రాశిఫలాలు ఫిబ్ర‌వ‌రి 9 నుంచి 15 వ‌ర‌కు

By Newsmeter.Network  Published on  9 Feb 2020 5:56 AM GMT
రాశిఫలాలు ఫిబ్ర‌వ‌రి 9 నుంచి 15 వ‌ర‌కు

మేష రాశి :

ఈ రాశివారికి రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని అసౌకర్యాలు ఏర్పడుతున్నాయి. రవి సహకరించాల్సింది అయినా శత్రువైన శని ఇంట్లో శనితో కలిసి ఉండటం కూడా కలత కి కారణమవుతుంది. అయితే గురుని దృష్టి మాత్రం పంచమ దృష్టి అవడం వల్ల వీరికి మార్గం సుగమం అయిపోతుంది. పనులు నెరవేరడానికి కొంచెం దైవశక్తి తోడుగా తీసుకుంటే చాలా సులువుగా మీ పనులన్నీ నెరవేరతాయి. కానీ భాగ్య రాజ్యాధిపతి ఐన శని ప్రభావం చేత ఉద్యోగము వ్యాపార రంగాలలో ఉన్న వారికి కలిసిరాక ఇబ్బందులు పడే అవకాశం కంపిస్తోంది. వాహనాదులు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం. అశ్విని నక్షత్ర జాతకులకు పరమమిత్రతార తో వారం ప్రారంభం గనుక శుభఫలితాలున్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు మిత్ర తారతో వారం ప్రారంభం గనుక శుభ ఫలితాలను పొంద గలుగుతున్నారు. కృత్తికా నక్షత్రం ఒకటి పాదం వారికి నైధన తారైంది కాబట్టి ఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం : ఈ వారంలో మాఘ ఆదివారం సూర్య నమస్కారాలు చేయండి మంచి ఫలితాలని పొందగలుగుతారు పదమూడో తేదీ ఉపవాసం ఉండి సూర్యుని ప్రార్థించిన సత్ఫలితాలు ఉంటాయి.

వృషభ రాశి :

ఈ రాశివారికి శని యోగకారకుడు సత్ఫలితాలని ఇవ్వనున్నాడు. వీరికి రాశి అధిపతి అయిన శుక్రుడు తాత్కాలిక మిత్ర స్థానమైన లాభంలో ఉంటూ మంచి ఫలితాలని ఇస్తున్నాడు. వివాహం కానివారికి వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో ముందుకు సాగిపోతారు. పదవుల్లో గూడ మంచి స్థానాన్ని పొందే అవకాశం ఉంది. బుద్ధి కుశలతతో కార్యాల్ని నెరవేర్చుకుంటారు. ఆహార నియమాల్ని పాటించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మీ పిల్లల చదువు విషయాల్లో శ్రద్ధాసక్తులను కనబరుస్తారు. అష్టమంలో గురుడు ఉన్న కారణంగా మీ తెలివితేటలు ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది. అష్టమ కుజుని కారణంగా కూడా మీకు చిన్న చిన్న అనారోగ్యాలు సూచిస్తున్నాయి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధనతార ఐంది ఫలితాలు తక్కువగా ఉన్నాయి. రోహిణీ నక్షత్ర జాతకులకు సాధన తారైంది కాబట్టి అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి ప్రత్యక్తార కాబట్టి ఫలితాలు మధ్యమంగా ఉంటాయి.

పరిహారం: ఈ రాశివారు గురు దత్త దీక్ష వహించండి. గురునకు జప తప హోమాదుల కుజునకు మంగళవారం నియమాన్ని పాటించండి మంచి ఫలితాలని పొందగలుగుతారు.

మిథున రాశి :

ఈ రాశి వారికి రాశ్యాధిపతి పదవ ఇంట్లో ఉండటం యోగకారకం దానివల్ల మంచి ఫలితాలనే పొందాలి. ఈ రాశిలో రాహు ఉండటం చేత కొద్దిపాటి అనారోగ్య సూచన గుండెపోటు లాంటిది కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్త వహించండి. సోదరులతో సఖ్యత తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. వారితో విరోధం ఉంది. మాతృప్రేమను పొందగలుగుతారు. మీ వాక్కుని అధీనంలో ఉంచుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అయితే సప్తమ అష్టమ నవమ స్థానాల్లో ఆరు గ్రహాలు ఉండటం చేత మీరు ఇబ్బందిపడే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త వహించడం చాలా అవసరంగా కనిపిస్తోంది. భూ సంబంధము కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో ఈ వారం మీకు పెద్దగా ఫలితాలు కనిపించకపోవచ్చు. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఆరుద్ర వారికి క్షేమ తారైంది కాబట్టి పూర్ణ ఫలితాలు పొందగలుగుతారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి విపత్తార అయింది కాబట్టి ఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం : వీరు బుధవారం నియమాన్ని పాటించండి శనగలు కూడా దానం చేయించండి ముఖ్యంగా పెసలు బుధవారం నాడు సూర్యోదయం అయిన వెంటనే పెసలు బెల్లం కలిపి అవుకు తినిపిస్తే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు.

కర్కాటక రాశి :

ఈ రాశివారు ఈవారంలో కొద్దిపాటి సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. అయితే మనోధైర్యంతో ముందుకు వెళ్లే అవకాశం వుంది కాబట్టి కొన్ని పనులను సాధించుకో గలుగుతారు చంద్రుడు స్వక్షేత్రంలో ఉండటం ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నది. రవి గురులు శత్రువులై ఆరు ఏడు స్థానాల్లో ఉండడం వల్ల చిన్న చిన్న ఆటంకాల్ని ఎదుర్కోక తప్పదు. మొత్తం మీద గతంలో కంటే కొద్ది పనులు సానుకూల పడే అవకాశంతో ముందుకి వెడతారు. శనివారం నాడు మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ వారంలో ఆదివారం నాడు వీలైతే సూర్యనమస్కారాలు మీకు తెలిసినవి యోగ సాధన ద్వారా మీరనుకున్న సాధించుకునే అవకాశాలు ఉంటాయి. పునర్వసు నాలుగో పాదం వారికి విపత్తార అయింది కాబట్టి ఫలితాలు తక్కువగా ఉన్నాయి. పుష్యమి వారికి సంపత్ తారైంది కాబట్టి ఈ వారంలో మంచి ఫలితాలు పొందుతారు. ఆశ్రేష నక్షత్ర జాతకులకు జన్మ తారైంది కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

పరిహారం : ఈ రాశివారు సూర్యనమస్కారాలు చేయడం వీలైతే పేదవానికి బ్రాహ్మణునకు భోజనం పెట్టండి లేదా బియ్యం దానం చేయండి, పాలతో అభిషేకం చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు

సింహ రాశి:

ఈ రాశివారికి ఈ వారంలో రాశ్యాధిపతి రవి షష్ఠంలో ఉండడం అదీ శత్రు క్షేత్రంలో ఉండటం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అకాల భోజనం, అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం చాలా అవసరం. అష్టమంలో ఉన్న శుక్రుడు మీకు కుటుంబ కలహాన్ని సూచిస్తున్నాడు అంచేత మీరు కుటుంబ వ్యవహారం విషయంలో కొంచెం ఆచి తూచి అడుగు వేయండి. ఇతర వ్యాపకాన్ని తగ్గించుకుని కుటుంబంతో ఉంటే మంచిది. పిల్లల ఆరోగ్య విషయాల్లో చదువు సంస్కారం విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో మీరు అతి జాగ్రత్తపరులై ఇంటా బయట గెలవాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మీకు సానుకూలంగా స్పందించే వ్యక్తులు గానీ సలహా ఇచ్చే వ్యక్తులు గానీ తాత్కాలికంగా దూరం అవుతారు. మఖ నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తారైంది బావుంది. పుబ్బ వారికి మిత్ర తార కావున శుభఫలితాలున్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి నైధన తారైంది కాబట్టి వ్యతిరేక ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు.

పరిహారం : మీరు ఎక్కువగా ఆదివారం నియమాలు పాటించండి మహా మాఘి అంటారు ఈ ఆదివారాన్ని. సూర్య నమస్కారాలు చేయండి లేదా పదమూడో తేదీ గురువారం కుంభ సంక్రమణం ఆ రోజన్నా సూర్యనమస్కారాలు చేయండి కొంతవరకు మీ అనుకున్న పనులు సాధించే అవకాశం ఉంటుంది.

కన్యా రాశి :

ఈ రాశివారికి బుధ శుక్ర శనులు శుభులై ఉన్నారు కాబట్టి మీరేమైనా అనుకుంటే సాధించే అవకా అయినా మీకు కుటుంబ వ్యవహారంలో సానుకూల వార్తలు వింటారు. పిల్లల ద్వారా ఆనందాన్ని అనుభూతిని పొందగలుగుతారు. రాశ్యాధిపతి బుధుడు పంచమ కేంద్రంలో ఉండటం తాత్కాలికి శత్రు వయ్యారు. కాబట్టి తల్లి ఆరోగ్య విషయంలో కూడా దృష్టి పెట్టండి. శుక్రుడు సప్తమంలో ఉన్నాడు అయినా ఒక ఆనందాన్ని కలిగింప చేస్తాడు. దూర ప్రయాణాలు చేస్తే జాగ్రత్త వహించండి. అందరినీ తొందరగా నమ్మకండి మీ అంతః చైతన్యాన్ని కలిగి మీరు ఉండండి. ఆధిపత్య పాపులు మీకు ఎక్కువగా ఉన్నారు కాబట్టి భగవంతుని నమ్మడమే మీరు చేయవలసిన పని అవుతుంది. ఇక ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తారైంది శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు ఈ వారం సాధన తయారైంది కాబట్టి మీరు కార్య సాధన ఐంది. విజయాన్ని సాధించే అవకాశం ఉంది. చిత్త ఒకటి రెండు పాదాల వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం : బుధవారం నియమాన్ని పాటించండి శుక్రుడుకి తెల్లని వస్త్రం దానం చేయండి. ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు బెల్లం తిని బయలుదేరండి మంచి ఫలితాలొస్తాయి.

తులా రాశి :

ఈ రాశివారికి రాజ్యాధిపతి అయిన శుక్రుడు కష్టాల్లో ఉండటం కొంచం ఇబ్బంది కలిగిస్తోంది. వీరికి అర్థాష్టమ శని ఉన్న రాశిని బట్టి వీరికి శని యోగం చేశాడు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కుటుంబ వ్యవహారం విషయాల్లోనూ చక్కని ప్రగతిని సాధించుకో గలుగుతారు. అర్ధాష్టమ శని తాలుగా ప్రభావం మాత్రం కొద్దిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహ వహించండి. తల్లిగారి ఆరోగ్య విషయంలోని తండ్రిగారు ఆరోగ్య విషయంలో కూడా మీరు ఆలోచించాల్సి వస్తుంది. మీకు అన్నదమ్ములు అక్క చెల్లి ఉంటే వాళ్లు ఈ వారంలో మిత్రులను కూడా కలుసుకుంటారు. మీకు ఈ వారంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. చిత్త మూడ్నాలుగు పాదాల వారికి ఫలితాలు తక్కువగా ఉన్నాయి. స్వాతి వారికి క్షేమ తయారైంది కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగానే, విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి విపత్తార కాబట్టి ఫలితాలు తక్కువే.

పరిహారం : ఈ రాశి జాతకులు ఎక్కువగా శుక్రవారం నియమాలు పాటించండి. అమ్మవారికి పూజలు చేయండి. వీలైతే ఖడ్గమాల పారాయణ చేయండి శుభ ఫలితాలని ఇస్తుంది.

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి ద్వితీయ ముందున్న గురు కుజులు కేతువు మంచి ఆలోచనని దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేస్తారు. ఈవారం వీరికి కొంతవరకు బాగుంటుందని చెప్పచ్చు. కుటుంబ వ్యవహారాల విషయంలో, ఆర్థికంగాకూడా బాగుంటుంది. అష్టమ రాహు తాలుకా ఇబ్బంది మాత్రం ఉంది కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఇక భాగ్యంలో ఉన్నటువంటి చంద్రుని వల్ల మీకీ వారంలో మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పూర్వం కంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కల్యాణ పరమైనటువంటి ప్రయత్నాలు ఇంట్లో కలిసొస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి మీ ప్రయత్నాల్లో లోపం లేకుండా చూసుకోండి. విశాఖ నాలుగో పాదం వారికి విపత్తార కావున ఫలితం తక్కువ. అనురాధ వారికి ఆర్థిక లాభం కనిపిస్తోంది. జ్యేష్ఠ జాతకులకు జన్మ తారైంది కాబట్టి అనారోగ్య సూచన ఉంది జాగ్రత్త వహించండి.

పరిహారం : మీరు గురు దీక్ష వహించండి గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏం చదివినా పనికొస్తాయి. శివ స్తోత్రాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ధనువు రాశి :

ఈ రాశి వారికి లగ్నాధిపతి లగ్నంలో ఉండడం శుభపరిణామం అయినా తాత్కాలిక శత్రువైన గురుడు దానికి తోడు వ్యయాధిపతి అయిన కుజుడు కలిసి ఉండటం వల్ల మీ ఆలోచనలు విభిన్నంగా పరిణమిస్తాయి. దైవికంగా మీ కార్యాలన్నీ నెరవేరే అవకాశం మాత్రమే ఉంటుంది. పైగా ఈవారంలో చిన్న అనారోగ్య సూచన ఉంది. మీరు అనుకున్న కార్యాల్లో కొన్నిటిని నెరవేర్చుకోగలుగుతారు. మీకు రవి ద్వితీయ ముందుండటం మంచి ఫలితాల్ని ఇవ్వబోతోంది. మీ ఆలోచనలకు ఓ చక్కని రూపం వస్తుంది. తద్వారా మీరు కొంత మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్వితీయ శని ప్రభావం మీపై ఎక్కువగా ఉంది కాబట్టి ధనం వ్యయం తప్పదు. ఎంత ఆలోచించి చేసిన కొంత ధనాన్ని పోగొట్టు కుంటారని చెప్పచ్చు. విలువైన వస్తువుల్ని కూడా పోగొట్టుకున్న అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. మూల వారికి పరమమిత్రతార తో వారం ప్రారంభం గనుక మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మిత్రతారతో వార ప్రారంభం చాలా శుభఫలితాలు పొందగలుగుతారు. ఉత్తరాషాడ ఒకటో పాదం వారికి నైదినతారైంది కాబట్టి ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

పరిహారం : ఈ వారంలో శనికి జపం చేయించండి లేదా నల్లని వస్త్రం గాని నల్ల నువ్వులు గానీ దానం చేయించండి. అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది.

మకర రాశి :

ఈ రాశివారికి శని శుక్ర బుధులు ఆధిపత్య శుభులై ఉన్నారు. శని స్వక్షేత్రంలో ఉన్నాడు కావున ఏలినాటి శని ప్రభావం ఉన్నా ఈ వారంలో మంచి ఫలితాలని వీరు పొందగలుగుతున్నారు. ఆధిపత్య శుభుడు అయిన శుక్రుడు కూడా మీకు మంచి ఫలితాల్ని ఇస్తాడు. మీరు అనుకున్నవి కొద్దికొద్దిగా సాధించుకునే అవకాశం ఉంది. మంచి మిత్రులు సమ కూరుతారు. మీరు చేపట్టిన పనులలో మీకు సహాయం చేయడానికి కొందరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితిగతులు కూడా ఈ వారం కొంచెం మెరుగుపడతాయి. గురుని తాలూకు ప్రభావం వల్ల ఆలోచనా శక్తి కొద్దిగా తగ్గుతుంది. మంచి మిత్రులు యొక్క సహకారం, భార్య సలహాలు సంప్రదింపుల వల్ల మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కుటుంబపరంగా చూస్తే పిల్లల ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి, చదువుల విషయంలో కూడా దృష్టి పెట్టండి.

పరిహారం : మీరు చంద్రునికి జపాదులు చేయించండి. సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయించండి. రెండింటి వల్ల మీలో ఎక్కువ కార్య సాధన చేసుకునే అవకాశాలు ఉంటాయి.

కుంభ రాశి :

ఈ రాశివారు సాధారణ ఫలితాలు ఉన్నాయి. అయితే మీకు ద్వితీయ మందున్న శుక్రుడు ఇంకాస్త శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆర్థికంగా మీకు బాగుంటుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా బానే ఉంటుంది. అయితే వ్యయమందున్న శని ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అవసరానికి ధనం అందకపోవటం, ఉన్న ధనం కూడా చేతిలో ఉండకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినవాళ్లతో కలిసి మీరు చేసిన పనులు మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎన్నుకో దగిన వ్యవస్థను మీరే చూసుకోవాల్సి ఉంటుంది. గురుని వల్ల మీ ఆలోచనా విధానంలో మార్పొస్తుంది. మంచి జరుగుతుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ఫలితాలు తక్కువగా ఉంటాయి. శతభిషా నక్షత్ర జాతకులకు క్షేమ తారతో వార ప్రారంభం కాబట్టి ఫలితాలు మంచిగా కనిపిస్తున్నాయి. పూర్వాభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు వారికి విపత్తార కాబట్టి ఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం: ఈ వారంలో మీరు శనికి జపం చేయించి నల్లని వస్త్రదానం నల్ల నువ్వులు దానం చేయడం మర్చిపోకండి. వీలైతే ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టి శివుడి దర్శనం చేయండి మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మీన రాశి :

ఈ రాశివారికి ప్రతికూలమైనటువంటి వారంగా కనిపిస్తున్నది. ఏదైనా ఆచితూచి వ్యవహరిస్తే మీకు శుభపరిణామాలు కనిపిస్తున్నాయి. ఏవైనా పెండింగ్ పనులు ఉన్నట్లయితే ఈవారంలో కలిసి రాకపోవచ్చు. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ఎంత మంచి చేసినా మీ మంచిని గుర్తించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. బుద్ధికుశలత తగ్గుతుందని చెప్పచ్చు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి విపత్ తార అయింది కాబట్టి ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర వారికి ఉత్తమ ఫలితాన్ని పొందగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం : ఈవారంలో మీరు వీలైనంత వరకు బుధునకు జపాలు చేయించడం లేదా ఆకుపచ్చ వస్త్ర దానము, పెసలు దానం చేయడం ఇంకా వీలైతే బుధవారాలు బెల్లము పెసలు నానవేసిన ఆవుకు తినిపించండి శుభ ఫలితాలు పొందగలుగుతారు.

Next Story