కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసిన బిగ్‌బాస్ బ్యూటీ

By సుభాష్  Published on  30 Oct 2020 6:48 AM GMT
కాబోయే భ‌ర్త‌ని ప‌రిచ‌యం చేసిన బిగ్‌బాస్ బ్యూటీ

ఉయ్యాల జంపాల, మళ్లీమళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి పున‌ర్న‌వి. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవి పేరు బాగానే వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ షో రాహుల్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ అంద‌రి నోళ్ళ‌ల్లో నానింది. బిగ్ బాస్ హౌజ్‌లో వీరి ప్ర‌వ‌ర్త‌న చూస్తే బ‌‌య‌ట‌కు వ‌చ్చాక త‌ప్పక పెళ్ళి చేసుకుంటారేమో అనే అనుమానం అంద‌రిలో క‌లిగింది. ప‌లు ఇంట‌ర్వ్యూల‌కు కూడా రాహుల్,పునర్న‌వి ఇద్ద‌రు క‌లిసి హాజరు కాగా..ఆ స‌మ‌యంలో వీరిని.. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ది ప్రేమ‌, స్నేహమా అని ప్ర‌శ్నించారు. దానికి స్నేహ‌మే అని స‌మాధానం ఇచ్చారు.

బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక గ్లామర్ డోస్ కాస్త పెంచి ఫోటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. బుధ‌వారం సోష‌ల్ మీడియాలో ఓ పోస్టుతో అంద‌రికి షాకిచ్చింది. ఆ పోస్ట్‌లో చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని అవతలి అతను తొడిగిన ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఈ అందాల బొమ్మ పెళ్ళి చేసుకునే వ్యక్తి ఎవరు అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.

తాజాగా నేడు తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది. ఉద్భవ్ రఘునందన్ అనే యూట్యూబర్ ను పునర్నవి పెళ్లాడబోతుంది. ఇతడు యాక్టర్, రైటర్, ఫిలిం మేకర్ కూడా అని సమాచారం. యూట్యూబ్ లో కొన్ని వీడియోలతో ఇతడు పాపులర్ అయ్యాడు.ఇక రేపు ఓ పెద్ద స‌ర్‌ప్రైజ్‌ను చెబుతాన‌ని కూడా పోస్టు చేసింది అమ్మడు. మ‌రీ అస‌లు విష‌యం తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు.

Next Story