రానున్న 24 గంటల్లో కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడతాయి. ఈ ఉపరితల ద్రోణి పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా కోస్తా వరకూ కొనసాగుతోందని పేర్కొంది. అలాగే రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

అసలు వేసవి ప్రారంభం అవ్వకముందే...ఎండలు భగ్గుమంటున్నాయి. రథ సప్తమి దాటితే ఎండతీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారుల అంచనా. సీమలో అయితే ఎండల ధాటికి తట్టుకోలేక చాలావరకూ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే...రాబోయే రోజుల్లో ఎండలు ఇంకెలా కాస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు పడితే..ఎండలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

రాణి యార్లగడ్డ

Next Story