పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో మోడల్‌ కాలనీ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పాకిస్తాన్‌ ఎయిర్ పోర్టు అథారిటీ అధికారి ప్రతినిధి అబ్దుల్‌ సత్తార్‌ ధృవీకరించారు.

లాహోర్‌ నుంచి కరాచీకి వస్తున్న ఏ-320 విమానంలో 90 మంది ప్రయాణికులు, సిబ్బందితో మొత్తం 99 మంది ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనేది తెలియాల్సి ఉంది.

అయితే ఎయిర్‌బస్‌ 320 మోడల్‌కు చెందిన ఈ విమానం (పీకే8303 విమానం నెంబర్‌) కరాచీ ఎయిర్‌పోర్టు సమీపంలోని నివాసాల్లోకి దూసుకెళ్లినట్లు అక్కడ స్థానికులు మీడియాకు వెల్లడించారు. ప్రమాదం జరగగానే అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. అయితే ప్రమాదంలో అందరు ప్రయాణికులు కూడా మృతి చెంది ఉంటారని, ఎవరు కూడా బయటపడినట్లుగా కనిపించడం లేదని అక్కడి మీడియా చెబుతోంది.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *