ఎన్టీఆర్ కోసం చరణ్ కి అన్యాయం చేస్తారా !

By రాణి  Published on  23 Jan 2020 1:40 PM GMT
ఎన్టీఆర్ కోసం చరణ్ కి అన్యాయం చేస్తారా !

జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. అయితే ఈ సినిమాలో చరణ్ పాత్రను తగ్గించాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడట రాజమౌళి. మొదట 2 గంటల 50 నిముషాలు ఉండేలా సినిమాను ప్లాన్ చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం ఒక ఇరవై నిమిషాలు పాటు తగ్గించాలకుంటున్నాడట. ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చాయని, దాంతో ఎన్టీఆర్ సీన్స్ తీసేయడానికి జక్కన్న ఇష్టపడట్లేదట. పైగా ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా తారక్ సినిమాలో బాగా హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నాడట. ఇక తప్పనిసరి పరిస్తతుల్లో చరణ్ సీన్స్ లో కొన్ని సీన్స్ ను తీసేయనున్నారు. దీంతో చరణ్ పాత్ర సినిమాలో ప్రేక్షక పాత్రగా మిగిలిపోతుందేమోనని భయం పట్టుకుంది మెగా సన్నిహితుల్లో. మొత్తానికి ఎన్టీఆర్ కోసం చరణ్ కి అన్యాయం చేస్తారా.. అని మెగా సన్నిహితులు పెదవి విరుస్తున్నారు. మరి చిరవికి రాజమౌళి ఏమి చేస్తాడో చూడాలి.

అన్నట్టు ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా విదేశీ భామను ఫైనల్ చేసి షూట్ కూడా చేసిన రాజమౌళి రెండో హీరోయిన్ ను కూడా త్వరలో పరిచయం చేయనున్నాడు. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో డైలాగ్ లు అద్భుతంగా ఉంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా ఉంటాయట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా 'బాహుబలి' తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీల నుండి ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it