హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పీఎస్ ఎదుట లోకేశ్వరి (40) అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన స్టేషన్ సిబ్బంది లోకేశ్వరి ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పి, ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నిమ్స్ ఆస్పత్రికి తరలించగా…ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నగరమంతటికీ మోడల్ పోలీస్ స్టేషన్ గా నిలిచిన పంజాగుట్ట పీఎస్ ఎదుటే ఈ ఘటన జరగడంతో పోలీస్ అధికారులంతా ఉలిక్కిపడ్డారు.

భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన లోకేశ్వరి..కొద్దిసేపటికే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, అతని తెలుగు, హిందీ భాషలేవీ రాక..తమిళంలో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే కొందరికి మాత్రం మహిళతో వచ్చింది ఆమె భర్త ? లేక ప్రియుడా ? తనతో వచ్చిన వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించినందుకే లోకేశ్వరి ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా ? అన్న సందేహాలు వస్తున్నాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.