అనూహ్య పరిణామం.. ప్రధాని రాజీనామా..!

By సుభాష్  Published on  24 Feb 2020 8:57 AM GMT
అనూహ్య పరిణామం.. ప్రధాని రాజీనామా..!

మలేషియాలో అనుహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని మహాతీర్ మొహమాద్ పదవి నుంచి తప్పుకొంటూ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయంపై స్పందించేందుకు ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం తిరస్కరించినప్పటికీ, త్వరలో ప్రకటన వెలువడనున్నట్లు పేర్కొంది. ఇటీవల నెలకొన్న రాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త సంకీర్ణాన్ని ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రధాని రాజీనామాకు ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, 2018, మేలో మలేషియా మహతీర్‌ ప్రధానిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. కశ్మీర్‌ ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, ఇటీవల భారత సర్కార్‌ తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ప్రధాని మహాతిర్‌ తీవ్ర విమర్శలు కూడా చేశారు.

Next Story