ప్రభాస్, పూజ హెగ్డే లవ్ స్టోరీ కోసం రిచ్ సెట్

By రాణి  Published on  22 Jan 2020 1:49 PM GMT
ప్రభాస్, పూజ హెగ్డే లవ్ స్టోరీ కోసం రిచ్ సెట్

ముఖ్యాంశాలు

  • ప్రభాస్ , పూజ హెగ్డే కొత్త లవ్ స్టోరీ
  • ఓ పాట కోసం భారీ స్థాయిలో సెట్టింగ్ వేసిన యూనిట్
  • కనీవినీ ఎరుగని రీతిలో సెట్ ని తీర్చి దిద్దిన డైరెక్టర్
  • ప్రేక్షకుల్లో సినిమాపై భారీగా పెరిగిపోతున్న అంచనాలు
  • సోషల్ మీడియాలో సెట్టింగ్ ఫోటోని పోస్ట్ చేసిన ప్రభాస్

పూజా హెగ్డేతో ప్రభాస్ మళ్లీ తెరమీద అద్భుతమైన ప్రేమాయణాన్ని పండిస్తున్నాడు. వీళ్లిద్దరి మీదా షూట్ చేసే పాటకోసం భారీగా ఖర్చుచేసి మరీ హైదరాబాద్ లో ఓ భారీ సెట్టింగ్ వేశారు. ఈ భారీ సెట్టింగ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో తారా స్థాయిలో టాక్ నడుస్తోంది. ఒక పాటకోసం ఇంతవరకూ ఏ సినిమాలోనూ ఇంత భారీ సెట్టింగ్ ని ఏర్పాటు చేసుండరేమో అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చాలా ఎత్తులో ఉన్న సీలింగ్, మొరాకో టైల్స్ తో ఫ్లోరింగ్, చాలా ఖరీదైన కార్పెట్, చాలా చాలా పాతరోజుల్లో కనిపించే అత్యద్భుతమై ఐకానిక్ పియానో, గోడలకు వేలాడుతూ స్టెయిర్ కేస్ ని అనుసరిస్తూ కనిపించే అత్యద్భుతమైన, కళాత్మకమైన వర్ణ చిత్రాలతో కనీవినీ ఎరుగని రీతిలో చాలా భారీ సెట్టింగ్ ని ఈ పాటకోసం రెడీ చేశారు.

ఈ సెట్ ని ఇంత అద్భుతంగా రూపొందించేందుకు చాలా చాలా శ్రమపడాల్సి వచ్చిందని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా దాని గురించే ఆలోచిస్తూ, మిగతా సభ్యుల్ని కలుపుకుని ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుంటూ పోవడంవల్లే ఈ సెట్టింగ్ ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంటానికి అస్కారం కలిగిందని డైరెక్టర్ చెబుతున్నారు. ఈ సెట్ లో పియానో ముందు నిలబడి యాక్ట్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోని ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతమైన రెస్పాన్స్ కనిపించింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత భారీగా పెరిగిపోయాయి. అరవైలు, డెబ్భైల్లో లవ్ స్టోరీకి సంబంధించినట్టుగా ఉందా సెట్ అంటూ నెటిజన్లు ప్రభాస్ పోస్టింగ్ కు ప్రశంశల వర్షం కురిపించారు.

నిజానికి ఇది పాతకాలం లవ్ స్టోరీ కాదని, ఇప్పటివరకూ ఇండియాలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని, మరో వందేళ్లవరకూ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేని లవ్ స్టోరీగా ఇది సినిమా చరిత్రలో నిలిచిపోతుందనీ సినిమా యూనిట్ చెబుతోంది. ప్రేక్షకులు కూడా దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Next Story
Share it