రాశిఫలాలు ఫిబ్ర‌వ‌రి 23 నుంచి 29 వ‌ర‌కు

By Newsmeter.Network  Published on  23 Feb 2020 8:03 AM GMT
రాశిఫలాలు ఫిబ్ర‌వ‌రి 23 నుంచి 29 వ‌ర‌కు

మేషరాశి :

ఈ రాశి వారికి రవి కుజ గురులు యోగ ప్రదులు. వీరికి ఈ వారంలో దైవ దర్శనాలు చేసుకునే అవకాశం వస్తుంది. సేవకుల వల్ల ఇబ్బందులు తప్పవు. వాదోపవాదాల వల్ల ప్రయోజనం ఉండదు అధిక ధనవ్యయం కూడా ఉంది. ప్రఖ్యాతమైన వ్యక్తులు కలయిక విద్యాసంబంధ గోష్ఠులు నెరపుతారు. గృహంలో కొంత సంతోషకరమైన వాతావరణాన్ని కల్పించు కుంటారు. సంఘంలో గౌరవాన్ని పొందే అవకాశముంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిపాటి అభివృద్ధిని సాధిస్తారు పనులలో ఆటంకాలు కనిపిస్తాయి. మానసిక ఆందోళనను మనో దుఃఖాన్ని పొందుతారు. అశ్విని నక్షత్ర జాతకులకు కేతు అధిపతి అయ్యాడు కాబట్టి వీరికి ప్రభుత్వ అధికారులతో ఇబ్బంది వుంది. భరణి నక్షత్ర జాతకులకు గురుడు అధిపతి. క్షేమ తారైంది కాబట్టి సంతోషకరమైన వాతావరణం. కృత్తికా మొదటి పాదం వారికి రాహు అధిపతి అయ్యాడు దీని ఫలితంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. ప్రతి విషయంలోని భయపడే ఒక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : వీరు ముఖ్యంగా రాహు కేతువుల అర్చన చేయడం చాలా అవసరం కాలసర్ప దోష నివారణ వల్ల బావుంటుంది. రాహు కేతు మంత్రాన్ని తప్పకుండా జపించండి.

వృషభరాశి :

ఈ రాశివారికి శని బుధ శుక్రులు యోగ కారకులై యున్నారు. అయితే శరీరంలో ఉష్ణ భాషలు నేత్ర రోగము కనిపిస్తాయి. అకారణ కోపం కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. పనులలో ఆటంకాలు అధికారులతో విరోధము ఇంటా బయట కూడా మీకు చిన్న వ్యతిరేకత కనిపిస్తోంది. జాగ్రత్త వహించండి. చెడ్డ కలలతో మీరు ఆలోచనలలోపడి ఇబ్బందులు ఎదుర్కొంటారు. విషజంతువులు తాలూకా భయం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. దుర్మార్గులతో కలవకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీకు కొత్త వస్తువులు సంప్రాప్తం జరుగుతుంది. అనుకోని విధంగా జ్యోతిష శాస్త్ర వేత్తలను కలుస్తారు. బంధుమిత్రులను కలుసు కుంటారు. వ్యాపార విషయాలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి నిస్సత్తువ ఆవహిస్తుంది. రోహిణి నక్షత్రం వారికి సంపత్ తారైంది కాబట్టి ఫలితాలు బాగున్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి అధిక ధనవ్యయం కనిపిస్తోంది.

పరిహారం : నానవేసిన పెసలు బుధవారం నాడు ఉదయం బెల్లంతో ఆవుకు తినిపించండి మంచి ఫలితాలు పొందుతారు. విష్ణు సహస్రనామ పారాయణ మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది

మిధున రాశి :

ఈ రాశివారికి బుధ శుక్రులు యోగ కారకులై ఉన్నారు. వీరు అధిక కోపం వల్ల కొన్ని ఇబ్బందుల్ని కోరి తెచ్చుకుంటారు. ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అదే కారణమవుతుంటుంది. రాజకీయ నాయకులు పరిచయాలు జరుగుతాయి అవి మిమల్ని ఇబ్బంది పెడుతాయి. ఏదో సమస్యతో మీరు రక్షక భటుల్ని కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సి రావచ్చు. శారీరక సుఖాల కోసం వీరు ధనాన్ని అనవసర ఖర్చు చేయనున్నారు. కొత్త బట్టలు పిండి వంటలతో కూడిన షడ్రసోపేతమైన భోజనం చేస్తారు . కొత్త స్త్రీలతో పరిచయాల్లో జాగ్రత్త వహించండి. కొన్ని పనులను మీరు పూర్తిచేయగలుగుతారు. సౌఖ్యాన్ని పొందగలుగుతారు చికాకుల వల్ల మిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి జన్మతార ఐంది కాబట్టి భయాందోళనలున్నాయి. ఆరుద్ర వారికి ఈ వారంలో దూర ప్రాంతం నుండి సందేశాలు వినే అవకాశముంది. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ధనాదాయం బాగుంటుంది.

పరిహారం : ఈ రాశివారు కుజుడి గూర్చి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినా ఆంజనేయస్వామి గూర్చి హనుమాన్ చాలీసా చదువుకున్న మీరు మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి :

ఈ రాశివారికి చంద్ర కుజ రవి గురులు శుభులైయన్నారు. ఈ వారం చాలా బాగుందని చెప్పాలి. అన్ని నక్షత్రాలకి కూడా మంచి ఫలితాలు లభించబోతున్నాయి జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేస్తే మీ ఫలితాలు మీమాట తీరులోనే ఉన్నాయని చెప్పవచ్చు. సరదాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి వినోదంతో కొన్ని కార్యక్రమాల్ని తిలకిస్తారు. కొత్త వ్యక్తులతో మాట్లాడడం దానివల్ల ధనాదాయం బాగుంది. వారం మధ్యలో మీ పనులు వాయిదా పడే అవకాశముంది అకాల భోజనం చేస్తారు. మీ క్రింది స్థాయి వ్యక్తుల వల్ల మీ ఆలోచనలు మారనివ్వకుండా చూడండి. కుటుంబ సౌఖ్యం ఉంది. మాతృసౌఖ్యం ఉంది. ఇంట్లో సుఖ సంతోషాలు పొందుతారు. పెద్దవాళ్లతో పరిచయాలు మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకుని వెళ్లే అవకాశం కూడా ఉంది. పునర్వసు నాలుగో పాదం వారికి మిత్రతారైంది చాలా బాగుంది. పుష్యమి వారికి నైధన తారైంది కాబట్టి వారికి బద్ధకము ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి. ఆశ్రేష వారికి సాధనం కార్యసాధనం అన్నట్టుగా మంచి ఫలితాలు చవి చూడబోతున్నారు. మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.ఇరవై అయిదో తేదీ మంగళవారం నాడు సాయంత్రం అయిదు గంటలకి పడమటి దిక్కున వుండే ప్రథమ చంద్రుని దర్శనం చేయండి.

పరిహారం : ఈ రాశివారు చంద్రుని గూర్చి ఎక్కువగా ప్రార్థించండి పెరుగుతో శివుణ్ణి అభిషేకిస్తే చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.

సింహరాశి :

ఈ రాశివారికి రవి కుజ గురు చంద్రులు శుభులై ఉన్నారు. మంచి ఫలితాలు పొందాలి కానీ ఈ వారంలో వీరు ఎక్కువగా ప్రతికూల ఫలితాన్ని చూసే అవకాశమే కనిపిస్తోంది. అయితే ఆత్మస్థైర్యం మనోధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అష్టమ గురుని ప్రభావం వల్ల మీ ఆలోచనలు మీ అధీనంలో లేకుండా పోతాయి . సేవకులతో వాగ్వాదం మీకు ప్రయోజనం లేదని తెలుసు. వారి దుర్దశ మిమ్మల్ని మానసిక న్యూనత వైపు తీసుకెళ్తుంది . ఆందోళన అవమానము తప్పదు. ప్రభుత్వ రాజకీయ రంగ ఇబ్బందులు ఒత్తిడులు తప్పదు. అధిక ధనం వ్యయం కూడా అవుతుంది. మీ కంటితో మీ రక్తాన్ని మీరు చూసే అవకాశం వుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. తలనొప్పి శారీరక బాధలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. పనులలో ఆటంకాలున్నాయి. నీచ జనుల సహవాసం ఉంది. మఖా నక్షత్రం వారికి ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. పుబ్బ వారు సంతోషకరమైన వార్తలు వింటారు. ఉత్తర ఒకటో పాదం వారికి భూత ప్రేత పిశాచ భయాలు కలుగుతాయి.

పరిహారం : మీరు గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రం చేయండి లేదా గురుచరిత్ర పారాయణ మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశముంది .

​కన్యా రాశి:

ఈ రాశివారికి బుధ శుక్ర శనులు శుభులై యున్నారు. వీటి ఫలితంగా ఈ వారంలో మరికొంచెం శుభాన్ని పొందుతున్నారు. ఇంటా బయటా మీకు తలనొప్పులు తప్పవు. అయినా మీకు ప్రయాణ లాభము అనుకున్న పనులు పూర్తవడం వల్ల కొంత ఉత్సాహం బాగా పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. కొత్త వ్యాపార విషయం చర్చించుకునే అవకాశం కూడా లేకపోలేదు. మీలో ఉన్న ఆందోళన మిమ్మల్ని ప్రతి పనిలోనూ వెనక్కి లాగేస్తుంది. మనో దుఃఖాన్ని మాత్రం పొందుతారు. దుష్టులతో కలవకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీలో మీకు నచ్చేది ఆత్మ స్థైర్యం. కాబట్టి దాన్ని ముందు పెట్టుకుని వెళితే మీ పనులన్నీ కూడా సుగమం అవుతాయి. కుజ గురుల కలయిక మీకు మూడు అడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్టుగా అవుతుంది. అయినా మీరు నిరుత్సాహ పడకుండా ఉంటే మీ పనులు మీరు చాలా చక్కగా నిర్వర్తించు కోగలరు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి భయాందోళనలు ఉన్నాయి. హస్త వారికి శాస్త్రవేత్తల పరిచయాలు పెరుగుతాయి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి అనుకోని సంఘటనలతో ఇబ్బంది కలుగుతుంది.

పరిహారం : మీరు ఎక్కువగా రవికి సంబంధించి ఆదిత్య హృదయం కాని సూర్యనమస్కారాలు కానీ యోగా కానీ చేయండి.

తులా రాశి :

ఈ రాశివారికి శని బుధ శుక్రులు యోగ కారకులై వున్నారు. ఈ రాశివారు చాలా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనులలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా శుక్ర ప్రభావం చేత చాలా విజయవంతం అవుతారు. కోపం తగ్గించుకోండి దానివల్ల మంచి ఫలితాల్ని పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. చక్కగా మాట్లాడటం వల్ల మీకు రాజకీయ నాయకులతో పరిచయం జరుగుతుంది. సోదర విరోధాలు ఉన్నాయి. వాటిని కొంచెం అధిగమించడానికి ప్రయత్నం చేయండి. షడ్రసోపేతమైన భోజన అవకాశం కూడా మీకు ఉంది. సుగంధ పరిమళ వస్తు వస్త్రలాభం పొందబోతున్నారు. కోరి కొన్ని తలనొప్పులను తెచ్చుకుంటారు. ఆర్ధిక లాభం కూడా ఉంది. మిత్రులతో విరోధాలు పెంచే మాట కటుత్వం తగ్గించండి. ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచన చేసి మాట్లాడితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతీ నక్షత్రం వారికి దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి కొత్త వ్యక్తుల పరిచయాలు అవుతాయి .

పరిహారం : మీరు హనుమద్ద్వాదశ నామాలు ప్రతిరోజూ పఠించండం అలవాటు చేసుకోండి. చాలా ఉపయుక్తంగా మారుతోంది. ప్రతిరోజూ సూర్యోదయం సరికి లేచి సూర్యదర్శనం చేయండి. మంచి ఫలితాలను పొందుతారు

వృశ్చికరాశి :

ఈ రాశి వారికి గురు కుజ చంద్ర రవి ఈ నలుగురు యోగ కారకులై వున్నారు వీటి ఫలితంగా ఈ వారంలో ఇంకొంచెం శుభ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. దూరంగా ఉన్నవాళ్లకి మాతృ సౌఖ్యం కుటుంబ సౌఖ్యం ఉన్నాయి . ఇంటికొచ్చి కుటుంబంతో సంతోషంగా గడిపి కుటుంబం కోసం మిత్రుల కోసం విలాసవంతంగా ఖర్చులు చేస్తారు. కొత్త కొత్త వస్తువులు సేకరిస్తారు. బహుమతులుగా మీరు నచ్చిన మెచ్చిన స్త్రీలకు ఇచ్చుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. విందు వినోదాలతో ఈ వారం గడుస్తుంది. ఆకస్మికంగా ధనాదాయం కూడా ఉంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు అయితే ఒక్కొక్కసారి మీ ప్రమేయం లేకుండా కాలం వ్యర్ధంగా గడిచిపోతుంది. నీచ కార్యాలు చేయాలనే ఆలోచన వస్తుంది. బద్దకం పెరిగి అవకాశం ఉంది. సేవకులతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కోర్టు వ్యవహారాలు ఉంటే మాత్రం అపజయం పొందుతారు. విశాఖ నాలుగో పాదం వారికి కొత్త వ్యక్తుల పరిచయాలున్నాయి అనూరాధ నక్షత్ర జాతకులక మాత్రం ఆర్థిక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు మాత్రం అన్నింటా విజయం పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయి.

పరిహారం : గురువారం నాడు పుత్ర గణపతి వ్రతమని ఉంది. కనీసం గణపతిని సందర్శించండి చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇరవై అయిదో తేదీ మంగళవారం సాయంత్రం ఐదున్నరకి ప్రథమ చంద్ర దర్శనం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది .

ధనూ రాశి :

ఈ రాశివారికి రవి గురు చంద్ర కుజులు శుభులై ఉన్నారు. దైవ సంబంధ కార్యాలు చేస్తారు. నూతన దేవాలయ సందర్శనం జరుగుతుంది. వేదాంత సంబంధ విషయాలు చర్చిస్తారు. సేవకుల వల్ల ఇబ్బంది ఉంది. వారితో వీలైనంత దూరంగా ఉండండి .ఉదర సంబంధ వ్యాధి ఉంది భయాందోళనలు మీద అది మరింత ఎక్కువవుతుంది. ముఖాల్లో కాంతి తగ్గింది. మానసిక ఆందోళన మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు గురు ప్రభావం చేత చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పెద్దవారిని కలుసుకుని మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మీ ప్రయత్నంతో గృహంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. విద్యావేత్తలతో మీ పరిచయాలు ఈ వారంలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సంఘంల్లో మంచి పేరును కూడా పొందగలుగుతారు. ద్వితీయ శని తాలుగా ప్రభావం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడబోతున్నారు అది గుర్తించండి. . మూలా నక్షత్ర జాతకులకు అవమాన అవకాశం ఉంది. పూర్వాషాఢ జాతకులకు సత్ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మాత్రము దుష్టశక్తుల ప్రభావము పని చేయబోతున్నది.

పరిహారం : మీరు రాహు కేతువులకు పూజలు చేయించండి లేదా శివునకు అభిషేకం ప్రత్యేకించి చేయించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మకర రాశి :

ఈ రాశివారికి శని శుక్ర బుధులు ఆధిపత్యం ఉంటేనే శుభులౌతారు. వీరికి వారం మధ్యలో ప్రయాణ లాభం కనిపిస్తోంది. శాస్త్ర చర్చ జరుగి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ధనాదాయం కొద్దిగా పెరుగుతుంది. గృహంలో అందరూ కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. నూతన వ్యాపార విషయాలు చూసుకుంటారు. ఇతరుల వల్ల ఇబ్బంది తప్పదు. అనుకోని సంఘటనతో చిక్కుల్లో పడతారు. ఏలినాటి శని ప్రభావం మీ శరీర ఆరోగ్యం కుంటుపడే అవకాశం కనిపిస్తోంది. మీకంటే ముందు మీ భయాందోళనలే మిమ్మల్ని నిశ్శక్తులుగా చేసే అవకాశం ఉంది.బదీర్ఘ వ్యాధులు ఉన్నట్లయితే దాన్ని మీరు తొందరగా డాక్టర్‌ని కలిసే ప్రయత్నం చేయండి. అనవసర వ్యయము లేకపోలేదు. ఎవరి మాట వినకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం కొనితెచ్చుకుంటారు.

పెద్దవాళ్లతో కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి వ్యాధి ప్రకోపించి అవకాశం ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రము బంధుమిత్రుల కలయిక ప్రయాణ లాభం వుంది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి బంధుమిత్రులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారం : మీరు వీలైనంతవరకూ మౌనముద్ర వహిస్తూ శివకేశవ ధ్యానాన్ని చేయండి. విష్ణు సహస్ర నామ పారాయణ కూడా చేయండి.

కుంభ రాశి :

ఈ రాశి వారికి శని శుక్ర బుధులు సాధారణ శుభులై వున్నారు. వీరు ఏళ్ల నాటి శని ప్రభావం తను స్థానం మీద ఉండబట్టి అనారోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. వీరికి నేత్ర రోగము ఉష్ణ బాధ కలుగుతాయి. కుటుంబంలో కలహాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యంతో దూర ప్రయాణం చేయవలసి రావచ్చు. కొన్ని పరిచయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పోలీస్స్ స్టేషన్లకు వెళ్ళాల్సిన అవసరం వచ్చినా జాగ్రత్త వహించండి. భేషజాలకు పోయి ఖర్చులను పెంచుకునే అవకాశం ఉంది. మీ పనులకు చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా సాధిస్తారు. స్ర్తిలతో పరిచయానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వారి ద్వారా మీకు ధనాదాయము ఉంది ధనం వ్యయము కూడా ఉంది. బంధు మిత్రులతోను విలాసవంతమైన భోగ వంతమైన రోజుల్ని ఈవారంలో గడుపుతారు. మీకు అనుమానాలతో కుటుంబ కలహాలు పెరుగుతాయి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి మిత్రులతో విరోధాన్ని సూచిస్తోంది. శతభిషం వారికి కొత్త పరిచయాలు ఇబ్బందులు కలుగుతాయి పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి ఆదాయం బావుంది .

పరిహారం : మీరు సుందరకాండ పారాయణ గాని ద్వాదశ నామావళి గానీ చేసి గారెలు నివేదించండి.

మీన రాశి :

ఈ రాశి జాతకులకు కుజ చంద్ర రవులు ఆధిపత్యం చేత మాత్రమే శుభులు. జాగ్రత్తగా వ్యవహరిస్తే గానీ ఇ వారంలో మీ పనులు నెరవేరవు. కొంతలో కొంత ఈ వారం మీకు బాగుందనే చెప్పాలి. రాబడి పెరిగే అవకాశాలున్నాయి. వినోదాలు విలాసాలతో పాటు దాని వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. మీకు తెలియకుండానే కాలం వ్యర్థమై పోతుంది ప్రతి పనిని వాయిదా వేసుకోవడమే ఔతుంది. . ఆ సమయంలో ఇంకొకరి పనిచేయడం దానివల్ల శ్రమ ఎక్కువై పోవడం మీ సొంత పనులు వాయిదా పడడమో జరుగుతూ ఉంటుంది. కొత్త పరిచయాల వల్ల మీకు మేలు జరుగుతుంది. కానీ చివరిలో మీ మాట తీరు బాగాలేకపోవడం వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఫలితం శూన్యం అవుతుంది. వినోద ప్రదర్శనలను తిలకిస్తారు. వార్ధక్యంలో ఉన్నవాళ్లతో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దవాళ్ల పరిచయము మీకు మంచి మార్గాన్ని సూచిస్తుంది. దురలవాట్ల నుండి బయటపడేస్తుంది. స్త్రీ సౌఖ్యం ఉంది కానీ జాగ్రత్త పడండి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి అనుకూలమైన వాతావరణం పనులు పూర్తవుతాయి.

ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వ్యయప్రయాసలు మిగులుతాయి. రేవతి వారు స్నేహితులతో వృద్ధి పొందుతారు .

పరిహారం : ఈ రాశివారు శివునికి అభిషేకం చేయండి గురువారం నియమాన్ని పాటించి తే మంచి ఫలితాలు లభిస్తాయి .

Next Story