రాశిఫలాలు ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 22 వ‌ర‌కు

By Newsmeter.Network  Published on  16 Feb 2020 5:10 AM GMT
రాశిఫలాలు ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 22 వ‌ర‌కు

మేష రాశి :

ఈ రాశివారికి గురుడు యోగిస్తూ జ్ఞానాన్ని మాత్రం వెనక్కి లాగుతున్నాడు కాబట్టి మీకున్న జ్ఞాపక శక్తిని సమయానికి వినియోగించుకోలేక పోతారు. అలాగే ద్వితీయ సప్తమాధిపతి ఐన శుక్రుడు వ్యయ మందున్న కారణంగా కుటుంబ కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ధనవ్యయం కూడా ఉంది. రవి కించిత్ ఆరోగ్యాన్ని ఇస్తాడు. దీర్ఘ రోగులు కూడా కొద్దిగా కోలుకుని అవకాశం కనిపిస్తోంది. మీకు ఆరోగ్యం బాగుండే అవకాశముంది. అలాగే కుజుడు అష్టమ లగ్నాధిపతి భాగ్యాధిపతతో కూడి ఉండటం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు. శని చిత్త చాంచల్యాన్ని కలిగిస్తున్నాడు. చేస్తున్న ఉద్యోగం వృత్తి వ్యాపారము వీటిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది అశ్వనీ నక్షత్ర జాతకులకు నైధనతారతో వారం ప్రారంభం కనుక ఫలితాలు తగ్గుముఖం పడుతున్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు సాధనం కార్య సాధనం అనే పద్ధతిలో ముందుకు సాగిపోతారు. కృత్తిక ఒకటో పాదం వారికి ఫలితాలు సామాన్యంగా ఉంటాయి.

పరిహారం : మీరు గురు ప్రార్థన గురుచరిత్ర పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది.

వృషభ రాశి :

ఈ రాశి వారికి శుక్రుడు ఉచ్చ స్థానంలో లాభంలో ఉన్నాడు. రాశ్యాధిపతి కూడా ఆయనే షష్ట ఆధిపత్యం వచ్చినప్పటికీ మంచి ఫలితాల్ని ఇవ్వబోతున్నాడు. అలాగే శని వీరికి భాగ్యంలో ఉన్నాడు అలాగే చంద్రుడితో కూడి ఉన్నప్పుడు ఆకస్మిక ధన లాభాదులు సమకూరే అవకాశం ఉంది. కొంచం ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. కళత్రం తో కించిత్ విరోధాలు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంది. పిల్లల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. వీరికి గురు బలం కొద్దిగా తక్కువగా ఉందని. అయినా స్వక్షేత్ర వర్తి కనుక మంచి ఫలితాన్ని ఇస్తాడు. కొత్త వ్యక్తుల పరిచయాలు మిమ్మల్ని ఊహాలోకాల్లో విహరింప చేస్తాయి. ఆర్థికంగా మాత్రం జాగ్రత్తగా ఉండండి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్తా రైంది కావున ఫలితం కొంత తక్కువగా ఉంది. రోహిణి నక్షత్ర జాతకులకు క్షేమ తారతో వారు ప్రారంభం కనుక ఫలితాలు చాలా బాగుంటాయి. మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి విపత్తారతో వార ప్రారంభం కనుక ఫలితాలు కొంచెం తగ్గుతాయి.

పరిహారం : మీరు సాధ్యమైనంత వరకు శుక్రవారం నియమాలు పాటించండి బుధవారం నాడు నానబెట్టిన పెసలు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి.

మిధున రాశి :

ఈరాశి వారు ఈ వారంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది . శని స్వక్షేత్రంలో ఉన్నా అష్టమ శని యొక్క ప్రభావం వుంది. గురుడు దృష్టి కాస్తంత లాభాన్ని చేకూర్చినా స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడటం కష్టం. కుజుడు కూడా అదే రాశిలో ఉండటం సప్తమంలో చాతు గ్రహ కూటమి పైగా రాహు కేతువుల మధ్యలో మొత్తం గ్రహాలన్నీ ఇమడటం కూడా వీరికి వ్యతిరేక ఫలితాల్ని సూచన చేస్తున్నాయి. ఇన్నాళ్లు తన చేయి పైనుండి ఇతరులు చేయి క్రింద నుండుట జరిగేది. ఇప్పుడు మాత్రం ఈ రాశివారికి తన చేయి క్రిందవటం ప్రారంభమవుతుంది. వారం రోజులపాటు సుమారుగా ఈ పరిస్థితి నెలకొంటుంది. వీరికి కుటుంబంతో సఖ్యత తక్కువ. అలాగే పిల్లలకి దూరంగా ఉండటము,అనారోగ్య సూచన మానసిక దుర్బలత్వం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. గతంలో చేసిన తప్పులు మీ ఎదుట సాక్షాత్కరించి మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి విపత్తార అయింది కాబట్టి ఫలితాలు ఇబ్బంది కరంగా ఉంటాయి. ఆరుద్ర వారికి సంపత్తారతో వారం ప్రారంభం ఐందికాబట్టి ధనం విషయంలో లోటుండదు. పునర్వసు ఒకటిరెండు మూడు పాదాల వారికి జన్మ తారైంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం : ఈ రాశివారు గురుని తాలూక శక్తిని పొందడానికి కాలసర్ప యోగం దాటడానికి రాహు కేతువులు పూజలు చేయండి. మినుములు దానం చేస్తే చాలా మంచిది.

కర్కాటక రాశి :

ఈరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగబోతున్నవి. చంద్రబలం తగ్గి రవి కుజ గురు బలాలు పెరుగుతున్నాయి. అయితే మీరు ఆచి తూచి అడుగు వేయడం చాలా అవసరం. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావడం కొంత స్వేచ్ఛగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. సకాలంలో ధనం అందినప్పటికీ అది సద్వినియోగం కాకపోవచ్చు. ఈ వారంలో ఒక శుభవార్త ఏదైనా మీరు వినే అవకాశం ఉంది. మీ ఆత్మస్థైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రస్తుతం అయితే అష్టమ రవి చిన్నపాటి అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. ముందు మీమీద మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి. శని మీకు పాప స్థానంలో నిలిచి అనాలోచిత చర్యలుగా కొన్ని ఇబ్బందుల్ని కలుగ చేస్తాడు. అవి తెలుసుకునే అవకాశం ముందుగానే మీకు సూచన ప్రాయంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు వల్ల మీకు ఒక మంచి లాభం కూడా చేకూరుతుంది. పునర్వసు నాలుగో పాదం వారికి జన్మతారైంది ఫలితాలు కొద్దిగా అనారోగ్యాన్ని సూచిస్తున్అయి. పుష్యమి వారికి పరమ మిత్రతార కాబట్టి సత్ఫలితాలు. ఆశ్రేషవారికి మిత్రతారైంది. వారాంతంలో మేలు పొందే అవకాశాలు ఉన్నాయి.

పరిహారం : దక్షిణామూర్తి స్తోత్రం గాని సుబ్రహ్మణ్య స్తోత్రం గాని చేయండి మంచి ఫలితాలని పొందగలుగుతారు.

సింహరాశి :

ఈ రాశివారికి క్రమక్రమంగా ఫలితాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం వీరి ఆరోగ్యం కొద్దిగా కుంటుపడుతుంది. అష్టమ శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల స్త్రీ మూలకంగా ధన నష్టం స్త్రీ వలనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. అది పిల్లలు,తల్లి, లేదా భార్య కూడా కావచ్చు. సప్తమ రవి స్వక్షేత్రాన్ని చూస్తున్నప్పటికీ శత్రు క్షేత్రంనుండి చూస్తున్నాడు కాబట్టి శరీర తాపం తలనొప్పి పేగు బాధ కలగవచ్చు. ఉద్యోగంలో ముందుగా మీకు వ్యతి రిక్త భావాలే సమాజంలో కనిపిస్తాయి. దాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి మీ దగ్గిర తక్కువగానే ఉంటుంది. చివరిలో శుభ ఫలితాలు ఒస్తాయి.కొత్త వస్తువులు కొనే అవకాశం కూడా వుంద మఘ వారికి ఈ వారం నైధన తారతో ప్రారంభం కాబట్టి ఫలితాలు శుభప్రదంగా లేవు. పుబ్బ వారికి సాధనతారతో వారం ప్రారంభం కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి మాత్రము శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం : సూర్యనమస్కారాలు చేయడం,శుక్రవారం నాడు అమ్మవారిని అర్చన చేయడం వల్ల శుభ ఫలితాలని పొందగలుగుతారు

కన్యా రాశి :

ఈ రాశివారికి ఈ వారం చక్కగా ముందుకు సాగుతోంది. మంచి ఫలితాలు పొందబోతున్నారు. సప్తమంలో ఉచ్చలో ఉన్న శుక్రుడు మేలు చేస్తాడు. కుటుంబము మిత్రులు తోటి ఉద్యోగుల ద్వారా మీకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అయితే కాలసర్ప యోగం మీ రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టబోతోంది. దీని ఫలితంగా మీరు చిన్నచిన్న సమస్యల లో ఇరుక్కునే అవకాశం ఉంది. వాటికి పరిష్కారాలు తట్టక ఇబ్బంది పడతారు. మంచి మిత్రులు సహకారం తీసుకుంటే మీకు ప్రణాళిక బద్ధంగా పనులన్నీ జరుగుతాయి. వ్యసనాల రూపంలో కొంత వరకు ఖర్చవు ది. మీరు మంచి కోసం తాపత్రయపడినా చెడ్డపేరు వస్తుంది. పదిమంది దగ్గర జాగ్రత్తగా వ్యవహరించండి. భోజన విషయంలో గానీ మాట్లాడే విషయంలో గాని నోటిని అదుపులో ఉంచండి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది ఫలితాలు తక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్రం వారికి క్షేమ తారైంది కాబట్టి ఈ వారంలో మంచి ఫలితాల్ని చూడబోతున్నారు. చిత్త ఒకటి రెండు పాదాలు వారికి విపత్తార కనుక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

పరిహారం : ఈ రాశివారు బుధునికి జపాలుచేయించండి. నానబెట్టిన పెసలు బెల్లం బుధవారం నాడు ఉదయం ఆవుకు తినిపించండి.

తులా రాశి :

ఈ రాశివారికి శుభాశుభ ఫలితాలు సమానంగా ఉన్నాయి. మొదట్నించి వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడమే చాలా మంచిది. వీరికి లగ్నాధిపతి శుక్రుడు షష్థ స్థానంలో ఉండటం పైగా కాలసర్పదోషం చంద్రుడు ప్రతికూల స్థితిలో అనేక ఇబ్బందుల్ని సూచిస్తున్నాయి. మీఆరోగ్యము ఎముకల బాధ రూపంలోను. మానసిక ఆందోళనలతోను మిమ్మల్ని చాలా తీవ్రంగా బాధిస్తుంది. అయితే రాశ్యాది శుక్రుడు ఉచ్చ క్షేత్రంలో ఉండటం వల్ల వీరికి కొద్దిపాటి మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. మీరు అనుకున్న పనులను తొందరగా సాధించలేరు. నిరుత్సాహ పడకుండా ముందుకు వెళ్లడమే మంచిది. మంచి రోజుల కోసం ఎదురు చూడడం మంచిది. చిత్త మూడు నాలుగు పాదాలు వారికి విపత్తారైంది. ఫలితాలు తక్కువగా వున్నాయి. స్వాతి వారికి సంపత్తార ఐంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి జన్మ తారైంది కాబట్టి ఫలితాంశం ఇబ్బందిగా ఉంది.

పరిహారం : శనికిజపం చేయించండి. నల్లని వస్త్రం దానం, చేనువ్వులు, మంచి నూనెతో అభిషేకం మీకు మంచి ఫలితాలు ఇస్తాయి.

వృశ్చిక రాశి :

ఈ రాశివారు కొద్దిపాటి బలాన్ని క్రమక్రమంగా పొందగలుగుతున్నారు. వీరికి శని ప్రభావం తగ్గింది. ద్వితీయ మందున్న గురుడు వీరికి మారకుడు కాబట్టి మాట్లాడే తీరు మార్చుకోవడం చాలా మంచిది. వారాంతంలో శని చంద్రుల కలయిక వల్ల వీరికి మేలు జరిగే అవకాశముంది. ద్వితీయ మందు చంద్రుడున్నప్పుడు మానసిక ఆందోళనకి గురి అవుతారు. వీరికి రవి యోగ ప్రదుడు కాబట్టి ఆరోగ్య లాభాన్ని కలుగజేస్తాడు మంచి పనుల ద్వారా మంచి కీర్తిని తెచ్చిపెడతాడు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తాడు. అదే సమయంలో చెయ్యాలనుకున్న పనులను వాయిదా వేసుకుంటూ పోతారు కాబట్టి యథావిధిగా చేయటానికి ప్రయత్నం చేయండి. కళత్ర స్థానం బావుంది అనుకూల దాంపత్యం అనుకూలమైన పిల్లలతో కలిసి కాలక్షేపం చేస్తారు. మీకు ఏదైనా ఒక మంచి శుభవార్త వినే అవకాశం వారాంతాల్లో ఉంటుంది. విశాఖ నాలుగో పాదం వారికి జన్మ తారైంది అనుకూలత తక్కువ. అనూరాధ వారికి పరమ మిత్ర తారైంది కాబట్టి సత్ఫలితాలు ఉన్నాయి. జ్యేష్ట వారికి మిత్రతార అయింది కాబట్టి మంచి ఫలితాల్ని పొందుతారు.

పరిహారం : సూర్య నమస్కారాలు శివాభిషేకం మీకు చాలా లాభాన్ని కలిగిస్తాయి

ధనూరాశి :

ఈరాశి వారికి స్వక్షేత్ర వర్తన గురుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. చాతుగ్రహ కూటం, ద్వితీయ శని మాత్రం ఇబ్బంది కలిగించే పరిస్థితులు. ఆరోగ్యాన్ని ముఖ్యంగా అరవై దాటిన వాళ్లకి ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉన్న వారు ఇబ్బంది పడతారు. ప్రమాదాలు సంభవిస్తాయి. ద్వితీయ స్థానానికి చంద్రుడు వెళ్లినప్పుడు మానసిక ఆందోళనను పొందుతారు. శనితో కూడటం మరింత ఇబ్బంది కరమైన స్థితి అయిపోతుంది. చాలా అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది . మూడవ ఇంట్లో ఉన్న బుధుడు కూడా వీరికి ప్రతికూలంగా పనిచే చేసే అవకాశం ఉంది. రవి మాత్రం యోగిస్తాడు కనుక సాహస కృత్యాలు చేయడానికి మీరు ముందుకు వెళ్లొచ్చు. గృహ సంబంధమైన పనులైతే మాత్రం వాయిదా వేయండి. ఉద్యోగ విషయంలో గానీ వ్యాపార విషయంలో గానీ ఆచితూచి అడుగు వేయండి. మీకు లగ్నాధిపతి లగ్నంలో ఉండటమే మీ పనులకు ఆటంకాలు వచ్చినా సరే అనుకున్నవి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకు నైధన తారైంది ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు సాధన తారైంది పనులు చక్కగా నెరవేరుతాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి ప్రత్యక్తా రైంది కాబట్టి శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయి.

పరిహారం : ఈరాశి వారు శనికి జపం చేసుకోవడం మహా శివరాత్రి నాడు విశేషంగా శివునికి అభిషేకం మంచి ఫలితాలని ఇస్తుంది.

మకర రాశి :

ఈ రాశివారికి లగ్నాధిపతి లగ్నంలో ఉండటం వల్ల శుభాధిపత్యమే వచ్చింది. కుటుంబ స్థానాధిపతి కూడా అయినాడు. అకాల భోజనమే తనకంటే తక్కువ వారితో సాంగత్యము పొంది అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు. శుక్రుడు వీరికి తృతీయ మందు ఉండడం తాత్కాలికంగా ఇబ్బంది అయినప్పటికీ వివాహం కానివారికి వివాహాన్ని జరిపించే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా ధైర్యం వహించి ఉండడం చాలా అవసరం. తాత్కా లికంగా రవి చంద్ర కుజులు ఆధిపత్య పాపులై ఉన్నారు. వీళ్లు మేలు జరగాల్సిన చోట జాగ్రత్తలు సూచిస్తున్నారు. మీకంటే ముందే మీ లోపాలోపాలు ప్రజల్లోకి వెళ్లి మీ తాలుకా వ్యక్తిత్వాన్ని కొంచెం తగ్గించేస్తాయి. మీరు అనుకున్నంత అనుకూలంగా ఈ వారం సాగకపోవచ్చు. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది ఫలితాలు మధ్యమంగా ఉన్నాయి. శ్రవణ నక్షత్రం వారికి క్షేమ తార అయింది శుభ ఫలితాలు ఎక్కువగా పొందుతారు. ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు వారికి విపత్తార ఐంది కాబట్టి కొంచెం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

పరిహారం : శివకేశవులకు అభిషేకము శివరాత్రి నాడు జాగరణ మీకుండే దుష్ఫలితాల్ని పోగొడతాయి

కుంభ రాశి :

ఈ రాశి వారికి రవి లగ్నంలో ఉండటమూ స్వక్షేత్ర అధిపతి అయిన శని కూడా ఉండటం వల్ల వీరు అవమానాన్ని ఎక్కువగా ఎదుర్కోవల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులను కూడా పొందుతారు.సంపాదించినది ఖర్చు, అనవసరంగా వ్యయం జరుగుతుంది. వీరికి మాట సహాయం కూడా కరవవుతుంది. ఆర్థిక స్థితిగతులు కూడా ఇబ్బందిని కలిగింప చేస్తున్నాయి. వారాంతంలో ఒక ఆందోళనకరమైన సంఘటనని మీరు చవిచూడవలసి వస్తుంది. ద్వితీయ మందు ఉన్న శుక్రుడు మీకు కొంత మేలు చేసే అవకాశం ఉంది వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ ఆచి తూచి అడుగు వేయండి. మిత్రులు యొక్క సహకారాన్ని తీసుకోండి. ఆలోచన మీదై వుండాలి ఆచరణ వారిదై ఉండాలి. రాశ్యాధిపతి శని ఇంట్లో ఉండటం వల్ల అనారోగ్యాన్ని ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటారు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి విపత్తారైంది ఫలితాలు తక్కువగా ఉన్నవి. శతభిషం వారికి సంపత్ తారైంది కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా పొందుతారు. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి జన్మతారైంది కించిత్ అనారోగ్యం సూచిస్తోంది.

పరిహారం : మీరు శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తే మంచిది సూర్యుడికి నమస్కరించడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

మీన రాశి :

ఈ రాశికి అధిపతి గురుడు స్వక్షేత్రంలో ఉండటం వల్లే కొద్దిపాటి శుభాన్ని పొందుతారు. ఇందులో ఉచ్చ క్షేత్రంలో ఉన్న శుక్రుడు వీరికి మేలే చేయబోతున్నాడు. ఈ వారం వీరికి పూర్తి అనుకూలత అని చెప్పలేం గాని కించిత్ భోగం భవిష్యతి అన్నట్టుగా కొంత సుఖాన్ని కొంత శుభాన్ని అనుభవిస్తారు. వ్యాపారాల్లో వ్యవహారాల్లో నష్టం కనిపిస్తోంది. మీరు ఎందుకైనా మంచిది కోర్టు వ్యవహారాల్లో ముందుకు వెళ్లకండి. తృతీయ అష్టమా ఆధిపత్యం వచ్చిన శుక్రుని వల్ల మీ ఆలోచన మీరు చేసే పనులను వెనుకబాటుతనానికి సూచుస్తున్నాయి. ముందుకి ప్రోత్సహించే టటువంటి వ్యక్తులు లేరు. ఇంట బయట నిరుత్సాహమే. దీనికి తోడు సప్తమాధిపతి రవి వ్యయమందు ఉండటం కూడా మీకు ఆరోగ్య నష్టాన్ని సూచిస్తోంది. శని కుజులు ఇబ్బందిని సూచిస్తున్నారు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి జన్మ తారైంది అనారోగ్య సూచన. ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వారికి పరమమిత్రతార ఐంది శుభ ఫలితాల్ని పొందుతారు. రేవతి వారికి మిత్రతారైంది శుభసూచనలు కనిపిస్తున్నాయి.

పరిహారం : మీరు హయగ్రీవ స్తోత్రం గానీ విష్ణు సహస్రనామ స్తోత్రం గాని చేయడం చాలా మంచిది. శివరాత్రి ఉపవాసం శుభఫలితాన్ని ఇస్తుంది.

Next Story