హై అలర్ట్‌: హైదరాబాద్‌లో మూడు గంటల్లో భారీ వర్షం.!

By సుభాష్  Published on  17 Sep 2020 1:51 PM GMT
హై అలర్ట్‌: హైదరాబాద్‌లో మూడు గంటల్లో భారీ వర్షం.!

రానున్నమూడు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ బృందాలతో పాటు అన్ని విభాగాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ అప్రమత్తం చేశారు. గురువారం రాత్రి 3 నుంచి 4 గంటల పాటు అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఎవరు కూడా తమ తమ ఇళ్లల్లోంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసరం వస్తే జీహెచ్‌ఎంసీ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 040-21111111, 040-29555500 సంప్రదించాలని లోకేష్‌ కుమార్ సూచించారు.

కాగా, బుధవారం రాత్రి 2 గంటల్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదైందంటే ఏ మేరకు వర్షం కురిసిందో అర్థమైపోతోంది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని రోడ్లన్ని కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారిపోయాయి. కొందరు వాహనదారులు నీటిలో చిక్కుకుని నానా అవస్థలకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు కుంగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Next Story