రాజ్ కుంద్రాపై వివాదాస్పద మోడల్ పూనమ్ సంచలన ఆరోపణలు.! 

By Newsmeter.Network  Published on  9 Feb 2020 8:14 AM GMT
రాజ్ కుంద్రాపై వివాదాస్పద మోడల్ పూనమ్ సంచలన ఆరోపణలు.! 

ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై వివాదాస్పద నటి మోడల్ పూనమ్ పాండే సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ కుంద్రా, అతడి అనుచరులపై తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరగా.. వారు నిరాకరించారని అందుకే తాను బాంబే హైకోర్టును ఆశ్రయించానని పూనమ్ పాండే తెలిపింది.

ఆర్మ్స్ ప్రైమ్ మీడియాతో పూనమ్ పాండే 2019లో ఓ కాంట్రాక్ట్ మీద సంతకం చేసింది. ఆ కంపెనీ పూనమ్ పాండే పేరు మీద ఓ యాప్ ను తయారుచేసి.. అందులో వచ్చే లాభాలను పంచుకోవాలని భావించారు. కానీ పూనమ్ పాండే ఆదాయం పంచుకోవడం విషయంలో అన్యాయం జరిగిందని భావించి కాంట్రాక్ట్ ను రద్దు చేసుకొంది. అప్పటి నుండి ఆమెకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కోర్టుకు తెలిపింది. మూడు నెలల పాటూ తాను భారత దేశంలో లేనని.. ఆ తర్వాత వచ్చాక కూడా ఇవే బెదిరింపులు తనకు ఎదురయ్యాయని పూనమ్ చెప్పుకొచ్చింది. చివరికి తాను ఫోన్ నెంబర్ మార్చినా కూడా.. తన నంబర్ కనుక్కొని వేధించారని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయలేదని.. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని కోర్టును కోరింది. రాజ్ కుంద్రా దగ్గర పనిచేసే సౌరభ్ కుష్ తో తాను కొత్త నెంబర్ తీసుకున్నాక ఒకసారి మాట్లాడానని.. అలా మాట్లాడిన తర్వాత కూడా తనకు ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయని పూనమ్ తెలిపింది. ఎప్పుడు పడితే అప్పుడు తనకు కాల్స్ వచ్చేవని.. అభ్యంతకరమైన మెసేజీలు కూడా వచ్చేవని పూనమ్ చెప్పింది. కాంట్రాక్టు రద్దు చేసుకున్నాక కూడా తన ఫోటోలు, వీడియోలు యాప్ లో అప్లోడ్ చేశారని అన్నది.

సౌరభ్ కుష్ పూనమ్ పాండే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాము పూనమ్ పాండేతో యాప్ చేయాలని అనుకున్నామని.. కానీ ఆమె అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలు అభ్యంతకరమైనవి, రెచ్చగొట్టే విధంగా ఉండడంతో తాము యాప్ ను ఆపేశామని అన్నారు. రాజ్ కుంద్రా కూడా దీనిపై మాట్లాడుతూ తాను గత ఏడాది యాప్ లో పెట్టుబడులు పెట్టానని.. డిసెంబర్ లో షేర్స్ ను అమ్మేశానని చెప్పుకొచ్చారు. పూనమ్ పిటీషన్ గురించి తనకు ఏమీ తెలీదని అన్నారు.

పూనమ్ పాండే 2013 లో నషా అనే సినిమాలో ఉపాధ్యాయినిగా నటించింది. టీచర్ విద్యార్థితో రిలేషన్ షిప్ అన్న సబ్జెక్టుతో ఈ సినిమాను రూపొందించారు. 2011 వరల్డ్ కప్ లో భారత్ గెలిస్తే న్యూడ్ షో ఇస్తాను అని చెప్పి పాపులారిటీ సంపాదించుకుంది పూనమ్ పాండే. భారత్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఏవేవో కారణాలు చెప్పిందనుకోండి. తన యాప్ లోనూ, వెబ్సైట్, సోషల్ మీడియా అకౌంట్స్ లో తనకు సంబంధించిన హాట్ వీడియోలను, ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది పూనమ్. అయినా పెద్దగా బాలీవుడ్ అవకాశాలు దక్కడం లేదు.

Next Story