'పెళ్లి సందడి'లో హీరోయిన్ ఈమేనా ..?

By సుభాష్  Published on  28 Oct 2020 6:58 AM GMT
పెళ్లి సందడిలో హీరోయిన్ ఈమేనా ..?

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.రాఘవేంద్రరావు తెర‌కెక్కించిన రొమాంటిక్ లవ్‌స్టోరి పెళ్లి సంద‌డి. 1996లో విడుద‌లైన ఈ చిత్రం మ్యూజిక‌ల్ బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది. అప్ప‌ట్లో ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఇదే చిత్రాన్ని హిందీ, త‌మిళ భాష‌ల్లో రీమేక్ చేశారు. అక్క‌డా సూప‌ర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే టైటిల్ తో మరో సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రానికి నాటి చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండగా.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. నాటి సినిమాకు సూపర్ హిట్ సంగీతాన్ని అందించిన కీరవాణి ఇప్పటి 'పెళ్లిసందడి'కి కూడా మ్యూజిక్ చేస్తున్నారు.

ఈ కొత్త 'పెళ్లి సందడి'లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడుగా నటిస్తున్నట్టు మొన్ననే అధికారికంగా ప్రకటించారు. అలాగే తాజాగా ఈ చిత్రంలో నటించే కథానాయికను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మలయాళ భామ మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. మొదట్లో కొత్త కథానాయికను ఎంపిక చేస్తారని భావించినప్పటికీ, చివరికి మాళవికను ఎంపిక చేశారు.

నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం , ఇటీవల వచ్చిన ఒరేయ్ బుజ్జిగా సినిమాతో మాళవిక నాయర్‌ మంచి పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు అయితే రోషన్ పక్కన సరిగ్గా సూటవుతుందని ఫిక్స్ అయ్యారట దర్శకుడు. ఇప్పటికే రోషన్ , మాళవికల మీద ఫొటో షూట్, టెస్ట్ షూట్ కూడా జరిగాయని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది . త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని వెళ్లడించే అవకాశం ఉంది.

Next Story