రాశిఫలాలు ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు

By Newsmeter.Network  Published on  2 Feb 2020 12:42 PM GMT
రాశిఫలాలు ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు

మేషరాశి :

ఈ రాశివారికి అష్టమ కుజుడు నవమంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక శుభఫలితాలు కలగుతాయి. అంతేకాదు చంద్రుడు మేష వృషభ రాశులలో సంచారం వల్ల కూడా వీరికి మానసికంగానూ ఆర్థికంగానూ లాభాలు కలుగబోతున్నవి. గురు మంగళ యోగం అనేది వర్తిస్తుం దాని వల్ల కూడా వీరికి లాభం చేకూరుతోంది అయితే కేసు ఉండడం వల్ల వీరికి ఆలోచనా విధానంలో చిన్న మార్పువచ్చి దైవ ప్రార్థనలు వైపు మనస్సు పెడుతుంది వీరికి సానుకూలత ఈవారంలో ఎక్కువుంది స్త్రీలకు అనుకూలమైన పరిస్థితులు లభించబోతున్నాయి. రాజ్యంలో ఉండే శుక్రుడు వ్యయంలోకి వెళుతున్నాడు కనుక భార్యాభర్తల అన్యోన్యత ఇబ్బందులు కలగవచ్చని సూచనా అశ్విని నక్షత్ర జాతకులకు సంపత్తార తో ఈ వారం ప్రారంభం అవుతుంది కాబట్టి వారికి అనుకూలతలు ఆర్థికంగా బావున్నాయి. భరణివారికి జన్మతార తో వారం ప్రారంభం కాబట్టి ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి. కృత్తిక ఒకటో పాదం వారికి పరమమిత్ర తారతో ప్రారంభమైంది కాబట్టి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంది.

పరిహారం : వీరికి శుక్రుని అనుకూలత తక్కువ కాబోతోంది కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి అమ్మవారి పూజలు లలితా సహస్ర మా పారాయణాలు చేయండి.

వృషభరాశి :

ఈ రాశివారికి అష్టమ కుజుడు అష్టమ గురుడు అవుతున్నారు కాబట్టి ఈ వారంలో వీరికి గురుబలం చాలా తక్కువగా ఉంది. గురు కుజులు ప్రభావం కూడా వీరిని ఇబ్బంది పెట్టబోతోంది. గురు మంగళ యోగం అష్టమంలోకాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. లాభంలో ఉన్న శుకుడు వీరికి శుభాన్ని ఇవ్వనున్నాడు. ఈ వారంలో వీరికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయనే చెప్పవచ్చు. మీరు వాహనాలు నడిపే టప్పుడు జాగ్రత్త వహించండి. మీ జ్ఞాపకశక్తికి చిన్న ఇబ్బంది కలిగే అవకాశం వుంది. నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు జాగ్రత్త వహిస్తూ ఉన్నట్లేైతేనే మీకు అనుకూలత ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం బావుంటుంది భార్యాభర్తల. అన్యోన్యత ఉంటుంది. వ్యయ చంద్రుడు వల్ల రెండు రోజులు మాత్రం మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత మంగళవారం నుంచి మీకు బాగుంటుంది . కృత్తిక వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటే. రోహిణి వారికి మిత్రతార వారం ప్రారంభం కాబట్టి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి.

పరిహారము : మంగళవారం నియమాలను ఆంజనేయస్వామిగా అర్చనలు చేయండి లేదా గారెలు అప్పాలు గానీ ఆంజనేయస్వామికి సమర్పించండి .

మిధున రాశి :

ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. లగ్నంలో రాహు కొంచెం ఆలోచనా విధానంలో మార్పొస్తుంది. ఉద్యోగ విషయాల్లో కూడా కూడా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏమైనా గురు మంగళ యోగం కొంతవరకు అనుకూలిస్తుంది కాబట్టి ధైర్యం వహిస్తే మీరు ప్రతిపనిని సానుకూలంగా చేసుకోవచ్చు. అయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రమే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్యను మీరు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకునే అవకాశం కలగబోతోంది దీని ఫలితంగా ఒక నెల రోజుల్లో మీరు ఓ సానుకూల మైనట్టి ఆలోచనని తీసుకునే అవకాశం ఉంది. అది ఎనిమిదో తేదీన ప్రారంభం కాబోతున్నది. ఇక మీకు వ్యయాధిపతి శుక్రుడు సంచారము అలాగే చంద్ర సంచారము మానసికంగా శారీరికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబపరమైన తల్లిదండ్రులు వారి ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ఇబ్బంది ఎదుర్కోవాలి. మీ ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించండి. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంది. ఆరుద్ర వారికి కార్య సాధన సాఫల్యత ఎక్కువగా ఉంది. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి ప్రతికూలతలు తీవ్రంగా ఉన్నాయి.

పరిహారం : ఈ రాశివారు గురుడికి సంబంధించిన స్తోత్రాలు పఠించండి. అలాగే షిర్డీ సాయినాథుని గాని లేదా దక్షిణామూర్తి గానీ స్తుతించండి.

కర్కాటక రాశి :

ఈరాశి వారు మనో ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే చక్కని ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఇంతకుముందు ఏ ప్రయత్నాలైతే చేశారో ఆ ఫలితాలు ఇప్పుడు మీరు చవి చూడబోతున్నారు. కృషికి తగ్గ ఫలితం కనిపించే రోజులు ఆసన్నం ఔతున్నట్టుగా ఉంది. అయితే ఈ వారం మొదట్లో మీకు చాలా అనుకూలంగా ఉండి శుక్ర శనివారాల్లో మాత్రం ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్న కాబట్టి మీరు గురువారంలోగా ఏ పనిని చేయాలన్న మీ ప్రయత్నాన్ని ముందుకు సాగించండి. అలాగే మీకు అనుకూలమైన వ్యవస్థ మున్ముందు రాబోతోంది కాబట్టి ప్రయత్న లోపం లేకుండా మీరు ముందుకు సాగినట్లయితే మీ పనులన్నీ చక్కబడతాయి. పెళ్లికాని వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విద్య వ్యాపార రంగాల్లో వారి కూడా శుభ సూచనలు కనిపిస్తున్న ఈ వారంలో మీకు అనుకూలత ఎక్కువగా ఉన్నప్పుడే వ వాటిని వదిలేయకుండా అవకాశాన్ని అందిపుచ్చుకోండి. పునర్వసు నాలుగో పాదం వారికి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. పుష్యమి వారికి క్షేమ తారైంది కాబట్టి శుభ ఫలితాల్ని ఎక్కువగా చూస్తారు. వివాహాది ప్రయత్నాలు కలిసొస్తాయి. ఆశ్రేష వారికి విపత్తార ఐంది కాబట్టి ప్రతికూలతల ఎక్కువగా ఉన్నాయి ఆచితూచి మాట్లాడండి మీ పనులు నెరవేరుతాయి.

పరిహారం : ఈ రాశివారు చంద్రుడికి సంబంధించిన మంత్ర జపం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం గానీ శివుడికి అభిషేకం గానీ చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు.

సింహ రాశి :

ఈ రాశివారికి అనుకూలతలు మెల్లిమెల్లిగా పుంజుకుంటున్నాయి. వీరు ఎంత శ్రమపడితే అంత ఫలితాలు దక్కబోతున్నాయి. మీకు అనుకూలతలు కూడా పెరిగే అవకాశం ఉంది . గురు మంగళ యోగం మీకు బాగా లాభించ బోతోంది . కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ప్రతికూలతలు ఎక్కువగానే ఉన్నాయి. పిల్లలు చదువు విషయంలో శ్రద్ధ వహించండి. వారి ప్రవర్తనలు గుర్తించడం చాలా అవసరంగా కనిపిస్తోంది. అష్టమ శుక్ర సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతోంది కాబట్టి భార్యా పిల్లలు వీరి ఆరోగ్యాలు కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ తెలివితేటలతో మీరు పనులను సానుకూల పరచుకోగలుగుతారు. ఆత్మస్థైర్యం మనోధైర్యం చెదరిపోనివ్వకండి. రాజకీయ పరమైన ఇబ్బందులు ఒత్తిడులు మీరు ఎదుర్కోక తప్పదు. ఇది నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్నది మీరొక చిక్కు సమస్యను ఎదుర్కొంటారు ఆ సమస్యని స్వయంగా అయితే పరిష్కరించుకోగలుగుతారు లేదా గురు బుద్ధిః విశేషతః గనుక గురువుతో సంప్రదిస్తే తప్పకుండా నెరవేర్చుకో గలుగుతారు. మృగశిర వారికి ఈ వారం సంపత్ తారైంది కాబట్టి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. పుబ్బ వారికి జన్మతార అవడం వల్ల ఆరోగ్య రీత్యా చిన్న ప్రతికూలత లున్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.

పరిహారం : ఈ రాశివారు లలితా సహస్త్రనామ పారాయణ ఖడ్గమాల పారాయణ చేయించండి చాలా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు గురుస్తుతి చేయండి .

కన్యా రాశి :

ఈ రాశివారికి ప్రతికూలతలు. పెరుగుతున్నయి. మీరింతవరకు చేసిన శ్రమని ఎవరో ఎత్తుకు పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి . మీ గుట్టు మీరే ఇతరుల చేతికి ఇచ్చినట్టుగా అవుతుంది. చతుర్ద కుజుడు గురులు మీకు ప్రతికూలంగా మారిపోతున్నారు. అధైర్యపడకుండా ముందుకు వెళ్లడం ఒక్కటే మీరు చేయగలిగిన టువంటి పని. నాలుగో తేదీ నుంచి మీకు కొంత అనుకూలమైన వాతావరణం ఉంది కనుక కుటుంబపరంగా పిల్లల పరంగా మీరేమైనా మంచిని పొంది ఆనందాన్ని పొందగలుగుతారు. మీకు ఎన్నాళ్లో బాధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించే అవకాశం ఉంది . ఏదేమైనా మరికొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరము. భాగ్య రాజ్య లాభాల్లోచంద్రుని సంచారం వల్ల మానసికంగా మీరు ఉండాలి అనుకుంటే ప్రశాంతంగా ఉండగలరు. శారీరికంగా మాత్రం కొంచం ఇబ్బంది కలుగుతుంది. ఆరోగ్యరీత్యా చూసుకోండి. కంటికి సంబంధించిన లేదా ఎముకలకు సంబంధించిన వ్యాధిని మీరు ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోండి దీనివల్ల సత్ఫలితాలు పొంద గలుగుతారు . ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వారికి ఫలితాలు బాగున్నాయి. హస్తవారికి మిత్ర తారైంది శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. చిత్త ఒకట్రెండు పాదాల నైధనతార అయింది కాబట్టి ప్రతి కూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : మీరు సాధ్యమైనంతవరకు మంగళవారం ని మాలుపాటించండి. సుబ్రమణ్యే శ్వర స్వామిని పూజించండి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి.

తులా రాశి :

ఈ రాశివారికి తృతీయంలోకి కుజుడు వెళ్తున్నాడు కాబట్టి గురు మంగళ యోగం వీరికి కలుగుతోంది. మిత్ర స్థానంలో కలయిక గనుక పర్వాలేదనిపిస్తుంది. అయితే వీరు ఆచి తూచి అడుగు వేయడం చాలా అవసరం. చంద్రుడు శుక్రుడు అనుకూలత కూడా తక్కువగా ఉంది మీరు చేసే పనులకు ఎవరో ఒకరు అడ్డు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అర్ధాష్టమ శని తాలూకు ప్రభావం కూడా మీపై చాలా ఎక్కువగా చూపిస్తోంది మీరు ఎంత అనుకూలం చేసుకోవాలనుకున్న మీ పనులకి వ్యతిరేకతే ఏర్పడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తనున్నాయి పిల్లల చదువు ఉద్యోగ విషయాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి .మీ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారం మధ్యలో మీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణాలపుడు జాగ్రత్త వహించండి . ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నచిన్న ప్రతికూలతలు ఎదుర్కొన్నా చివరికి మంచి ఫలితాలను పొందగలుగుతారు. చిత్త మూడు నాలుగు పాదాల వారికి నైధన తార అయింది ప్రతికూలతల ఎక్కువగా ఉన్నాయి. స్వాతి వారికి సాధన తారైంది గాబట్టి ఫలితాలు సుఖంగా ఉంటాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి మాత్రమే ప్రతికూలతలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

పరిహారం : మీరు ఎక్కువగా సాయినాథుని చరిత్ర పారాయణ చేయండి. శనికి తైలాభిషేకం గానీ నువ్వులు దానం గాని చేయండి.

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి యోగ కారకులైన గురు కుజులు గురుని ఇంట్లో కలవడం గురు మంగళ యోగం అవుతోంది. వీరికి ఈవారం చాలా అనుకూలంగా ఉంటుంది శని ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి వీరు పట్టిందల్లా బంగారమే. విద్యా వైద్య రంగాలే కాదు వ్యాపారమూ అన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి రోజులు సంప్రాప్తమయ్యే ఈ వారమంతా చాలా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికత వీరిలో వెల్లువిరుస్తుంది. అది ఉన్నంత వరకు వీరికి అనుకూలత ఇంకా ఇంకా పెరుగుతుంది. వీరికి ఉన్న సమస్యల్లో ప్రధానమైన సమస్యలు రెండు పరిష్కారానికి వచ్చే అవకాశం ఉంది. చిన్నచిన్న సమస్యలు వాటంతటవే విడిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కళ్యాణ శుభఘడియలు ఉన్నాయి. అలాగే ఉద్యోగులను ఉన్నతి కూడా పొందుతారు. ఉద్యోగం లేని వాళ్లకి ఉద్యోగం కూడా లభించే అవకాశం ఈ వారంలో ఉంది. విశాఖ నాలుగో పదం వారికి ప్రత్యేక తయారైంది గావున సుమలతలు తక్కువ అనూరాధ వారికి క్షేమ తారైంది ఫలితం ఎక్కువగా ముంది జ్యేష్ట వారికి విపత్తార ని కాబట్టి ఆలోచించి ముందుకు వేయడం చాలా మంచిది

పరిహారం : ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం చేయడం చాలా అవసరం. సుందరకాండ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ధనూ రాశి :

ఈ రాశి వారికి యోగకారకు లైన గురు కుజులు కలవడం అలాగే చంద్ర స్థితి కూడా బాగుంది. అయితే ఏలినాటి శని ప్రభావం ద్వితీయ స్థానానికి వెళ్లడం కనుక ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యము కుటుంబ స్థానం కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. మీ మాట తీరు ఎదుటి వాళ్లకి ఇబ్బంది కలిగించేట్టుగా ఉంటుంది కాబట్టి మాట మీద నిలబడటం చాలా అవసరం. సప్తమంలో రాహు స్థితి భోగభాగ్యాలు కూడా తగ్గే అవకాశం ఉంది అంతే కాదు మీకు ఆనందంగా సమయం గడపడానికి కూడా అవకాశం తక్కువవుతుంది . ధర్మ కార్యాల లోని అన్నదానాది కార్యాల్లో పాల్గొనడం మీ గ్రహ తీవ్రతను తగ్గిస్తుంది. మూడు ఆరుపదకొండు స్థానాలు స్థానాధిపతులు బాగాలేకపోవడం వల్ల మీకు కోపము జాడ్యము ఇవన్నీ కలగనున్నాయి. మీ వల్ల ప్రయోజనం పొందిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. ఆచి తూచి అడుగు వేయడం చాలా అవసరం. మూలా నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది గావున పరిస్థితులు బాగుంటాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు శరీర ఆరోగ్యం కుంటుపడుతుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి శుభ సూచనలు ఉన్నాయి.

పరిహారం : ఈ రాశివారు సరస్వతీదేవిని ప్రార్థించడం శనికి జపం చేయించుకోవడం లేదా నువ్వుల దానం చేయడం శుభ ఫలితాలని ఇస్తుంది.

మకర రాశి :

ఈ రాశి వారికి స్వక్షేత్రంలో ఉన్న శని తన స్థానానికి ఇబ్బంది కలిగించకపోయినా అతని ప్రభావంతో అకాల భోజనము నిద్రలేమి ఆలోచనల్లో భిన్నత్వమూ ఎవరితోనూ కలువ లేకపోవుట ఇలాంటి స్థితులు సంప్రాప్తం కానున్నాయి. ద్వితీయ స్థానం కూడా శని దే గనుక వాక్ స్థానం బాగులేదు. శరీర ఆరోగ్యం కూడా ఇబ్బంది కలుగుతుంది. ధన నాశనం తప్పదు నేత్ర చికిత్స అవసరం పడొచ్చు. పిల్లల విషయంలో చదువులో బాగానే ఉంటారు కానీ ఆలోచనలో కొద్దిపాటి తేడా రావచ్చు. దూర ప్రాంతంలో ఉన్నవాళ్లయితే ఉద్యోగంలో వ్యతిరేక పరిస్థితిని చదువులో కూడా అననుకూలత వీళ్లని ఇబ్బంది పెడతాయి వీరు ఇంటిముఖం పట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. వారికి మనస్చాంచల్యం ఉంది. ఉత్తరాషాఢ మూడు పాదాల వారికి అనుకూలంగా ఉంది శ్రవణం వారికి మిత్ర తారైంది గావున ఆభరణాది సౌఖ్యాలు పొందుతారు. ధనిష్ఠ ఒకట్రెండు పాదాలు వారికి నైధన తార గావున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి

పరిహారం : రాశివారు శనికి జపం చేయించుకున్న రుద్రాభిషేకం చేయించుకున్నా చాలా మంచి జరుగుతుంది.

కుంభ రాశి :

ఈ రాశివారికి ఈ వారం సాధారణంగా సాగిపోతుంది. శని ప్రభావం మాత్రం ఇబ్బంది కలగిస్తుంది. అనవసర వ్యయం. మీ తెలివితేటలు కూడా దుర్వినియోగం అవుతాయి. మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్లు తక్కువవుతారు. మీకు దూర ప్రయాణ అవకాశం ఉంది. ఆ ప్రయాణంలో కూడా అనుకున్న దానికంటే ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. మీకు మాతృ సౌఖ్యం ఉంటే ఆవిడ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అగత్యం కనిపిస్తోంది. అంతేకాదు మీకు కళత్ర స్థానాధిపతి రవి వ్యయ మందుండడమ్ ఇత్యాది కారణాల చేత ఇంట్లో మీ మాటకు విలువ తగ్గే అవకాశం ఉంది. శరీరంలో తాపం పెరగడం తత్సంబంధమైన అనారోగ్యం మీకు కలగబోతోంది. ముందుగానే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. పొత్తి కడుపులో నొప్పి గాని కిడ్నీ ట్రబుల్ గానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తగుజాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం వల్ల బాగుపడతారు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి నైధన తార అయింది ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. శతభిషం నాలుగు పాదాల వారికి సాధనం కార్య సాధనంగా జరుగుతుంది.. ఈ వారం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రత్యక్ తార అయ్యింది కాబట్టి ఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం : ఈ రాశివారు పిల్లా ఏళ్ల నాటి శని ప్రభావం తగ్గడానికి గాను సూర్యనమస్కారాలు చేయించుకోవడం సరికి జపం చేయించుకోవడం రెండూ జరగాలి.

మీన రాశి :

ఈ రాశివారికి ఆధిపత్య శుభులైన కుజ చంద్ర రవులు అన్ని పనులలోనూ సహకరించి వీరిని ఒక స్థాయికి తీసుకు రానున్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక సమస్య లేదా కోర్టు కేసు గానీ పరిష్కారం పొందే అవకాశం ఉంది. అది మీకు అనుకూలంగా వచ్చేలా ఉంది. మానసికంగా మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ కళత్ర స్థానాధిపతి అయిన బుధుడు వ్యయమందు ఉండడం వల్ల మాటలు నిలకడ లేకపోవడం మాట నెరవేర్చుకో లేకపోవడం రెండిటా వ్యతిరేకతే . లగ్నాధిపతి గురుడికి కేంద్రాధిప

త్యం కూడా బాగాలేదు కాబట్టి ఆరోగ్యవంతంగా ఆలోచించండి అందరి మాటల్ని ముందు విని ఆతరువాత ఆచరణలో పెట్టండి. చంచలత్వం చపలత్వం లక్షణాలు ఈ రాశివారికి ఉన్నాయి. ఈ సమయంలో వాటిని విడిచిపెట్టి ముందుకు వెళితే ధైర్యం వహిస్తే తప్పక పనులు నెరవేరుతాయి. ఈ వారంలో మీ పనులు చేసిపెట్టడానికి ఎవరి సహకారము లభించక పోవచ్చును. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి ప్రత్యేక్తార ఐంది గాన ప్రతికూల ఫలితాలున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది గాన శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. రేవతీ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ఫలితాలు అంత శుభప్రదంగా ఉండవు.

పరిహారం : ఈ రాశివారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శివకేశవులకు అర్చన ఆరాధనలు జరిపిన శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి.

Next Story