ముఖ్యాంశాలు

  • బంగ్లాపై చెలరేగిన భారత బౌలర్లు
  • ఇషాంత్ శర్మకు 5 వికెట్లు
  • బంగ్లా 106 పరుగులకు ఆలౌట్
  • ఇండియా174/3
  • క్రీజ్ లోకోహ్లీ, రహానే

కోల్‌కతా: భారత్ మొట్టమొదటి పింక్‌ బాల్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ నిప్పుల్లాంటి బంతులతో చెలరేగిపోయాడు. ఇషాంత్ పింక్‌ తుఫాన్‌కు బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌట్ అయింది. పింక్‌ బాల్‌తో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీసుకున్నాడు. పింక్‌ బాల్ తో ఐదు వికెట్లు తీసుకున్న మొదటి టీమిండియా బౌలర్‌గా ఇషాంత్ చరిత్రలో నిలిచిపోనున్నాడు. ఇక..ఇషాంత్ శర్మకు తోడుగా ఉమేష్ 3 వికెట్లు, షమీ రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ బంతులకు బంగ్లా బేబీలు వణికిపోయారు.

Bangladesh opted to bat after winning the toss

Rohit Sharma takes a stunning catch at second slip

ఆగకుండా పెవిలియన్ బాట పట్టిన బంగ్లా బ్యాట్స్ మెన్

పింక్‌బాల్ టెస్ట్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. బంగ్లా 15 పరుగుల దగ్గర మొదటి వికెట్ కోల్పోయింది. ఇమ్రుల్ 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్ ఎల్బీగా పెవిలియన్ పట్టించాడు. కెప్టెన్‌ హక్‌, మిథున్, రహీమ్‌లు భారత బౌలర్ల ధాటికి డకౌట్లు అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ 26 పరుగలకే నాలుగు వికెట్లు కోల్పోయింది. షాద్‌ మాన్ 29 పరుగుల వ్యక్తిగత స్కొర్‌ వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. లాస్ట్ 4 వికెట్లు కూడా బంగ్లా త్వరితగానే కోల్పోయింది. భారత్ పేసర్లు చెలరేగి 30.3 ఓవర్లకే బంగ్లాను కట్టడి చేశారు.

Ishant Sharma got his second five-wicket haul at home

Umesh Yadav had a productive second spell, picking up three wickets

Shami celebrates the big wicket of Mushfiqur Rahim

కోహ్లీ రికార్డ్

భారత్ 174 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మయాంక్‌, రోహిత్ త్వరగానే అవుటయ్యారు. పూజారా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాదు. కెప్టెన్‌గా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. క్రీజ్‌లో కోహ్లీ, అజంకా రహనే ఉన్నారు.

Pujara and Kohli added 94 runs for the third wicket

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.