26-1-2020 ఆదివారం నుండి 01-2-2020 శనివారం వరకు

By Newsmeter.Network  Published on  26 Jan 2020 8:23 AM GMT
26-1-2020 ఆదివారం నుండి 01-2-2020 శనివారం వరకు

మేష రాశి :

ఈరాశి వారికి ఈ వారంలో శుభఫలితాలు కొంచెం కొంచెంగా కలిసి ఒస్తున్నాయి. పంచమ నవమ అధిపతులైన రవి గురులు వీరికి చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నారు. రాశ్యాధిపతి ఐన కుజుడు కూడా మేలు చేస్తాడు. ఈ విధంగా ముగ్గురు యోగ కారకులు గాబట్టి దీని ఫలితంగా వీరికి వివాహ విద్యా వ్యాపార విషయాల్లో బాగా కలిసొస్తుంది. అధికారుల మెప్పు పొందే అవకాశం కూడా ఉంది. ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనంద స్థితికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. మొదటి రెండు రోజులు మీకు పరీక్షా సమయమే అయినా మంగళవారం నుంచి మీకు అనుకూలత ప్రారంభం ఔతుంది. నష్టద్రవ్య లాభం కూడా ఈ వారంలో ఉంది. ధనిష్ట నక్షత్రంలో ఈ వారం ప్రారంభమవుతుంది. అశ్విని వారికి ప్రత్యక్ తార కాబట్టి అనుకూల పరస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. భరణి వారికి క్షేమ తార గాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి. కృత్తిక ఒకటవ పాదం వారికి మాత్రము విపత్తార కాబట్టి ఫలితాలు బాగా తక్కువగా ఉన్నాయి.

పరిహారం : 26 న మాఘ ఆదివారం అలాగే ఫిబ్రవరి ఒకటో తేదీ రధసప్తమి ఈ రెండు రోజుల్లో ఏరోజైనా సూర్య నమస్కారాలు చేయించండి. ఆదిత్య హృదయ పారాయణ మంచి బలాన్ని ఇస్తుంది

వృషభ రాశి :

ఈ రాశివారికి ఇంతవరకు కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కనిపించినా ధైర్యంతో ముందడుగు వేస్తే ఫలితాలు సానుకూలమవుతాయి. శని యోగ కారకుడై అష్టమ స్థానాన్ని విడిచిపెట్టి స్వక్షేత్రాలైన భాగ్య రాజ్యాన్ని పొందుతున్నాడు కాబట్టి వీరికి మంచి కొంచె ఎక్కువ జరిగేది ఉంది. మీ తెలివితేటలు ఉంటే చాలదు. దైవబలం కూడా కావాలి. గురుబలం తక్కువగా ఉంది. పరీక్షా సమయమైతే ఇబ్బంది. స్పెక్యులేషన్లయితే సానుకూల పడే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి.తూర్పు వైపు ప్రయాణం మీకు కలిసొస్తుంది. పిల్లల చదువు ప్రేమ వ్యవహారాలలో దృష్టి పెట్టండి వారిని జాగ్రత్తగా మీ వైపుకు మలుచుకోవడం చాలా అవసరం. ఒక వ్యతిరేకమైన మాట లేదా వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వారికి విపత్తార తో వారప్రారంభం శుభ ఫలితాలు తక్కువ. రోహిణి వారికి సంపత్తారతో వారు ప్రారంభం గనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు ముగిసిన ఒకటి రెండు పాదాలు వారికి జన్మతార అయ్యింది గనుక అనారోగ్య సూచనలు ఉన్నాయి.

పరిహారం : ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ మీరు ఆదివారం నాడు గాని రథసప్తమినాడు గాని సూర్యనమస్కారాలు చేయించండి. ముప్పైవ తేదీ శ్రీ పంచమి ఆ రోజు సరస్వతి సూక్తాన్ని పఠించినా మంచిది.

మిధున రాశి :

ఈ రాశివారికి యోగాలు బాగున్నాయి. మంచి మంచి వార్తలు వింటారు. మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాదు మంచి సంకేతాలు కూడా మీకు వస్తాయి. కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. అయితే యోగ కారకులైన బుధ శుక్రులు శని సంబంధం కలిగి ఉండడం చేత వారు వ్యతిరిక్తంగా ఉండటం చేత మీకు చిన్నచిన్న ఆటంకాలు వారం మధ్యలో ఎదురవుతాయి. కుటుంబ సౌఖ్యము భోజన సౌఖ్యము తక్కువ. శ్రమతో కూడిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే గురుని దృష్టి మీకు మేలు చేయబోతోంది. తల్లి తండ్రుల ఆరోగ్యాన్ని మీరు పరిశీలించవలసి ఉంటుంది. వారిద్దరికీ ఏదో ఒక తీవ్రమైన అనారోగ్యం కలగబోతోంది. అష్టమ శని ప్రభావం చేత మీకు ఉద్యోగంలో వ్యాపారంలో కుటుంబాల్లో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి జన్మతార గాన వ్యతిరేక ఫలితాలున్నాయి. ఆరుద్ర వాళ్లకి పరమ మిత్రతార అయింది కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి మిత్ర తారైంది కాబట్టి చాలా బావుంటుంది.

పరిహారం : సోమవారం నాడు శివుడికి అభిషేకం జరిపించండి. మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించ ఆరోగ్య విషయంలో ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటక రాశి :

ఈవారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మాటల్లో నేర్పరితనంతో మీ పనులు సానుకూల మయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. అలాగే మీరు ఎదురుచూస్తున్న అవకాశం ఈ వారంలో తప్పకుండా దక్కించుకుంటారు. మీకు కుటుంబ వ్యవహారాలు కలిసొస్తాయి. తల్లి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. మీ గురించి ఆలోచించడం చాలా అవసరం అని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఈ రాశివారికి నాలుగు గ్రహాలు అనుకూలించినప్పటికీ మీ మాట్లాడే తీరు వల్ల చిన్నచిన్న ప్రతికూలతలు వస్తాయి ఒక మంచి మిత్రుని ద్వారా ఏదైనా సానుకూల పడే అవకాశం ఉంటుంది. మీ పరిచయాలు పెరుగుతాయి. పునర్వసు నాలుగో పాదం వారికి మిత్ర తారైంది. శుభ ఫలితాలున్నాయొ. పుష్యమి వారికి మాత్రం నైధన తారవల్ల పూర్తి వ్యతిరేక ఫలితాలు. ఆశ్రేష వారికి సాధన తార వల్ల కార్యం సానుకూల పడుతుంది.

పరిహారం : మీరు రవి చంద్రులకు పూజలు జరిపించండి ఆదిత్య హృదయం పఠించండి బావుంటుంది. గురువారం నాడు శ్రీసూక్త పారాయణ చేయండి.

సింహరాశి :

ఈరాశి వారికి ఈ వారంలో శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మెలకువతో నడిస్తేగానీ ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతిని సాధించలేరు అడుగడుగునా ఇబ్బందుల్ని కలుగ జేసే వారు ఎదురవుతూ ఉంటారు. ఇంట్లోని అననుకూలత వృత్తి వ్యాపారాలపై పడుతుంది. నూతన బాధ్యతలు గాని ఆర్థిక ఇబ్బందిగాని మిమ్మల్ని ఇరకాటంలో పడేసాయి పై అధికారుల ఒత్తిడి సకాలంలో ధనం అందకపోవటం జరుగుతుంది. ఇన్నాళ్లు చేసిన శ్రమ వృథా అవుతూ ఎప్పుడు దీన్నించి దూరంగా గడుపుదామా అనంత తీవ్రమైన బాధని పొందుతారు.. మంచి చేయాలనుకున్న చెడు గానే పరిణమిస్తుంది. పాపులతో కూడిన బుధుడు శని శుక్రుడు వీరికి మారకులైఇబ్బందుల్ని కలుగజేస్తున్నారు. భయాందోళనలు కలిగిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇంతవరకూ లేని బీపీ షుగర్ లాంటి వ్యాధులు బయటపడతాయి. మఘా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది గాన ప్రతి కూలంగా ఉంది . పుబ్బా నక్షత్రం వారికి క్షేమ తారైంది గాన సుఖములు ఎక్కువ చేకూరుతాయి. ఉత్తర ఒకటో పాదం వారికి విపత్తార శుభ ఫలితాలు తక్కువ.

పరిహారం : ఆదివారం నాడు రథసప్తమి నాడు సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణ చేయించండి వీలైతే సూర్య నమస్కారాలు కూడా చేయండి .

కన్యా రాశి :

ఈ రాశివారికి ఒకటి అయిదు తొమ్మిది అధిపతులు శుభ ఫలాల్ని ఇస్తున్నారు. అర్థాష్టమ శని పోవడం శని స్వక్షేత్రాన్ని పొంది పంచమ కోణంలో ఉండటం నవమాధి పతి శుక్రుడు కూడా అనుకూలతను శనితో కలిసి ఇవ్వబోతున్నాడు ఇంతవరకూ చూడని శుభ ఫలితాలను ఇప్పుడు వీరు చూసే అవకాశం ఒక్కసారిగా రాబోతున్నది. గురు భక్తితో దైవ అనుకూలం తో ఆత్మ సుత్తితో మీరు ముందుకు సాగిపోయే మార్గాలున్నాయి. ఇరవై తొమ్మిది వ తేదీన ఒక మంచి శుభవార్తను విని అవకాశాలున్నాయి వీరికి రవి పాపి కనుక అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తార అయింది గాన శుభ ఫలితాలు తక్కువ . హస్త వారికి సంపత్తార అయింది గావున ఆకస్మిక ధనలాభం ఉద్యోగ లాభం వుండవచ్చు. చిత్త ఒకట్రెండు పాదాలు వారికి జన్మతార అయింది కాబట్టి ఫలితంగా దేహ తాపం మిగులుతుంది.

పరిహారం: ఈ రాశివారు యోగా చేస్తే మనోనిగ్రహం లభిస్తుంది . గురు అనుగ్రహం కూడా తగ్గింది కాబట్టి గురు స్తోత్రపఠనం లక్ష్మి వారం నాడు చెయ్యండి .

తులారాశి :

ఈ రాశివారికి కుజుడు ఉభయ మారకాధి పతి. కాబట్టి ఈ వారంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఎంత చేసినా నిష్టురం నిందలు తప్పవు. పనిలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఒక వ్యక్తి మీకు మంచిని చేయవచ్చు అలాగే ఒక కటువైన మాటచే మిమ్మల్ని భాధించనూ వచ్చు. రెండు మీరు ఈ వారంలో చవిచూస్తారు. ప్రేమను అభిమానాన్ని ఎంత పొందుతారో బాధను కూడా అంతే పొందాల్సి వస్తుంది. విద్య వివేకం సూటిదనం ఇవి మీకు ఈ రోజుల్లో ప్రతికూలిస్తాయి . గురు చంద్ర బలాలు రెండూ తక్కువగా ఉన్నాయి. వాహన ప్రమాదాన్ని సూచిస్తోంది. శరీరంలో వేడి తాపము ఎక్కువ అవుతాయి చిత్త మూడు నాలుగు పాదాల వారికి జన్మతార అయ్యింది కాబట్టి దేహ తాపం. స్వాతీ నక్షత్రం వారికి పరమమిత్రతార అయింది కాబట్టి మధ్యమ ఫలితాలు ఉంటాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి మిత్రతార అయింది శుభ ఫలితాలను ఎక్కువగా పొందబోతున్నారు

పరిహారం : ఈ రాశివారు మంగళవారం నియమాన్ని పాటించండి ఆంజనేయస్వామికి సుబ్రమణ్యేశ్వర స్వామికి పూజలు చేసినా శుభ ఫలితాలను పొందుతారు .

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి శుభప్రదమైన రోజులు వచ్చాయి. ఏల్నాటి శని పోవడం వల్ల మీకు ఒక్కసారిగా గురు కుజ చంద్ర రవి గ్రహాల బలం బాగా పెరిగింది. గతంలో అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ధనలాభము వస్త్రలాభము ఇలాంటి కోరకుండానే మీకు లాభిస్తాయి వాక్ స్థానానికి అధిపతి అయిన గురుడే మార్గ స్థానాన్ని కూడా దృష్టి పెట్టాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి మీకంటూ ఒక పద్ధతి ఉంది దాన్ని మీరు అలవర్చుకుని నెరవేర్చుకుని ముందుకు సాగిపోతున్నారు. చాలామంది మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకున్న పనులను అనుకున్న సమయానికి అనుకున్న పద్ధతులు నెరవేర్చుకునే అవకాశం ఉంది విశాఖ నాలుగో పాదం వారికి మిత్రతార అయింది గానీ శుభ ఫలితాలు బాగున్నాయి అనూరాధ వారికి కాస్త అశుభ ఫలితాలున్నాయి జ్యేష్ట వారికి సాధన తార అయింది కాబట్టి పనులన్నీ క్రమక్రమంగా నెరవేరనున్నాయి

పరిహారం : మీరు బుధవారం నియమాన్ని పాటిస్తే మంచిది. దేవీ ఖడ్గమాల,లలితా సహస్రనామం పారాయణ శుభ ఫలితాలను ఇస్తాయి .

ధనూ రాశి :

ఈ రాశివారికి రవి గురు చంద్ర కుజులు యోగ్యులై ఉన్నారు కానీ కుజుడు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ప్రతికూలతనే ఇస్తున్నాడు. గురువులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం లేదా యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనను జరుగుతుంది ద్వితీయ తృతీయ స్థానాధిపతి శని అవడము ధన స్థానంలో శని ఉండటం వల్ల వీరికి అధికమైన ఖర్చులు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి ప్రతి పని వెనుక పడుతూనే ఉంటుంది తానొకటి ను అనాలనుకుంటే వేరొక విధంగా మాట్లాడి తన ఇబ్బందుల్ని తానే కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది ఏవైనా కొనాలి అనుకున్న వాయిదా వేస్తే మంచిది ఒక విషయం మాత్రం మిమ్మల్ని ఆనందింప చేయవచ్చు మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార అయింది కాబట్టి ప్రతికూలతే ఎక్కువ. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు క్షేమతార వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మాత్రము విపత్తారైంది కాబట్టి వ్యతి రిక్తంగా ఉన్నది.

పరిహారం: వీరు శనివారం నియమాన్ని పాటించిన వెంకటేశ్వరస్వామిని దర్శించి విష్ణు సహస్రనామ పారాయణ చేసిన మంచిది .

మకర రాశి :

ఈ రాశివారికి ఆధిపత్య శుభులు శని శుక్ర బుధులు. అయినా ఏలినాటి శని ప్రభావం తను స్థానాన్ని ఇబ్బంది పెడుతోంది. మాట కటుత్వం వస్తుంది. మంచికి చెడు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. మీ మాట చెల్లుబాటు కాదు. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది శుక్రుడు ద్వితీయ స్థానానికి వెళ్లడం వల్ల కూడా కొంచెం ప్రతికూలతే ఎక్కువ. ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మీకు శారీరకంగా చాలా ఇబ్బందులు కలిగే అవకాశం. జన్మస్థానం లో రవి కూడా మీకు ఇప్పటికే అనారోగ్యాన్ని తెలియజేశాడు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆర్థిక ఇబ్బంది కూడా ఉంది. కుటుంబ వ్యవహారాలు కూడా కలతలకు తావున్నది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. శ్రవణం వారికి సంపత్తార అయింది గనుక శుభ ఫలితాలు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి జన్మతార అనారో గ్య సూచన.

పరిహారం : శనికి జపం చేయించండి. శనివార మంగళవార నియమాన్ని పాటించండ. నల్లని నువ్వులు నల్లని వస్త్రం దానం చేయడం మంచిది.

కుంభ రాశి :

ఈ రాశివారికి ప్రతికూల దినాలు వచ్చాయి అనే చెప్పాలి. సాధారణంగా మేలు చేసే గ్రహాలు కూడా ప్రస్తుతం ప్రతికూలంగా మారాయి. వ్యయ శని లేనిపోని ఖర్చులని లేనిపోని నిందారోపణలని కలిగిస్తాడు. గురు బలము తగ్గింది కాబట్టి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీపై ప్రతి ఒక్కరూ ఆధిపత్యాన్ని పొందుతారు క్రమక్రమంగా మీరు వెనక్కి తగ్గుతున్నట్లు అవుతుంది ఒక్కసారిగా ప్రతికూలత ప్రారంభమై మీరు తట్టుకోలేని స్థితిలో ఉన్నారు. కాని మీకు మీ మాట కోసం ఎదురు చూసే వ్యక్తులు మాత్రం మీకు మేలు చేసి మిమ్మల్ని మంచిగా చూస్తారు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి దేహ తాపం తప్పదు శతభిషం వారికి పరమమిత్రతార అయింది కాబట్టి బానే ఉంటుంది పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి మిత్ర తయారైంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి .

పరిహారం : శనికి జపం చ చేయించండి. నల్లని వస్త్రాన్ని ధరించిన అయ్యప్పస్వామి పూజ చేసినా మీకు శుభ ఫలితాలు ఉంటాయి.

మీన రాశి :

ఈ రాశివారికి ఈ వారంలో కొద్దిపాటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అనారోగ్య సూచనలైతే ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించకపోవచ్చు. కానీ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మంచి మాటని వింటారు. ఉద్యోగంలో గాని వృత్తులలో గాని సమస్యలున్నాయి. నిరుద్యోగులైతే మాత్రం ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో తృణధాన్యాలయితే మాత్రమే లాభం చేకూరుస్తుంది. కుజుడు మీకు మేలు చేయనున్నాడు. అంటే శత్రువు కూడా మీకు అంతో ఇంతో మేలు చేసే అవకాశం ఉంది. ఒక మంచి లాభాన్ని ఈ వారంలో పొందుతారు ఆవేశపడకుండా నిదానించి వెళితే ఆరోగ్యం బాగుంటుంది స్పందన లెక్కువ కాబట్టి శారీరికంగా మానసికంగా ధైర్యాన్ని వహించండి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి మిత్రతార అయింది కాబట్టి శుభ ఫలితాలు ఉంటాయి . ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు నైధన తారతో వార ప్రారంభం కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువ. రేవతి వారికి సాధన తారతో వారు ప్రారంభం కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి .మంచి జరుగుతుంది

పరిహారం : ఈ రాశివారు శుక్రవారం నియమాన్ని పాటించి శ్రీసూక్త పారాయణ లక్ష్మీదేవి పూజ చేయండి. ఖడ్గమాల లలిత సహస్రనామ పారాయణ శుభఫలితాలని ఇస్తాయి.

Next Story