యూపీ బీజేపీ ఎమ్మెల్యే పై రేప్ కేసు నమోదు

By Newsmeter.Network  Published on  19 Feb 2020 2:40 PM GMT
యూపీ బీజేపీ ఎమ్మెల్యే పై రేప్ కేసు నమోదు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే పై అత్యాచార కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌‌లోని బదోహి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ త్రిపాఠి, ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. రవీంద్ర నాథ్ త్రిపాఠి, ఆయన ఆరుగురు సహచరులూ కలిసి 2017లో తనను నెల రోజులపాటు ఓ నిర్భందించారని, ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని భాదిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో తాను గర్భవతిని కావడంతో బలవంతంగా ఆబార్షన్ చేయించారని కూడా ఆమె ఆరోపించింది. ఈ నెల 10నే ఆమె ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ రామ్ బదన్‌సింగ్ తెలిపారు. ఆమె ఫిర్యాదుతో ఎమ్మెల్యే సహా ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు చెప్పిన ఎస్పీ.. బాధిత మహిళ స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు తెలిపారు.

కాగా.. ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, స్వామి చిన్మయానంద అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెంగార్ ఇప్పటికే దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Next Story
Share it