చిచ్చుపెట్టిన విహార యాత్ర..!

By Newsmeter.Network  Published on  23 Dec 2019 3:50 AM GMT
చిచ్చుపెట్టిన విహార యాత్ర..!

ఆస్ట్రేలియా అనగానే గత కొద్దిరోజులుగా గుర్తొస్తున్న విషయం అక్కడి కార్చిచ్చులే. న్యూసౌత్ వేల్స్, విక్టోరియా, సోత్ ఆస్ట్రేలియాలో అడవులు తగలబడుతుండటంతో ఎంతో ఆస్తినష్టం జరిగింది. మంటలు ఆర్పే క్రమంలో ఇటీవలే ఇద్దరు సిబ్బంది కూడా మృతి చెందారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ కుటుంబంతో కలసి విహార యాత్ర కోసం హవాయ్ ద్వీపానికి వెళ్లడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే టూర్ అర్థాంతరంగా ముగించుకుని శనివారం నాడు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ప్రధాని మరుసటి రోజే ప్రజలను క్షమాపణ కోరారు.

People protesting

ఈ క్లిష్ట సమయంలో విహరయాత్రకు వెళ్లినందుకు తనను మన్నించాలని అన్నారు. హాలీడేపై తీసుకెళ్లాలని పిల్లలకు మాటిచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని పెద్ద మనసు గల ఆస్ట్రేలియా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానన్నారు. దీనిని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవటం సరికాదన్నారు. మరోవైపు.. పెరిగిపోతున్న భూతాపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తగినన్ని చర్యలు చేపట్టడంలేదన్న ఆరోపణలపై కూడా స్కాట్ మారిసన్ స్పందించారు. ఈ మంటలు పెట్రేగిపోవడానికి భూతాపం కారణమని అంగికరిస్తూనే. ఇంకా అనేక అంశాలు ఈ పరిస్థితికి కారణమని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా వేడి గాలులు వీస్తూ ఉండటం కూడా ప్రధాన కారణమన్నారు.

People protesting In this Saturday, Dec. 21, 2019, photo, NSW Rural Fire Service crew fight the Gospers Mountain Fire as it impacts a property at Bilpin, New South Wales state, Australia. Prime Minister Scott Morrison on Sunday, Dec. 22, apologized for taking a family vacation in Hawaii as deadly bushfires raged across several states, destroying homes and claiming the lives of two volunteer firefighters.(Dan Himbrechts/AAP Images via AP)

Next Story