బాలీవుడ్‌ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రస్తుతం మాల్దీవుల్లో విహారిస్తోంది. తన అందాలతో అగ్ని రాజేస్తోంది. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో చాలా ముందే సమ్మర్ హీట్ తెచ్చేసింది. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ అంటూ పారీ ఇటీవల చాలా బిజీగా ఉంది. అందుకే చిన్నపాటి గ్యాప్ తీసుకుని సేద దీరేందుకు మాల్దీవుల విహారం ప్లాన్ చేసింది.

31 ఏళ్ల ఈ హాటీ గురువారం తన ఇన్స్టాగ్రామ్ లో అదిరిపోయే పోటోలను అభిమానులతో పంచుకుంది. బులుగు జిలుగు సముద్రంలో బ్లాక్ స్విమ్ సూట్ ధరించి బ్లాక్ సన్ గ్లాసెస్ తో జలకాలాడుతూ కెమెరా కు పోజులిచ్చింది. “సముద్రం మధ్య లో ఒక ఊయల ఊగెను“ అంటూ రాసుకొచ్చిన అమ్మడు మాల్దీవులు నాకు రెండో ఇల్లు లాంటిది. ఇక్కడ విహారాన్ని ఆస్వాధిస్తాను.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది. సముద్రంలో కొంత చోటివ్వమని కొంటెగా అడిగేసింది మరి.Parineeti Chopra Swimsui

ఇంకేముంది అమ్మడు ఫోస్టు చేసిన కొద్ది వ్యవధిలోనే వైరల్ అయ్యాయి. బులుగు జిలుగు మహాసముద్రంలో పరిణీతి బ్లాక్ స్విమ్ సూట్ ట్రీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే పరిణీతి చోప్రా డిసెంబర్‌ నెలలో ఆస్ట్రియా లోయలతోపాటు మంచుకొండల్లోనూ విహరించింది. దట్టమైన మంచులో నల్లరంగు కోటు వేసుకొని ఫోటోకు ఫోజిచ్చారు. ఈ అమ్మడు చలిమంట కాచుకుంటూ ఆస్ట్రియా లోయల అందాలను ఆస్వాదించారు.

పరిణీతి చోప్రా చివరి సారిగా అర్జున్ కపూర్ సరసన `జబారియా జోడీ`(2019) అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ సహా `సందీప్ ఔర్ పింకీ ఫరార్` అనే చిత్రంలోనూ నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ `ది గర్ల్ ఆన్ ది ట్రైన్ అండ్ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` సిరీస్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది. 2011 లో `లేడీస్ వర్సెస్ రికీ బెహల్` అనే చిత్రం తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పరిణీతి చోప్రా.. గోల్మాల్ ఎగైన్- హసీ తో ఫాసీ- ఇషాక్ జాదే- కిల్ దిల్ వంటి చిత్రాల్లో నటించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.