మూడో భర్తను ఇంటి నుంచి గెంటేసిన హీరోయిన్‌..!

By సుభాష్  Published on  20 Oct 2020 1:51 PM GMT
మూడో భర్తను ఇంటి నుంచి గెంటేసిన హీరోయిన్‌..!

లాక్‌డౌన్‌ వేళ తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌ వనితా విజయకుమార్‌ మూడో పెళ్లికి సంబంధించిన వివాదాలు ఏ స్థాయిలో వైరల్‌ అయ్యాయో తెలిసిందే. సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన వనిత సినిమాల్లో కంటే.. వివాదాల వల్లే ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. 40 ఏళ్ల వయసులో ఇటీవల మూడో పెళ్ళి చేసుకొని వార్తల్లో నిలిచింది.

సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ని వనితా జూన్‌లో పెళ్లి చేసుకుంది. పీటర్ తనను బాగా అర్థం చేసుకున్నాడని, అందుకే ఆయనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నానని అప్పట్లో వనితా ఓ పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే వీరి పెళ్లి మరుసటి రోజు పీటర్ మొదటి భార్య అతడిపై కేసు పెట్టింది. తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్, వనితాను పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపణలు చేశారు. దీంతో వివాదం మొదలైంది. పలువురు సినీ ప్రముఖులు వనితాపై విమర్శలు కురిపించారు. వాటన్నింటికి వనితా గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని న్యాయపరంగా చూసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మూడో భర్తతో కూడా గొడవ పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అదే అర్థం చేసుకునే భర్తను ఇంటి నుంచి గెంటేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. 40 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లిగా ఉన్న వనిత.. మూడో పెళ్లి చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఇప్పుడు పీటర్, వనిత మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని తెలుస్తుంది. గోవా ట్రిప్‌లో మందు ఎక్కువ తాగిన పీటర్‌.. వనితాతో అసభ్యంగా ప్రవర్తించాడని, దాంతో ఆమె అతడిని కొట్టిందని వార్తలొస్తున్నాయి. చెన్నైకి వచ్చిన తర్వాత కూడా పీటర్‌ మద్యం మత్తులో ఉండటంతో అతడిని ఇంటి నుంచి గెంటేసిందని తమిళ మీడియా ప్రచారం చేస్తుంది. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇల్లీగల్‌ మ్యారేజ్‌కి వ్యతిరేకంగా చాలా మంది కోరుకున్న కోరిక నెరవేరింది అంటూ సెన్సేషనల్ కామెంట్ చేసాడు. పీటర్ పాల్‌ను తన్ని తరిమేశారని కామెంట్ పెట్టాడు.

Next Story