ప్యాంటు జిప్‌లపై YKK అనే అక్షరాలు ఎందుకుంటాయో తెలుసా..?

By సుభాష్  Published on  29 Oct 2020 8:06 AM GMT
ప్యాంటు జిప్‌లపై YKK అనే అక్షరాలు ఎందుకుంటాయో తెలుసా..?

మార్కెట్లో చాలా రకాల ఫ్యాషన్‌ దుస్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల బ్రాండ్ల ప్యాంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక బ్రాండ్ల దుస్తుల్లో ప్యాంట్‌ జిప్‌పై వైకేకే (YKK)అనే అక్షరాలు కనిపిస్తుంటాయి. అయితే ఆ జిప్‌లపై వైకేకే అనే అక్షరాలను పెద్దగా ఎవ్వరు పట్టించుకోని ఉండరు. కానీ ఆ అక్షరాలు ఎందుకుంటాయో మీరు ఎప్పుడైన గమనించారా..? దానికి సమాధానం లేకపోలేదు.

YKK అంటే -యెషిదా కొంగ్యో కుబుషికిగైషా (యోషిదా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌) ఇది జపాన్‌కు చెందిన టాడావో యోషిదా కంపెనీ 1934లో స్థాపించారు. 71 దేశాల్లో 109 యూనిట్లు కలిగి ఉంది ఈ కంపెనీ. ఈ సంస్థ నుంచే ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం ప్యాంట్‌ జిప్‌లు తయారు చేస్తోంది. ఈ సంస్థ కేవలం జిప్పర్‌లోనే కాకుండా జిప్‌లను తయారు చేసే యాంత్రాలను సైతం తయారు చేస్తోంది. జార్జియాలో వైకేకేకి రోజుకు 70 లక్షల జిప్‌లు ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థగా పేరుంది. 1966లో ప్రస్తుతం జీన్స్‌ ప్యాంట్లకు ఉండే వై జిప్‌లను ఈ సంస్థే తయారు చేసింది. ప్యాంట్‌ను కుట్టే మెషీన్‌లోనే ఈ జిప్‌ను పరికరాన్నీ అమర్చడంతో జీన్స్‌ ఉత్పత్తి, అమ్మకాలు చాలా పెరిగాయి.

Pant Zipper Ykk Means 1

1968లో కెనడాలో తొలిసారి ఏర్పాటు

1968లో జపాన్‌ దాటి కెనడాలో తొలిసారి వైకేకే తన శాఖను ఏర్పాటు చేసింది. నాణ్యమైన జిప్‌లను తయారు చేస్తుండటంతో కంపెనీ ఎలాంటి లోటు లేకుండా పోయింది. అనేక దేశాల్లో శాఖలు విస్తరింపజేసి తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీకి పోటీగా ఎన్నో కంపెనీలు వచ్చినా.. ఇప్పటికీ జీన్స్‌ ప్యాంట్ల జిప్‌లు ఈ కంపెనీవే ఉంటాయి. జిప్‌లతో పాటు ఇప్పుడు ఈ సంస్థ దుస్తులు, బ్యాగులు, ఇంతర ఫ్యాషన్‌ సంబంధిత వస్తువులను తయారు చేస్తోంది.

Next Story