వార ఫలాలు: తేదీ 27- 9-2020 ఆదివారం నుండి 3-10-2020 శనివారం వరకు

By సుభాష్  Published on  27 Sep 2020 4:59 AM GMT
వార ఫలాలు: తేదీ 27- 9-2020 ఆదివారం నుండి 3-10-2020 శనివారం వరకు

మేష రాశి :- ఈ రాశి వారికి ధనలాభము సౌఖ్యము బంధు దర్శనం ఇవి ఆనందాన్ని కలిగించి ఉత్సాహంగా ఈ వారమంతా చక్కగా నడిపిస్తాయి. రవి వల్ల మీకు శత్రు భావ నాశనం జరుగుతుంది. మంగళ బుధవారాల్లో ఆదాయం తగ్గినా చక్కనైన స్థితి గతి కలిగే చంద్రుడు మిమ్మల్ని చాలా మానసిక ఉత్సాహానికి తీసుకెళ్తాడు. లగ్నంలో కుజుడు కొంత విషాదాన్ని కలిగిస్తున్నాడు. కానీ బుధ గురు శుక్రులు ధనలాభం స్త్రీ సౌఖ్యాన్ని చేకూరుస్తున్నారు. కాబట్టి కష్టాల నుంచి బయటకు వచ్చి ఆనందాన్ని పొందుతారు. ఇతః పూర్వం కంటే మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. పదవ ఇంట్లో ఉన్న శని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు మాత్రం చిక్కలు కలుగజేస్తాడు. ద్వితీయ మందున్న రాహువు అకారణ కలహాన్ని, కేతువు విలువైన వస్తువులను మర్చిపోవడం వాటికి కారకులవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 62శాతం శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి శుభ పరంపరలను పొందగలుగుతారు. భరణి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి కించిత్తు కష్టాన్ని అనుభవించక తప్పదు. కృత్తిక ఒకటో పాదం వారికి ఆర్థిక వనరులు సమకూరుతాయి.

పరిహారం :- రాహు కేతువులు జపం చేయండి, లేదా సర్ప సూక్తం పారాయణ చేయించండి. శనికి జపం చేయండి. దత్తాత్రేయ చరిత్ర పారాయణ మంచి ఫలితాన్నిస్తుంది.

వృషభ రాశి :- ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యం అలంకార ప్రాప్తి స్త్రీ సౌఖ్యం ఈ మూడు చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ చంద్రుడు మానసిక ఒత్తిడులకు గురి చేస్తున్నాడు. కుజుడు కూడా కష్టం. గురు ధనం వ్యయాన్ని సూచిస్తున్నాడు. స్వయం శక్తి చేత మీ స్వీయ ఆలోచన చేత మీరు ఈ వారంలో చాలా పనులను నెరవేర్చుకోవాల్సి వస్తుంది. లగ్న సప్తమం లో ఉన్న రాహు కేతువులు మీకు భయాన్ని శతృ వృద్ధిని కలిగిస్తున్నారు కాబట్టి మీరు ఎంత ధైర్యం వహించిన అవి మీ మనసుపై పనిచేసి మీకు భయాన్ని ఎక్కువగా కలుగజేస్తారు. శని అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఎందుకంటే శని శత్రువైన చంద్రునితో కలిసినప్పుడు కొంచెం మనోధైర్యం తగ్గుతుంది. అటువంటప్పుడే మీకు అనారోగ్యం కూడా చేకూరే అవకాశం ఉంది. అంతే కాదు శనికి చంద్రుడు శత్రువు కూడా కావడం వల్ల అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ వారంలో 38 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. మృగశిర 1 2 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి చాలా బాగుంది అని చెప్పచ్చు.

పరిహారం :- రాహు కేతువులకు జపాలు చేయించండి. వెండి సర్పం చేయించి పెరుగులో వేసి దానం చేయండి. సర్ప సూక్త పారాయణ చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ శుభ ఫలితాలను ఇస్తుంది.

మిధున రాశి :- ఈ రాశి వారికి లాభము సౌఖ్యము సుఖ జీవితం ఇవి ఒకింత ఆనందాన్ని కలుగ చేస్తూ ఉత్సాహాన్ని ఇస్తాయి. చతుర్థ మందున్న రవి అగౌరవం కలిగిస్తాడు. లాభంలో ఉన్న కుజుడు వీరికి విశేష ధనాన్ని కలిగిస్తాడు. పంచమంలో ఉన్న బుధుడు వీరికి ఉన్న సౌకర్యాల్ని ధనాన్ని కూడా హరించేస్తాడు. గురు శుక్ర ప్రభావం మాత్రం వీరికి చాలా బాగుంది కాబట్టి వారాంతంలో విశేష ధన లాభం, విశేష సౌఖ్యాన్ని స్థిర ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. ఎనిమిదవ ఇంట్లో శని ప్రభావం వీరికి అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ చంద్రుడితో కలిసినప్పుడు మాత్రం మృత్యు భయం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఒక్కసారిగా దైవం అనుకూలించి మీ ఆలోచన విధానం మారిపోతుంది. అంటే నిరంతరం దేవాలయానికి వెళ్ళి పూజలు చేయడం లాంటివి వీరికి అలవాటు అయిఉంటే నడవడిలో కొంత మార్పు వస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. కొన్ని పరిష్కారం కాని పనులు ఈ వారంలో నెరవేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైనా కొత్తగా కూడా నెరవేర్చుకునే శక్తిసామర్థ్యాలు మాత్రం వస్తాయి. మానసిక ఆందోళన విపరీతం తప్పదు. ఈ వారంలో వీరు 54 శాతం మాత్రమే శుభ ఫలితాలను పొందగలిగిన అవకాశం ఉంది. మృగశిర 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మిత్రతార అయింది చాలా విశేష ఫలితాలు ఈ వారం లో పొందుతారు. పునర్వసు 1 2 3 పాదాలు వారికి మాత్రము నైధనతార అయింది కాబట్టి పూర్తి వ్యతిరేక ఫలితాలు కలగబోతున్నాయి.

పరిహారం :- శనికి జపం చేయించండి. నువ్వులు నువ్వులు నూనె నల్లని వస్త్రములు దానం చేయండి. పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతము శుభఫలితాలనిస్తుంది.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి సంపదలు సంతోషాలు శత్రువులపై విజయం సౌఖ్యము అన్ని ఒకదానికి ఒకటి తోడై ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ వారంలో మీరు ఎప్పుడు పొందనంత శుభ శోభన ఫలితాలను పొందగలుగుతున్నారు. ఎన్నడూ లేనిది 62 శాతం శుభ ఫలితాలు మీరు ఈ వారంలో పొందగలిగే అవకాశం కల్పిస్తోంది. మీకు క్రమంగా మంచి రోజులు ఒక విధంగా వస్తున్నాయని చెప్పడానికి అవకాశం కలిగింది. ఎప్పటి నుంచో వాయిదా ఉన్నటువంటి పనులను కూడా నెరవేరుతాయి. వివాహ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చక్కనైన ప్రయత్నాలు చేయండి. ఇతరులు ఏ పనులు వాయిదా వేసుకుంటూ పోయారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇది చేసేద్దాం అనే స్థితి కూడా మీకు ఇవాళ ఉంది. మీ తాలూకా చర స్థిర ఆస్తులు కూడా మీకు లభిస్తాయి. శత్రువులుగా వున్నవాళ్ళు కూడా అది తొలగిపోయి మైత్రీ భావనతో వుంటారు. ఆకస్మిక మైనటువంటి ఖర్చులు మీకు ఈ వారంలో పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో ముందుకు సాగండి. పునర్వసు నాలుగో పాదం వారికి నైధనతార అయింది కాబట్టి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి పుష్యమి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి మంచి ఫలితాలు పొందగలరు , ఆశ్లేష నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి కొద్దిగావ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారం :- తల్లిదండ్రులకు సేవ, గురు స్తోత్ర పారాయణ , గురువారం నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం మంచి ఫలితాలను ఇస్తాయి.

సింహ రాశి :- ఈ రాశి వారికి క్రమక్రమంగా సంపద విశేషాలు లాభము ఉత్సాహము పెరుగుతూ వస్తున్నాయి. రవి చంద్రుల ప్రభావం చేత అలజడి మానసిక ఆందోళన అనారోగ్య సూచనలు ఇవి ఎక్కువగా ఉన్నాయి. కుజ బుధ ప్రభావము కొంత మతిమరుపు కలుగుతుంది. అలాగే ప్రమాదాలు సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం. మీ మాటకు ఇప్పుడు వ్యతిరేక భావాలు వ్యతిరేక అర్ధాలు తీసుకుని వర్గం తయారైంది అంటే ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. ఒకప్పుడు మీ మాటకు తిరుగు లేదు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం మీకు చాలా ఉపయుక్తంగా మార్పు కలుగుతుంది. తర్వాత ప్రతి క్షణం కూడా మీకు ఇంటా బయట వ్యతిరేకంగా పని చేసే వాళ్లే మాట్లాడే వాళ్లే ఫలితాలనిచ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. శని అనుకూలత వల్ల విశేష ధనం సంపాదించుకునే తత్వం, మీలో మొండి పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపించేస్తుంది. కానీ విశేష ధన వ్యయం, అవమానము ఈ రెండింటినీ తట్టుకొని మీరు నిలబడే ప్రయత్నం చేయండి. మీకు ఈ వారంలో 46 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. అందుకే హెచ్చరిక కూడా చెబుతున్నాను. మఖా నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఉత్తర 1వ పాదం వారికి సంపత్తార అయింది కాబట్టి మంచి ఫలితాలు చాలా బాగా పొందగలుగుతారు.

పరిహారం :- విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మంగళవారం నాడు నానబెట్టిన పెసలు బుధవారం నాడు ఉదయం బెల్లం వేసి ఆవుకి తినిపించండి. సత్యనారాయణ వ్రతం చేయండి

కన్యారాశి :- ఈ రాశివారికి ఉత్సాహము ధనలాభము వీరిని ముందుకు నడిపిస్తుంది. కొత్త వస్తువుని కొనుక్కునే అవకాశం, సర్వసౌఖ్యాలు కూడా పొందగలుగుతారు. మానసికంగా శారీరకంగా ఆనందాన్ని సంతృప్తిని పొందుతారు, రవి చంద్రుల ప్రభావం చేత అనారోగ్యము, ప్రమాదం కూడా ఉంటాయి, ఏదైనా పని చేసేటప్పుడు అతి జాగ్రత్తగా చాలా అవసరం చెప్పొచ్చు. మతిమరుపు వల్ల కొంత ధనాన్ని గాని విలువైన వస్తువులు గాని పోగొట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. మీరు తలుచుకున్న అన్ని పనులూ అయిపో తాయని మాత్రం ఎప్పుడు మీరు అనుకోవద్దు. ఇతరులకు సలహాలు ఇవ్వడం తగ్గినట్లయితే మీకు చాలా మంచిది. ఈ వారంలో మీకు 46 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రతి పనిలో మీరు ముందుకు అడుగు వేస్తే మీ మనస్సు వెనకడుగు వేస్తుంది. ఇది ఎందుకు అని మీరు నిర్ణయించుకోలేక ఆ కాలం దుర్వినియోగం అయిపోతుంది కాబట్టి శాశ్వతమైన పథకాలు మీరు వేసుకుంటే ప్రయత్నాలు చేసుకుంటే మంచిఫలితం లభించక తప్పదు. ఉత్తర 2 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది విశేషం లాభం ఉంది. హస్త నక్షత్ర జాతకులకు జన్మతార అయింది సాహసంతో మీ పనులను పూర్తిచేస్తారు. చిత్త 1 2 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి శుభఫలితాలను పొందగలుగుతారు.

పరిహారం :- ప్రతిరోజు సూర్యోదయాన్ని చూసే ప్రయత్నం చేయండి అలాగే పౌర్ణమి నాడు చంద్రునితో ఎదురుగా కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయండి.

తులా రాశి :- ఈ రాశి వారికి విశేష ధనము సంతోషము ముందుకు నడిపిస్తాయి. ఏదేమైనా వీళ్ళకి గడ్డురోజులు సంప్రాప్తము అయిపోయాయి. అర్థాష్టమ శని ప్రభావము వీరిపైన విశేషంగా కనిపిస్తోంది. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శని తన ప్రభావాన్ని విపరీతంగా చూపిస్తాడు. చంద్రుడు ప్రతి పనికి తనంతతానుగా వాయిదాలు వేసుకునే పరిస్థితి. ఏ పనిచేయడానికి ఉత్సాహం ముందుకు రాదు. మీరు బాగా చేసే పని ఏంటంటే ఇతరుల మీద నిందలు వేయడం. అలా వేసి ఆటంకాలు కల్పించుకుని పక్కకి తప్పుకుంటారు. కుజ బుధ గురు ప్రభావము ఎక్కువగా ఉండి అన్నిటికి ఆటంకాలు అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక శుక్రుడు మాత్రం అనుకూలంగా ఉండటం చేత ఇంట్లో పనులు చాలా సరదాగా సంతోషంగా చేసుకోగలుగుతారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. అకారణం అయినటువంటి కలహాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఎంత వీలైతే అంత జాగ్రత్తగా మాట పట్టింపు లేకుండా వ్యవహరించడం చాలా అవసరం. ప్రతి పని మీకు అనుకూలంగా లేదు కనుక మీరు నూతన వ్యాపార విషయాలు గానీ కోర్టు విషయాలు గానీ ఇతరులకు సలహాలు ఇవ్వడం లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు గాని వాయిదా వేయండి. మీకు 30 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. వచ్చే వారిలో పెరిగే అవకాశం కనిపిస్తోంది కనుక మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చిత్త 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలంగా ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు మిత్ర తారయింది పూర్తి శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు. విశాఖ 1 2 3 పాదాలు వారికి నైధన తార అయింది కాబట్టి ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి.

పరిహారం :- మంగళవారం నియమాలు పాటించండి హనుమాన్ చాలీసా హనుమాన్ బడబానల స్తోత్రం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ మంచి ఫలితాన్నిస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి స్థిరాస్తి ఇవన్నీ కూడా ఈ వారంలో సాధించుకున్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుఖసంతోషాలు కూడా మీరు ఊహించనంత గా పొందుతారు అయితే మీకు శత్రువులు కూడా అలాగే పెరుగుతున్నారు ఆదాయానికి తగినట్లుగా కూడా మీకు పెరుగుతూనే ఉంది దీనికి మీరు జరిగే పరిస్థితి లేదు. బుధుడు మూలంగా లేకపోతే నన్ను కూడా కొంచెం వాయిదా పడుతూ ఉంటాయి కానీ ధైర్య సాహసాలతో ముందుకు వెళితే గురువు అనుగ్రహం పొందగలిగితే మీరు దాన్ని చక్కగా మార్చుకోగలరు. ఎన్నాళ్ళనుంచో మీరు పడుతున్న ఇబ్బందులను కూడా శని ప్రభావం చేత అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన ఫలితాలను క్రమక్రమంగా పొందగలుగుతారు చీర చాలా ఆశలు పెట్టుకుంటారు ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా శని ఒక్కరు గురు ప్రభావం చేత మీకు అన్ని సమకూరితే అవకాశం కనిపిస్తోంది ఇవాళ మీకు 62% శుభఫలితాలు కనిపిస్తాయి. కొత్త పనులు ఏవి చేపట్టాలని కూడా మంచి రోజు చూసుకుని ప్రారంభించండి వారాంతాల్లో కాకుండా వారు మధ్యలో చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఆరోగ్య సూచనలు ఉన్నాయి జాగ్రత్త.. విశాఖ 4వ పాదం వారికి నైధనతార అయింది కాబట్టి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు సాధన తార ఇది చాలా మంచి ఫలితాలు పొందుతున్నారు. జ్యేష్ట నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి ఆర్థిక, ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం నిత్యము శివాభిషేకం చేయండి. సహస్రనామ పారాయణ, గాయత్రి రామాయణం పారాయణ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ధను రాశి :- ఈ రాశి వారికి కార్య జయము ధనలాభము ఆనందము ఇవి వీరిని కాస్త మంచి మార్గంలో కి తీసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్ర ప్రభావం చేత వీరికి అనారోగ్యం ధన వ్యయము కార్య ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వీరికి ఎప్పుడు శత్రువుల భయం వెన్నంటి ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఈ వారంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రాహు కేతువుల అనుకూలత వల్ల స్థానచలనం ఉంది అంటే మీ వ్యాపారం గాని ఉద్యోగం లో గాని మార్పులు చోటుచేసుకుంటున్నాయి ఇవి మంచి రోజుల్లో ప్రారంభించుకోండి. ధన స్థానం లో శని ప్రభావం చేత పనులను వాయిదా వేయవలసి వస్తుంది. మీకు ఎదురు తిరిగే వాళ్ళు సమాజంలో ఎక్కువగా ఉన్నారు. పోరాడి మీరు ఏమీ చేయలేరు. తగ్గి ఉండటం లో శుభ ఫలితాలను పొందే అవకాశంలేకపోయినా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. మీకు ఈ వారంలో 54% శుభ ఫలితాలు ఉన్నాయి. మూల నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి సత్ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి సంపత్తార ఆర్థిక ధనలాభము ఉంది.

పరిహారం :- శని గ్రహానికి జపము నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రములు దానం చేయండి, ప్రతిరోజు రుద్రాభిషేకము రుద్ర పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.

మకర రాశి :- ఈ రాశివారికి ధనలాభము స్థిరాస్తి కాస్త ఊరటను ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే వీరికి గృహము, గ్రహముల ప్రతికూలతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బుధుడు, వారాంతాల్లో శుక్రుడు మీకు అనుకూలంగా కల్పిస్తారు తప్ప మీకు అన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి. ఇది మీకు మరింత ఆందోళనకు గురి చేస్తాయి. శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారిగా మిమ్మల్ని చుట్టుముట్టి మీకు ఎటు వెళ్లలేని కదలలేని పద్మవ్యూహంలో పడేసినట్లు గా అయిపోతుంది. మీరు ఎంత నిలదొక్కుకున్న మీకు ఈ వారంలో విషవలయంలో సాలెగూడులో చిక్కుకున్నట్టు ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. జన్మశని ప్రభావం తో పాటు రవి ప్రభావం కూడా మీకు కష్టాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. వీరు ఈ వారంలో 30 శాతం మాత్రమే శుభఫలితాలను పొందగలుగుతారు. అంచేత హెచ్చరికగా మీరు భావించి జాగ్రత్త వహించండి ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి సంపత్ తార అయింది కాబట్టి ఆర్ధిక స్థితిగతులు మెరుగు పడతాయి. శ్రవణా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది అనారోగ్య సూచన ఉంది. ధనిష్ట 1 2 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి శుభఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- రోజు రుద్రాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది. శని కి జపం, నల్లని వస్త్రం బ్రాహ్మణ సమారాధన మంచి ఫలితాలనిస్తాయి.

కుంభరాశి: ఈ రాశి వారికి ధన లాభం మాత్రమే కనిపిస్తోంది. చంద్ర కుజ గురువులు ఈ ముగ్గురు వీరికి అనుకూలంగా ఉన్నారు. చంద్రుడు కూడా వారం మధ్యలో ఇబ్బందులే కలిగిస్తాడు. రవి శనులు ఇద్దరూ కూడా ఆర్థిక స్థితులను ఆరోగ్య విషయాన్ని అతలాకుతలం చేసి పడేస్తారు. ఏది పట్టుకున్న ఏది ముట్టుకున్నా అది నష్టానికి దారి తీస్తూ కష్టాన్ని కలిగిస్తుంది. ఈ వారంలో మీరు అవమానాల పాలై గౌరవాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. శత్రువు ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ప్రతి పనిని ఆచితూచి అడుగు వేస్తే చాలా చక్కగా జరుగుతాయి. ఒకటే లక్ష్యం పెట్టుకోండి. పనులు జరగకపోయినా కష్టం రాకూడదు. మాట చెల్లక పోయినా అవమానం పాలు కాకూడదు. ఎందుకీ హెచ్చరికలు అంటే ఈ వారంలో మీకు 30% మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి అది గుర్తించండి. ధనిష్ట 3 4 పాదాలు వారికి పరమమిత్ర తార అయింది అనుకూల వాతావరణం ఉంది. శతభిషా నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది చాలా శుభ ఫలితాలు పొందగలుగుతారు. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి మాత్రం నైధన తార అయింది కాబట్టి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం:- నవ గ్రహాలకు జపం చేయించండి ప్రతిరోజు నవగ్రహ దర్శనం నవగ్రహ స్తోత్రం రుద్ర దర్శనం రుద్ర తీర్థం మంచి ఫలితాలను ఇస్తాయి.

మీన రాశి :- ఈ రాశి వారికి మనసులో అనుకున్న కోరికలు లాభము బంధుమిత్రులు దర్శనం ఆనందాన్ని కలిగిస్తాయి. రవి ప్రభావం వీరి మీద ఉండటం చేత ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏవైనా విలువైన వ్యక్తుల్ని దూరంగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రభావం చేత ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారిగా చుట్టుముట్టే స్థాయి. గురుడు శ్రమకు తగిన ఫలితం లేకుండా చేస్తే శుక్ర ప్రభావము అపకీర్తిని కలిగిస్తున్నది. అయితే వీరికి శని మాత్రం పూర్తి అనుకూలంగా ఉండి విశేష ధనాన్ని ఇస్తాడు. దానికి తోడు రాహువు సంపదలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. ఈ రెండిటి అనుకూలతలు మీకు వినియోగించుకుంటే మాత్రమే లాభాల్ని పొందగలుగుతారు. ధన ఆదాయం బాగుంది అన్నప్పుడు దాన్ని దగ్గర ఉంచుకోకుండా స్థిరంగా నికర ఆదాయం గా మార్చి పెట్టండి. చర ఆదాయంగా ఉంచుతున్నట్లు ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మీకు ఈ వారంలో 46 శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు. పూర్వాభాద్ర 4వ పాదం వారికి నైధనతార అయింది కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సాధన తార అయింది అన్ని పనులు నెరవేరుతాయి. రేవతీ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- శుక్రుడికి జపం చేయించండి. దత్తాత్రేయ, మేధా దక్షిణామూర్తి జపము స్తోత్రము పారాయణ విశేష ఫలితాన్ని ఇస్తాయి.

Next Story