2021 నాటికి పోలవరం పూర్తి : మంత్రి అనిల్ కుమార్‌

By Newsmeter.Network  Published on  26 Nov 2019 3:03 PM IST
2021 నాటికి పోలవరం పూర్తి : మంత్రి అనిల్ కుమార్‌

ప. గో. జిల్లా: ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇటీవల ప్రారంభమైన నేపథ్యంలో.. స్పిల్ వే, కాపర్ డ్యామ్ నిర్మాణాలను పరిశీలించారు. ఇచ్చిన మాట ప్రకారం 2020 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు స్పిల్, కాపర్ డ్యాం పనులు పూర్తి చేస్తామని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్కొ‍న్నారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగానే 2019 నవంబర్‌ 26 నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు స్పీల్ వే పనులను వేగవంతం చేయాలంటూ.. అధికారులను ఆదేశించించారు.

అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. వెయ్యి కోట్ల ప్రజాధనం కాపాడామని మంత్రి గుర్తు చేశారు. కేవలం 30 శాతం మాత్రమే పనులు పూర్తయితే చంద్రబాబు నాయడు 75 శాతం పూర్తి చేశామని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. 2018 నాటికే పోలవరం పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు చెప్పారని, దీనికి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

Next Story