బుట్టబొమ్మకు సల్మాన్ తో రొమాన్స్ చేసే ఛాన్స్..!

By రాణి  Published on  12 Feb 2020 6:03 AM GMT
బుట్టబొమ్మకు సల్మాన్ తో రొమాన్స్ చేసే ఛాన్స్..!

పూజా హెగ్డే.. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్.. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అల.. వైకుంఠపురంలో సినిమా సక్సెస్ ను పూజా ఇప్పుడు ఎంజాయ్ చేస్తోంది. నాన్ బాహుబలి రికార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో జత కట్టింది ఈ భామ..! బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ రాలేదు. మొహంజదారో అంటూ హృతిక్ రోషన్ తో నటించినా, ఆ తర్వాత హౌస్ ఫుల్-4 లో కనిపించినా ఏ ఒక్కటీ సక్సెస్ అవ్వలేదు. ఇక ఎలాగూ ప్రభాస్ తో 'జాన్' సినిమాలో నటిస్తోంది కాబట్టి అది హిందీలోనూ విడుదల అవుతుంది. ఇటువంటి తరుణంలో అమ్మడుకు ఓ సూపర్ ఛాన్స్ వరించింది.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే నటించనుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. సల్మాన్ ఖాన్ తదుపరి సినిమా 'కభీ ఈద్.. కభీ దివాళి' లో నటించనుంది. నదియద్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా రూపొందబోతోంది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. పూజ హెగ్డే కూడా ఈ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంది. 2020 చాలా అద్భుతంగా ప్రారంభమైందని.. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. సల్మాన్ ఖాన్ లాంటి గొప్ప స్టార్ తో నటించబోతుండడం ఎంతో ఆనందంగా ఉందని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

నదియద్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో పూజ హెగ్డే ఇంతకు ముందే హౌస్ ఫుల్-4 లో నటించింది. మరోసారి ఆ బ్యానర్ లో నటించనుంది. తమ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే భాగం అవ్వడం తమకు ఆనందాన్ని కలిగించిందని సాజిద్ నదియద్ వాలా మీడియాతో అన్నారు. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతంగా ఉండడమే కాకుండా.. కథకు ఫ్రెష్ నెస్ తీసుకొని వస్తుందని తాము నమ్ముతున్నామన్నారు. 2021 రంజాన్ కానుకగా 'కభీ ఈద్.. కభీ దివాళి' విడుదల కానుంది. అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఫర్హాద్ సంజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

Next Story