తాడేపల్లి : స్వార్ధ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేపట్టాడని ఆరోపించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య. మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజల మధ్దతు చంద్రబాబుకు లేదన్నారు. ఒంటరిగా ఎన్నికలకు ఎనాడు చంద్రబాబు పోలేదని, ఆయనకు ఆ సత్తా లేదని విమర్శించారు. రాజధానిపై చంద్రబాబు చెప్పినట్లు చేయాలనే రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. చంద్రబాబు చేసేవన్నీ తుగ్లక్ పనులేనన్నారు. రాత్రికి రాత్రి హైద్రాబాద్ ను వదలివచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబూ ద్వందనీతిని వదలిపెట్టాలని సూచించారు. అదికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు ఇంకొకలా వ్యవహారించడం తగదన్నారు.

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృధ్ది చెందాలని మా పార్టీ మొదటి నుంచి చెబుతోందని, నిపుణుల కమిటి ప్రకారమే వికేంద్రీకరణ నిర్ణయం జరిగిందన్నారు. లోకేష్ ఓటమిని రిఫరెండంగా తీసుకోవాలన్నారు. చంద్రబాబు ఖచ్చింతంగా జైలు వెలుతారని, బీజేపీలోకి నలుగురు ఎంపీలను పంపినా.. జైలు వెళ్లడం ఖాయమన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ నేరమని, అది ఖచ్చితంగా ప్రూవ్ అవుతుందని చెప్పారు.

చంద్రబాబు జిమ్మిక్కులు, గిమ్మిక్కులు కేంద్రానికి తెలుసని, చంద్రబాబు చచ్చినపాము, దానిని కొట్టాల్సిన అవసరంలేదన్నారు. టిడిపి వెంటిలేటర్ పై ఉందని, ఐదేళ్లపాలనలో చంద్రబాబు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. తనను కాపాడుకునేందుకు రైతులను కవచంగా వాడుకుని రక్షణ పొందాలని చంద్రబాబు చూస్తున్నాడు తెలిపారు. రాజధాని విషయంలోపార్లమెంట్ లో ఇచ్చిన రిప్లై కంటే ఇంకేం క్లారిటి పవన్‌ కావాలని ప్రశ్నించారు. రైతులకు, ప్రజలకు అన్యాయం జరగదని, వారికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని తెలిపారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.