మున్సిపల్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా

By Newsmeter.Network  Published on  3 Jan 2020 3:37 PM GMT
మున్సిపల్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా

ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో టీఆర్ఎస్ ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటుచేశారు. మున్సిపల్ ఎన్నికలు కోసం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా మరికొంత మంది టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీ స్థానాలలో టీఆర్ఎస్ పార్టీనే గెలిచేలా కృషి చేయాలని అన్నారు.

అదేవిధంగా ఈ నెల 7 వ తేదీ నుంచి మునిసిపాలిటీల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటగా ఈ సమావేశాలను మధిర, వైరా, సత్తుపల్లి లో టీఆర్ఎస్ శ్రేణుల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. తరువాత మిగతా ప్రాంతాలలో కూడా కొనసాగిస్తామని పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, వనమా వెంకటేశ్వరరావు , జిలా పరిషత్ చైర్మన్ కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story
Share it