కరోనా వైరస్‌.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 400 మందికి పైగా మరణించారు. కరోనా సోకకుండా అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకుంటుండగా.. ప్రస్తుతం ఈ వైరస్‌ కు మందును కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అందరూ చైనా వెళ్లేందుకు భయపడుతుంటే ఓ బాలీవుడ్‌ నటి మాత్రం అక్కడకి వెళ్లిందట. అంతేకాదండోయ్‌ కరోనా వైరస్‌ ను అంతం చేస్తానంటోంది. వైరస్ అంతం చేసాకనే తిరిగి వస్తానని శపథం చేస్తోంది.

బాలీవుడ్ బామ రాఖీ సావంత్.. ప్రస్తుతం చైనాలో ఉందట. ఆమె తన స్నేహితుడితో కలిసి చైనా వెళ్లిందట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు చేసింది అమ్మడు. ‘ మోదీజీ.. నేను చైనా వెళ్తున్నాను. మహమ్మారి కరోనా వైరస్‌ను అంతమొందించి వస్తాను. కరోనా వైరస్‌ తగ్గించేందుకు నాసా నుంచి మందులు తీసుకొచ్చాను. నేను క్షేమంగా చైనా నుంచి తిరిగి రావాలని ప్రార్థించండి’అని అంటూ ఆ వీడియోలో పేర్కొంది.

ఎవ్వరికీ హాని తలపెట్టకుండా, మంచి పనులు చేస్తూ ఉంటే ఇలాంటి వైరస్ బారిన పడమని, ఒకప్పుడు చైనా వాళ్లు జీసెస్‌ని హిందూ దేవుళ్లను నోటికొచ్చినట్లు మాట్లాడారు కాబట్టే.. వారికి కరోనా వైరస్ సోకిందంటూ అమ్మడు వివాదాస్నద వ్యాఖ్యలు చేసింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.