అమరావతి : రాయలసీమ జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో పవన్‌ పలు చర్చలు చేపట్టనున్నారు.ఈ మేరకు డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఆరు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన కొనసాగుతుంది.

దీనిలో భాగంగా పవన్‌ డిసెంబర్‌ 1న రేణిగుంట విమానాశ్రమానికి చేరుకుని.. అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు. అనంతరం రైల్వే కోడూరూలో కడప జిల్లా రైతుల సమస్యలపై పవన్‌ చర్యలు జరపనున్నారు. తర్వాత జిల్లా పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశం కానున్నారు.

డిసెంబర్‌ 2న తిరుపతి, చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ నేతలతోనూ, 3న కడప, రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గాల నేతలతోనూ, 4న మదనపల్లి పార్టీ కార్యక్రమాల్లోనూ, 5న అనంతపురం జిల్లా నేతలతో సమావేశమవుతారు. అనంతరం 6న పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాయలసీమ జిల్లాల్లో జనసేననేతలతో సమావేశమే.. వైసీపీ నేతల వేధింపులపై చర్చిస్తారు. అనంతరం వైసీపీ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని.. పవన్‌ భరోసా ఇవ్వనున్నారు.

Newsmeter.Network

Next Story