వారందరి కంటే బలవంతుడు నరేంద్రుడు..!

By Newsmeter.Network  Published on  6 Oct 2019 1:09 PM GMT
వారందరి కంటే బలవంతుడు నరేంద్రుడు..!

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వేదికపై తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.తన రాజకీయ చాతుర్యంతో ప్రపంచ పటంపై మువ్వెన్నల ముద్రే కాకుండా..నమో ముద్ర కూడా వేస్తున్నారు. ఒక సంస్థ నిర్వహించిన ప్రపంచ సర్వేలో మోదీ గ్రాఫ్ మిస్సైల్లా దూసుకుపోయింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కంటే 57 దేశాల్లో నిర్వహించిన సర్వేలో తేలింది.

హుస్టన్‌లో నిర్వహించిన హౌడీ మోదీతో ప్రధాని గ్రాప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక విదేశీనేత సమావేశానికి అమెరికా చరిత్రలో అధ్యక్షుడు రావడం ప్రధమం. మోదీ ఎఫెక్ట్ తోనే ట్రంప్ వచ్చారని విదేశాంగ వర్గాలు అప్పుడే స్పష్టం చేశాయి.Next Story