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అందువల్ల పరీక్షలకు వెళ్లే వారికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు దురదృష్టవశాత్తు స్నేహితులు వల్ల మీరు మంచి అవకాశాన్ని కోల్పోతారు. జాగ్రత్త వహించండి. అష్టమంలో ఉన్న రవి ప్రభావం చేత మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా తండ్రిగారి ఆరోగ్య విషయము మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. మీరు ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగువేయడం ఒక నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది దాన్ని విడిచి పెట్టుకోకండి. పునర్వసు నాలుగో పాదం వారికి

గురు ప్రభావం చేత పనులు సానుకూల పడతాయి. పుష్యమి వారికి మాత్రమే విపత్తార అయింది కాబట్టి అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆశ్రేష వారికి సంపత్ తారైంది కాబట్టి ధనాదాయం బావుంటుంది.

పరిహారం : వీరు ॥గురుడికి సంబంధించి శనగలు దానం చేయండి లేదా తెల్ల ఆవాలు బెల్లము గురువారంనాడు ఆవుకు తినిపించండి. దక్షిణామూర్తి స్తోత్రం చదవండి బావుంటుంది.

సింహరాశి :

ఈ రాశివారికి రాశ్యాధిపతి రవి శత్రు క్షేత్రంలో వర్తించడం వల్ల శరీర ఆరోగ్యము మానసికం గా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయంలో కూడా మీరు ఆలోచనలు చేయవలసి నటువంటి అవసరం ఏర్పడుతుంది. మీకు కోపం వల్ల చేసే వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ధననష్టం ఉంటుంది. శారీరక ఇబ్బందులు కూడా ఉన్నాయి. మీకు ఒక ఇబ్బంది కలిగించే వార్త అధికార నుంచి ఒస్తుందొ. దానితో లేనిపోని తలనొప్పులు తెప్పించుకోవడం భయాందోళనలు కూడా ఎక్కువవుతాయి. అధికారులుతో విరోధం ఉంది. దాన్ని అధిగమించడానికి మీ వాక్కుని మీరు అధీనంలో పెట్టుకుంటే చాలా బావుంటుంది. కుటుంబ స్థాన అధిపతి బుధుడు పాపితో కలిసి వక్రించి ఉండటమే మీకు వ్యతిరేకతలను ఇస్తూ కుటుంబ కలహానికి దారి తీస్తుంది. మిమ్మల్ని మీరు ఎంతవరకు నిగ్రహించుకుని ఉంటుంటే అంత బాగుంటుంది. యోగ సాధన మీరు మళ్లీ ప్రారంభించండి. మనోధైర్యం కంటే ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపించ గలుగుతుంది. మఘా నక్షత్ర జాతకులకు బుధుడు ఆధిపత్యం వల్ల శుభఫలితాలున్నాయి. పుబ్బ వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి పరమ మిత్రతార వల్ల కొద్దిపాటి బావుంది.

పరిహారం : ఆదిత్య హృదయం చదవండి లేదా సూర్యనమస్కారాలు చేయించండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సరస్వతీశూక్త పారాయణ మంచిది .

కన్యా రాశి :

ఈ రాశి వారికి మానసిక ధైర్యమే ధైర్యము .దానివల్ల చాలా దుష్ఫలితాల్ని అధిగమించే అవకాశం ఉంది. అర్ధాష్టమ గురు అర్ధాష్టమ కుజప్రభావము మీకు ఇబ్బందిని కలగజేస్తుంది. అలాగే రాహు పరిస్థితి కూడా మిమ్మల్ని ఒత్తిళ్లకు గురి చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒత్తిడులకు లొంగకుండా ఉన్నట్లయితే ఆర్థికపరంగా కొంచెం బావుంటుంది. కొత్త ఉద్యోగాలు కొత్త వ్యాపారాలకు అనుకూలమైన రోజులు మాత్రం కావు. ఏదైనా గురువు లేదా పెద్దవారి సలహా సంప్రదింపులు మీకు బాగా పనిచేస్తాయి. మీకు ఇంట్లో బయట కూడా వ్యతిరేక ఫలితాలువఉన్నాయి. వాటిని అధిగమించే ధైర్య స్థైర్యాలు కూడా మీకు వస్తాయి. కానీ స్థిరంగా మీరు ఆలోచించడం మొదలుపెట్టిన నాడు మీ సత్ఫలితాలని మీరే పొందగలరు. రవి రాహువులు మాత్రమే ఈ రాశివారికి యోగించే అవకాశాలున్నాయి. అష్టమంలో శుక్రసంచారం జరిగినాబతన స్వ క్షేత్రానికి దగ్గర్లో ఉన్నాడు గనుక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి కుజాధి పత్యం వల్ల ధైర్యం తగ్గి శత్రువు వర్గం పెరిగే అవకాశముంది. హస్త వారికి శుక్రాధిపత్యం వల్ల కొద్దిపాటి కుటుంబ సౌఖ్యం ఉంది. చిత్త ఒకటి రెండు పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతి రిక్త ఫలితాలు పొందుతున్నారు.

పరిహారం : గురువారం నియమాన్ని పాటించండి తెల్ల అవాలు బెల్లము గురువారం ఆవుకి తినిపించండి. కాలసర్ప దోషం ఉంది కనుక భైరవ కవచం పారాయణ మంచిది.శుభ ఫలితాలు పొందగలుగుతారు.

తులా రాశి :

ఈ రాశివారికి శని బుధ శుక్రులు యోగ కారకాులు. యోగ కారకుడైన శుక్రుడు సప్తమం లోంచి చూడడం ఒక విధంగా తన క్షేత్రాన్ని తను చూస్తున్నాడు గనుక మేలే చేస్తాడు. వీరికి ఈ వారంలో శుభాశుభ మిశ్రమం. పంచమాధిపతి శని అర్ధాష్టమంలో ఉన్నా వీరికి కొంత మంచేజరుగుతుంది. స్త్రీ మూలక ధన వ్యయము తప్పదు. ఎవరితోనైనా కలిసి వ్యాపారాలు చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వీరికి ఈ వారంలో సమస్యలు ఎక్కువగా ఒస్తాయి. ప్రతి చిన్న సమస్య మీకు పెద్ద సమస్యలా కనిపించి మీ ఆత్మస్థైర్యం మనోధైర్యం రెండింటినీ దెబ్బ తీస్తాయి. అడుగడుగున ఆటంకాలే కనిపిస్తాయి. గురుబలం కోసం పెద్దల యొక్క గురువుల యొక్క సలహాలు తీసుకొని ఆచరించండి. పరీక్షలు ఉన్నట్లయితే అందులో నెగ్గే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు విడిచిపెట్టొద్దు. అనుకూలమైన రోజులు వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఈ వారం అనుకూలత లేదు. మీకు అర్ధాష్టమ శని ప్రభావం కూడా పనిచేస్తోంది. తీవ్రత ఈ వారంలో ఉండకపోవచ్చు. చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి శుక్రుని ఆధిపత్యం శుభ ఫలితాలు రానున్నాయి. స్వాతి వారికి నైధన తార శని అధిపతి కాబట్టి వ్యతి రిక్త ఫలితాలు. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి చంద్రుడు అధిపతి అయ్యాడు కనుక కార్యాలు నెమ్మదిగా నెరవేర్చుకుంటారు.

పరిహారం : అర్ధాష్టమ శని ప్రభావం ఉంది గనుక శనిత్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించండి శని స్తోత్రం పఠించండి. మన్యుసూక్త పారాయణ మంచిది .

వృశ్చిక రాశి :

ఈరాశి వారికి శుభ పరంపర ప్రారంభం అయిందనే చెప్పొచ్చు. వీరు గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని పొందుతారు. గురుడు ద్వితీయ మందున్నా పంచమాధిపత్యం రావడం వల్ల అనుకున్న పనుల్లో చాలా నెరవేర్చుకునే అవకాశం ఉంది. ద్వితీయ మందున్న కుజుడు కొన్నిటికి వ్యతిరేకించినా గురు సంబంధం వల్ల నెరవేర్చుకుంటారు. వారం మధ్యలో వీరికి ప్రతికూలతలు ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. చంద్రుడు ఉచ్చ క్షేత్రంలోకి వెళ్లాడు గనుక మనో ధైర్యం ఉంటే ఫలితాలు పొందుతారు. కానీ పూర్ణ ఫలితం పొందుతారని చెప్పలేం. ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. ఆరోగ్యం విశయంలోనూ ప్రయాణాలు వీలేతే వాయిదా మంచిది .ఉద్యోగ వ్యాపార విషయాలలో కొద్దిపాటి అనుకూలత కనిపిస్తున్నాయి. వారాంతంలో మీ ఫలితం చూసుకుంటే చాలా బావుంటుంది కానీ వారం మధ్యలో మాత్రం ఇబ్బందులున్నాయి. విశాఖ నాలుగు పాలు మారి శుభ ఫలితాల్ని కొంత పొందుతున్నారు అనురాధలు ప్రత్యుత్తర కేతువుకి కాబట్టి దైవ చింతన చేతనే మాత్రమే శుభ్రతలు పొందుతారు జ్యేష్ట వారు ఈ వారంలో ఎక్కువ సహకరాన్ని పొందగలుగుతారు

పరిహారం : మన్యుసూక్త పారాయణ మంచిది అది చిగురు ఆదిత్య హృదయ పారాయణ చేయడం అవసరం.

ధనూ రాశి :

ఈ రాశి వారికి ఈ వారం అనుకూలత తక్కువగా ఉంది. కుజ రాహువుల ప్రభావం వీరిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరోగ్యమో వ్యవహారమో వ్యాపారమో ఉద్యోగమో ప్రతి దాంట్లోని ప్రతి కూలతలను చూస్తారు. అంతే కాదు విజయం మాట అటుంచి కనీసం తమని తాము నిగ్రహించుకోలేక ఎటువంటి శక్తి కూడా లేనివాళ్లుగా బాధపడతారు. దైవ ప్రేరణ అనేది మాత్రమే వీళ్లని ఈ వారంలో చక్కగా నిలబెట్టగలిగుతుంది. బుద్ధికుశలతతో ఉంటే మీరు ఈ వారాన్ని సులువుగా అధిగమించే అవకాశం ఉంటుంది. శని ప్రభావము పని చేయబోతోంది. శుక్రుడు బుధుడు వ్యతి రిక్త ఫలితాన్ని ఇస్తారు . ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నానికి అనుకూలత తక్కువగా ఉంది. వాహన ప్రమాద అవకాశం వుంది గనక వాహనం నడిపే వాళ్లు జాగ్రత్త వహించండి. మూలా నక్షత్ర జాతకులకు రాహు విపత్తార అయ్యింది కాబట్టి ప్రతికూలతల ఎక్కువగా ఉనంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు బుధుడు ఆధిపత్యం వహిస్తూ సంపత్ తారైంది కాబట్టి ధనలాభం ఉంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి రవి ఆధిపత్యం అనారోగ్య సూచన కనిపిస్తుంది.

పరిహారం : మీరు ఎక్కువగా రాహు కేతు కాలసర్ప దోష నివారణార్థం పూజలు చేయించండి. సూర్య నమస్కారాలు చేయండి మన్యు సూక్త పారాయణ చేయించండి.

మకర రాశి :

మకర రాశి రాశి వారికి గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉన్నప్పటికీ మనోజ వంతు మాండవ్య అన్నట్టుగా మనోబలమే వీరికి ముఖ్యం తల్లివలె చంద్రుడు వీరిని ఈ వారంలో చాలా బాగా రక్షిస్తాడు ఎన్ని అనుకూలత లొచ్చినా వీరు కార్య నెరవేరుస్తారు ఇతరుల కార్యాల్ని కూడా నెరవేర్చే సాహసం చేస్త మీ స్థాయి తగ్గినట్లు అనిపించినా మిత్రులు తగ్గించాలని ప్రయత్నం చేసిన పట్ల అధిగమించే అవకాశం ఉంది మీకు వ్యతిరేకత సంఘాల్లో కూడా ఉంది అయినా మీరు వాటిని దాటుకుంటూ వస్తారు మీ స్నేహితులతో మీరు చక్కగా మెలుగుతారు కానీ కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు ఎదుర్కొంటారు మీ విషయంలో పెద్ద అనుకూలత లేకపోయినా ఇతరులకు మీరు సహాయం చేయాలనుకుంటే మాత్రం చాలా చక్కని అనుకూల వాతావరణం ఏర్పడిపోతుంది రవికి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే చాలా అవసరం ఇంటాబయట మీరు కొత్త ఏల్నాటి శని ప్రభావం ఉంది మీ శరీర ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం వుంది తలనొప్పి కళ్లు పేగులు లేదా వెన్నునొప్పి ఇత్యాదులు వచ్చే అవకాశం కూడా ఉంది వైద్యులను సంప్రదించి తగిన చికిత్సని పొందడం చాలా అవసరం మూడు నాలుగు పాదాల వారికి రవి ఆధిపత్యం వుంది గనక వీరికి అనారోగ్య సూచనలున్నాయి శ్రవణం వారికి కుజాది పిచ్చి ఉంది కనుక వీరు కూడా ఆరోగ్య విషయంలోని జా జాగ్రత్త వహించండి ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి అనుకూలత ఎక్కువగా ఉంది శుక్లాది వచ్చి వల్ల అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి

పరిహారం : విలే వీలైతే నృసింహ కరావలంబ స్తోత్ర పఠనం చేయండి సామాన్యంగా రుద్రపారాయణ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది శనిత్రయోదశి నాడు తైలాభిషేకం చేయించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు

కుంభ రాశి :

ఈ రాశివారికి రాశ్యాధిపతి శని స్వరాశిలో ఉండటం అనుకూలమైనా వ్యయమందు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వీరు మొదట్నించి గంభీరంగా ఉండే తత్వం కలవారు కాబట్టి ప్రతిపనిని తనదైన శైలిలో నెరవేర్చుకుంటారు. గురుని ద్వితీయ ఆధిపత్యం వచ్చిన గురుని ప్రభావము తృతీయ అధిపత్యం కుజుని ప్రభావము వీరికి వ్యతిరేకంగా ఉన్నది. చంద్రబలం కూడా వీరికి కొంతవరకు అనుకూలిస్తుంది. కాలసర్ప దోషంలో వీరు నలిగే సమయం ఉంది. కనుక జాగ్రత్త వహించండి. ప్రతికూల వాతావరణఁస ఉంది కాబట్టి విరోధాలు తెచ్చుకోకుండా ఉండండి. దాన్ని అధిగమించడానికి మీరు వాక్సుద్ధి పెంచుకోవడం చాలా అవసరం. సూర్యోదయాత్ పూర్వమే మీరు ధ్యానం చేసినట్లయితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది మీలో ఉన్న ధైర్యం ఇంకొంచెం పెరిగేందుకు పెంచుకునేందుకు దోహదపడే ఒకరిద్దరు మిత్రుల్ని గాని గురువులు గానీ సంప్రదించండి. దానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉంది. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి ఈ వారం పరమ మిత్రతార అయింది కాబట్టి శుభ ఫలితాల్ని పొందగలుగుతారు. శతభిషా నక్షత్రం వారికి నైధన తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు పొందుతున్నారు. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి సాధన తారైంది సానుకూలత ఎక్కువగా ఉంది.

పరిహారం : ఈ రాశివారు శనిత్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించండి. రవి అష్టకం సూర్యాష్టకం పఠించండి.

మీన రాశి :

ఈ రాశివారికి ప్రత్యేకంగా ద్వితీయ అధిపతి కుజుడు మారక స్థానాధిపతి ఐనా గురుని ప్రభావం చేత అనుకూలించక తప్పదు. లాభ స్థానంలో ఉన్న శని వ్యయాధిపతి కూడా. చేతిలో సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. సంఘంలో వ్యతిరేకతలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా వ్యతిరేకత ఇరుగుపొరుగులతో కూడా విభేదం ఉంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు సాగిపోవడం చాలా అవసరం. మీకు మంచి రోజులు రాబోతున్నాయని దృష్టిలో పెట్టుకోండి మీరు ప్రగతిని సాధించుకుని ముందుకు వెళ్లిపోతారు అర్ధాష్టమ రాహు మీకు ఆరోగ్యాన్ని మనోధైర్యాన్ని తగ్గించి చిత్త చాంచల్యాన్ని కలిగిస్తాడు. కాబట్టి రాహు తాలుకు ప్రభావం మీపైన పనిచేస్తోంది. మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం చాలా అవసరం. అయితే గురు కుజులు మీకు లాభం లోకి రానున్నారు భవిష్యత్తు ప్రణాళికలతో ఈ వారం మీరు నెమ్మదిగా గడపండి. మీకు ఒక పద్ధతిగా ఫలితాలు రానున్నాయి ఇప్పుడు వేసిన విత్తన ఫలితాలు కొద్ది రోజులు తరువాత వచ్చినట్లుగా మీరు ఈ వారంలో అలాంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు భవిష్యత్తు పనికొస్తాయి. ఇది ఒక శుభ సూచనగా తీసుకోండి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి సాధన తారైంది చాలా అనుకూలంగా ఉంది. ఉత్తరాభాద్ర వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి దైవ బలం పెంచుకుంటే శుభ ఫలితాలు వొస్తాయి. రేవతి వారికి క్షేమ తారైంది కాబట్టి మంచి ఆరోగ్యాన్ని పొందడంతో పాటు మంచి ఆలోచనలు మీకు వస్తాయి మంచి జరుగుతుంది.

పరిహారం : ఈ రాశివారు రుద్ర సూక్త పారాయణ చేయండి లేదా రావణ బ్రహ్మ విరచిత శివతాండవ స్తోత్ర పారాయణ చేయండి .

Next Story