ఎన్టీఆర్ కోసం రాజమౌళి క్రేజీ ప్లాన్ !    

By Newsmeter.Network  Published on  30 Jan 2020 2:56 PM GMT
ఎన్టీఆర్ కోసం రాజమౌళి క్రేజీ ప్లాన్ !    

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో 'ఎన్టీఆర్ - రామ్ చరణ్' హీరోలుగా రాబోతున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. అలాగే ఎన్టీఆర్ సీన్స్ అన్ని అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఈ విషయాన్ని ఈ సినిమాలో ఒక పాత్రలో నటిస్తోన్న 'ఛత్రపతి శేఖర్' తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఎన్టీఆర్ ను హైలైట్ చెయ్యటానికి రాజమౌళి క్రేజీగానే ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట.

అలాగే ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా శ్రీయా శరణ్ నటిస్తున్నారట. అజయ్ దేవగణ్ పాత్రకు జంటగా శ్రీయా శరణ్ ని తీసుకున్నారని సమాచారం. కొద్దిరోజుల క్రితం మొదలైన తాజా షెడ్యూల్ లో ఆమె పాల్గొనడం కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో శ్రీయా శరణ్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అన్నట్టు ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ తాలూకు విజువల్ ఒకటి రీసెంట్ గా బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ పోరాట సన్నివేశం సినిమాలోని కీలకమైన అంశాల్లో ఒకటట. ఎంతో ప్రయాసతో దీన్ని తెరకెక్కించారు టీమ్. అలాంటిది ఫైట్లో తారక్ లుక్ బయటికి లీక్ కావడంతో టీమ్ వెంటనే అప్రమత్తమైంది. ఇక నుండి ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇక ఈ సినిమాలో డైలాగ్ లు అద్భుతంగా ఉంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా ఉంటాయట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా 'బాహుబలి' తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీల నుండి ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it